మెదక్

సర్వే 75 శాతమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, జూన్ 16: మా భూమి-మాపట్టా పేరుతో భూముల వివరాలు సేకరణకు 35 రోజులుగా సర్వే చేపట్టినా వందశాతం పూర్తికాలేదు. జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రత్యేక అధికారి జిల్లా వ్యాప్తంగా పర్యటించి సర్వేను పరిశీలించారు. గత నెల 10 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు సర్వే పూర్తికావడంతో మరో ఐదు రోజులపాటు పొడిగించారు. అయినా భూముల లెక్కలు పూర్తిగా రాలేదు. మెదక్ ఉమ్మడి మండలంలో భూముల లెక్క 75 శాతం వరకే తేలింది. ఇంకా 25 శాతం భూముల లెక్క తేలాల్సి ఉంది. ఈనెల 15 వరకు పొడగించిన సర్వే కార్యక్రమం ముగిసింది. మెదక్ మండలం నుంచి కొత్తగా ఏర్పడిన హవేళీఘణాపూర్ మండలంలో 20 గ్రామ పంచాయతీలుండగా ప్రభుత్వ భూములు, అసైన్డు భూములుపోను 12 వేల మంది రైతులున్నారు. ఇందులో 9 వేల మంది రైతుల నుంచి వివరాలు సేకరించారు. 72 శాతం సర్వే పూర్తయింది. ఇంకా 3 వేల మంది రైతుల నుంచి వివరాలు రావాల్సి ఉందని మండల వ్యవసాయ అధికారిణి నాగమాధురి తెలిపారు. ఇక మిగిలిన మెదక్ మండలం, పట్టణంలో 11 వేల మంది రైతులుండగా 8900 మంది రైతుల నుంచి భూముల వివరాలు సేకరించి 75 శాతం పూర్తిచేసినట్లు మండల వ్యవసాయ అధికారి రెబెల్‌సన్ తెలిపారు. గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లినవారు, 1బి సమర్పించనివారి వివరాలు సేకరించాల్సి ఉందన్నారు.
19 నుంచి గ్రామసభలు
సర్వే పూర్తికాగా మిగిలిన రైతులకు సంబంధించిన వివరాల కోసం ఈ నెల 19 నుంచి గ్రామసభలు నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారులు రెబెల్‌సన్, నాగమాధురిలు తెలిపారు. గ్రామాలవారీగా షెడ్యూల్ తయారుచేసి ముందుగా సమాచారమందిస్తామన్నారు. గ్రామసభల్లో ఇప్పటి వరకు సేకరించిన సర్వే వివరాలు తెలియజేసి, మిగిలినవారి వివరాలు సేకరించనున్నట్లు తెలిపారు. సమాచారం అందజేయనిరైతులు 1బి సమర్పించాలని సూచించారు.