మెదక్

రైతులను మోసం చేస్తున్న కేసిఆర్ ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయంపేట, జూన్ 16: రైతులను కేసిఆర్ ప్రభుత్వం మోసం చేస్తుందని శాసనమండలి పక్షనాయకుడు షబ్బీర్‌అలీ అన్నారు. శుక్రవారం రామాయంపేటకు వచ్చిన సందర్బంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ధాన్యం అమ్మిన డబ్బులు రాకపోవడంతో పెట్టుబడులు పెట్టేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఐకెపి ద్వారా ధాన్యం విక్రయిస్తే 24గంటల్లో డబ్బులు ఇస్తామన్న ప్రభుత్వం 50రోజులు గడిచిన రైతులకు చెల్లించలేదన్నారు. కొన్ని చోట్ల బ్యాంకుల్లో వేసిన వారి డబ్బులు ఇవ్వడానికి నోక్యాష్ పేరిట బ్యాంకర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఖరీఫ్‌కు ముందు బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉండగా అందులోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్రంతో మాట్లాడి ఎటిఎంలో నగదు నిల్వలు ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఏడాదిలో ఇద్దరు యువ ఎస్‌ఐలు ఆత్మహత్యలకు పాల్పడడం దురదృష్టకరం అన్నారు. ఉన్నతాదికారులు విధిస్తున్న టార్గెట్లే వారి ఆత్మహత్యలకు కారణం అవుతుందన్నారు. తెరాస ప్రభుత్వంలో పోలీసులు ఒత్తిడికి లోనవుతున్నారని అన్నారు. తెరాస నాయకులు కాంగ్రెస్ పాలనలో ఏమి చేసిందని అడుగడం విడ్డూరంగా ఉందన్నారు. తమ పాలనలోనే తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కెటిఆర్ నోరును అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. రామాయంపేట డివిజన్ కోసం ఆరు మాసాలు ఉద్యమం చేసినా పద్మాదేవేందర్‌రెడ్డి పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ ట్రాక్టర్లు మోసపూరిత కార్యకర్తలకు ఇచ్చిందన్నారు. మియాపూర్ భూకుంభకోణం విచారణ సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రాహుల్‌గాందీ పర్యటనతో కొత్త ఊపు వచ్చిందన్నారు. ఆయన వెంట కాంగ్రేస్ నాయకులు అమరసేనారెడ్డి, హైమద్, రొయ్యల పోచయ్య, ఎడ్ల రాజిరెడ్డితో పాటు పలువురు ఉన్నారు.

అభివృద్ధి పనుల్లో అలసత్వంపై
మంత్రి ఆగ్రహం
సిద్దిపేట, జూన్ 16 : సిద్దిపేట పట్టణంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు శుక్రవారం పాదయాత్ర చేపట్టి అభివృద్ధి పనులను పరిశీలించారు. సిద్దిపేట హైదరబాద్ రోడ్డు పుట్ పాట్ నిర్మాణంలో నిర్లక్ష్యం, రోడ్డు గుంతల మయంగా ఉండటంపై ఆర్ అండ్‌భి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట పట్టణ శివారు పొన్నాల నుంచి కొత్త బస్టాండ్ వరకు 4కి.మీ పాదయాత్ర చేపట్టారు. సిద్దిపేట- హైదరాబాద్ రోడ్డులో డివైడర్ల నిర్మాణం, పుట్‌పాత్ నిర్మాణం పనులను పరిశీలించారు. కొద్దిపాటి వర్షాలకు ఫుట్‌పాత్‌లు కుంగిపోవటంతో, గుంతలు పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు నాణ్యతతో చేపట్టేలా అధికారులు పర్యవేక్షణ నిర్వహించాలన్నారు. వారం రోజుల్లో ఫుట్‌పాట్ పనులు నాణ్యతతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జగ్జీవన్ రామ్ ప్రధాన చౌరస్తాలో రోడ్డుపై గుంతపడటంపై ఆర్‌అండ్‌బి అధికారులకు చూపించారు. అధికారులు ఏంచేస్తున్నారని, ప్రధాన రోడ్లలో గుంతలు పడిన మరమ్మతులు చేపట్టారని ప్రశ్నించారు. పట్టణానికి కొత్తగా వచ్చిన వారు చూస్తే ఏమనుకుంటారని మండిపడ్టారు. వెంటనే రోడ్డుపై పడిన గుంతలను మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. రోడ్డు కిరువైపుల ఖాళీ స్థలాల్లో హరితహారం కింద మంచి చెట్లను నాటాలని ఆటవి శాఖాధికారులను ఆదేశించారు. ఎండిపోయిన చెట్లను తొలగించి కొత్తగా చెట్లను నాటాలని సూచించారు. మంచి చెట్లను నాటి పరిరక్షించాలన్నారు. సిద్దిపేటలో ఉద్యమంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధలు, ప్రజలు హరితహారం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్లు బర్ల మల్లికార్జున్, నాయకులు శ్రీనివాస్, కనకయ్య, శేషుకుమార్, ప్రశాంత్, ఎసిపి నర్సింహరెడ్డి, సిఐ సైదులు తదితరులు పాల్గొన్నారు.