మెదక్

నకిలీ విత్తనాలు అమ్మితే దుకాణాలు సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జూన్ 16: ఖరీప్ సీజన్‌లో డీలర్స్ నకిలి విత్తనాల అమ్మకాలకు పాల్పడితే ఆ దుకాణాన్ని సీజ్ చేయడమే కాకుండా ఆ డీలర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మెదక్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగమణి హెచ్చరించారు. శుక్రవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ గతంలో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతులకు అలాంటి ఒడిదుడుకులు లేకుండా ఎరువుల విషయంలోగానీ, సబ్సిడిపై సరఫరా చేస్తున్న విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామని ఆమె తెలిపారు. మెదక్ జిల్లాకు వరి విత్తనాలు 15 వేల క్వింటాళ్లు అలాట్‌మెంట్ ఉండగా ఇప్పటి వరకు ఆరు వేల 543 క్వింటాళ్లు జిల్లాకు వచ్చాయన్నారు. అందులో 1465 క్వింటాళ్ల వరి విత్తనాలను పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ వంగడాలు సడ్సిడీపైన ప్రభుత్వం అందజేస్తుందన్నారు. మొక్కజొన్న 2927 క్వింటాళ్లు అలార్ట్‌మెంట్ ఉండగా అందులో 550 క్వింటాళ్లు పంపిణీ చేశామన్నారు. జీలుగు 1336 క్వింటళ్లు ఉండగా 1117 క్వింటాళ్లు పంపిణీ చేసినట్లు, జనుము 852 క్వింటాళ్లు అలార్ట్‌మెంట్ ఉండగా అందులో 513 క్వింటాళ్లు పంపిణీ చేశామన్నారు. 57 పిఎసిఎస్‌లు, ఎనిమిది ఆగ్రో సీడ్స్, 95 ప్రైవేటు డీలర్ల ద్వారా విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. చిన్న శంకరంపేట మండలంలో బిపిటి 50 బస్తాలు కల్తీ ఉన్నట్లు గుర్తించి ఆ వెంటనే తెలంగాణ సీడ్ కార్పొరేషన్‌కు వాపస్ చేయడం జరిగిందని అక్కడే ఉన్న డిసిఓ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే వ్తితనాలు, ఎరువులు, పురుగు మందలు సరఫరా చేస్తున్న డీలర్లపై పోలీస్, రెవెన్యూ శాఖలు, వ్యవసాయ శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 50 శాతం సబ్సిడీతో జనుము, జీలుగు విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 33 శాతంతో సోయాబిన్, కందులు, పెసర, మినుము విత్తనాలు సరఫరా చేస్తున్నామన్నారు. ఎరువులు డీలర్లు, సొసైటీలు, మార్క్‌ఫెడ్, కంపెనీ గోదాముల ద్వారా సరఫరా చేస్తున్నాను. ఇందులో యూరియా, డిఎపి, ఎంఓపి, ఎస్‌ఎస్‌ఫి, కాంప్లెక్స్ ఎరువులు ఉన్నట్లు ఆమె తెలిపారు. ఇందులో కూడా ధరలు తేడా వస్తే రైతులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఆమె తెలిపారు.