మెదక్

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూన్ 18 : సిద్దిపేట డివిజన్ పరిధిలోని చిన్నకోడూరు మండలంలో రెండు 33/11 కెవి సబ్ స్టేషన్‌ల నిర్మాణానికి 3.41 కోట్ల నిధులు మంజూరైనట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ మండల పరిధిలోని మాటిండ్ల గ్రామంలో 33/11 సబ్ స్టేషన్ నిర్మాణానికి 1. 74 కోట్లు, అనంతసాగర్ గ్రామంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి 1.67 కోట్లతో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. కరెంటు ఉన్న నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయకపోవటం వల్ల లోవోల్టెజీ సమస్యతో బోరు,మోటర్ కాలిపోయెదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ రైతు సమస్యల గూర్చి, వ్యవసాయ రంగానికి, విద్యుత్ రంగానికి పెద్దపీట వేశారన్నారు. అందుకే గ్రామాల్లో లోవోల్టెజీ సమస్య పరిష్కారానికి విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. పట్టణాల వలే గ్రామీణ ప్రాంతాల్లో సైతం 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎస్‌ఐ మృతిపై నిగ్గుతేలని ప్రశ్నలెన్నో
కొండపాక, జూన్ 18: ఒక్కరి తర్వాత ఒక్కరు ఇద్దరు ఎస్‌ఐలు సర్వీస్ రివాల్వర్‌తో ఆత్మహత్యలు చేసుకోవడంతో ప్రజల దృష్టి పోలీసు శాఖ ముఖ్యంగా కుకునూరుపల్లి పోలీసు స్టేషన్‌పై పడింది. శిరీషపై అత్యాచార యత్నం చేయడంతో తన మీదకు వస్తుందని ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని, శిరీష మృతికి కారణమైన నిందితులను మీడియా ముందుకు తీసుకువచ్చే వరకు ప్రచారం చేశారు. కానీ శిరీషపై ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి అత్యాచార యత్నం మాత్రమే చేశాడని పోలీసు ఉన్నతాధికారులే మీడియా ముందు తెలిపారు. నిప్పులేనిదే పొగ రాదనే భావించే పోలీసులే ప్రభాకర్‌రెడ్డి మృతి పట్ల వౌనంగా ఎందుకు ఉంటున్నారు. రాష్ట్ర స్ధాయి అధికారుల చేతుల్లోకి వెళ్లిన ఈ కేసు వారం రోజులు గడుస్తున్నా నిగ్గుతేల్చకపోవడం సర్వత్రా పలు ఆరోపణలు వ్యక్త ఆవుతున్నాయి. ఎస్‌ఐ శిరీష కారణంగానే ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజే శిరీష వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని చేప్పేవారు కదా. ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి మృతి పై ప్రజల మనస్సుల్లో మెదులుతున్న అనుమానాలపై బదులు ఇచ్చేది ఎవరు? ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య ముందు రాసిన సూసైడ్ లెటర్‌లో ఏముంది, ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో గడియ వేసి ఆత్మహత్య చేసుకుంటే రక్తం మరకలు బయట కిటికీ డోర్‌కు, చెట్టు దగ్గర ఎలా వచ్చాయి, కిటికీ డోర్‌కు అంటిన రక్తం మరకలను క్లూస్ టీంతో ఎందుకు పరీశిలించలేదు. అంతేకాదు రెండు రోజులుగా సోషల్ మీడియాలో మరోట్విస్ట్ షికార్లు చేస్తుంది. ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డిని కాల్చి చంపారంటూ వాట్స్ ఆప్, ఫేస్‌బుక్ వంటి వాటిల్లో హల్‌చల్ చేస్తుంది. ఎస్‌ఐ ప్రభాకరెడ్డి ఆత్మహత్య చేసుకోలేదని కాల్చి చంపారని ఓ కానిస్టేబుల్ ఆరోపిస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో బ్రేక్ చేస్తుంది. ఉన్నతాధికారుల వేదింపులు లేకపోతే ఆ సూసైడ్ నోట్ ఎప్పుడో బయట పెట్టేవారు కదా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి మృతిపై సిఎంకు నివేదిక ఇచ్చినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఆ మధ్య సిఎం ఎస్‌ఐ, పోలీసు సిబ్బందితో నిర్వహించిన సమావేశం తర్వాత ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి అధికారుల వేధింపులు, మామూళ్ల విషయంపై లెటర్ రాశాడని, అప్పటి నుంచి ప్రభాకర్‌రెడ్డిని టార్గెట్ చేశారని అంటున్నారు. ఆదేకాకుండా కానిస్టేబులే అధికారులను ఎదిరించే సహసం చేయలేక కాల్చి చంపారనే విషయం అన్ని వర్గాల ప్రజలకు చేరేందుకు సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. ఎస్‌ఐ మృతిపై ఎలాంటి కేసులు నమోదు చేశారో తెలుపడం లేదు. కుకునూరుపల్లి స్టేషన్లో ఏ ఒక్క పోలీసు సిబ్బంది కూడా పెదవి విప్పడంలేదు. కేసు విచారణ ఎంత వరకు వచ్చిందనే విషయం అడిగితే ఏమో మాకు తెలియదు అంటున్నారు. ఉన్నతాధికారులు వారి నోటికి తళాలు వేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎస్‌ఐ మృతి చెందిన విషయం ప్రజల్లోకి వెళ్లింది. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కాబట్టి ప్రతి విషయం ప్రజలకు తెలపాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

వర్షాలతో ఖేడ్ అస్తవ్యస్తం
* అనంతసాగర్ వాగులో కొట్టుకుపోతున్న
ఇద్దరు యువకులను రక్షించిన స్థానికులు
* కంగ్టికి రాకపోకలు బంద్
నారాయణఖేడ్ జూన్ 18: నారాయణఖేడ్ ప్రాంతంలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు రమేష్, రవిన్‌లు బైకుపై అదివారంనాడు ఒంటి గంట సమయంలో ఖేడ్‌కు వస్తున్నారు. అప్పటికే భారీ వర్షం కురుస్తుందని కొద్ది పాటి వరద నీరు పారుతుందని బావించి వాగు దాటేందుకు బైకుతో వెళ్తుండగా భారీ వరద నీరు రావడంతో బైకుతో పాటు కొట్టుకుపోతున్న యుకులను స్థానికులు రక్షించారు. అరు నెలలు క్రితం ఇదే వాగులో అంత్వార్ గ్రామానికి చెందిన యువకుడు కిలో మీటరు దూరం కొట్టుకుపోయి చందాపూర్ శివారులో శవమై కనిపించాడు. వాగులో పెద్ద బ్రిడ్జి నిర్మిస్తే తప్ప ప్రయాణికులకు గ్రామస్థులకు ప్రాణాలకు ముప్పుతప్పదని గ్రామస్థులు అంటున్నారు. ఎప్పుడైనా భారీ వర్షాలు కురిసిన 4 గంటల పాటు వాగులో వస్తున్న వరద నీరుతో రాక పోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు తెలుపుతున్నారు.
రాంతీర్థ వాగులో భారీగా వరద
కంగ్టి కేంద్రానికి రాక పోకలు నిలిపి వేత
కంగ్టి : నారాయణఖేడ్ నుంచి కంగ్టి మండలా కేంద్రానికి నిత్య బస్సులు ప్రైవేటు వాహనాలు వెళ్ల్తుంటాయి. అదివారంనాడు ఒంటగంటకు కురిసిన భారీ వర్షానికి కంగ్టి వాగులో భారీగా వరద నీరు వచ్చి రాక పోకలకు ఇబ్మందులు ఎదుర్కొన్నారు. అదే విధంగా రాంతీర్థ గ్రామం వద్ద కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జితో పక్క నుంచి రాక పోకలకు వేసిన రోడ్డు భారీగా వరద నీరు రావడంతో కొట్టుకు పోయి ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులకు ప్రైవేటు వాహనదారులకు అనేక ఇబ్బందులు ఎదురైనట్లు ప్రయాణికులుతెలిపారు. కంగ్టి మండలంలో భారీగా వర్ష కురిసిందని రెవెన్యూ అధికారులు తెలిపారు. వాగులు వంకలు చెరువులు, కుంటలోనికి వరద నీరు వచ్చి చేరిందని రైతులు అంటున్నారు.

నాలాల ఆక్రమణ ఇలా!
మురుగు నిష్క్రమణ ఎలా?
జహీరాబాద్, జూన్ 18: పట్టణ పరిధిలో వరదనీటి కాల్వలు మురుగునీటి కాల్వలుగా రూపాంతరం చెందాయి. కాల్వలు కబ్జాకు గురవడంతో వరద వచ్చినప్పుడల్లా కాల్వల్లోనుంచి మురుగునీటి పారుదల సవ్యంగా సాగడంలేదు. దీంతో వర్షపునీటితో కలిసిన మురుగునీరు ఇళ్లల్లోకి, రోడ్లపైకి పారుతోంది. స్థానికులతోపాటు రహదారి ప్రయాణికుల రాకపోకలకు అంతరాయంగా మారుతున్నాయి. పట్టణానికి ఆనుకుని ఆంధ్రా బ్యాంకు ఎదురుగా, పక్కనుంచి పారే వరద కాల్వ కొనే్నళ్లనుంచి సాగిన ఆక్రమణలతో పూర్తిగా కుంచించుకు పోయింది. దీంతో వర్షం వచ్చినప్పుడల్లా మురుగునీటి పారుదల పూర్తిగా స్తంభిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు పరిస్థితి పునరావృతమైంది. కాల్వలో నిలిచిన మురుగునీరు ఇళ్లలోకి పారుతోంది. దీంతో జెసిబి సహాయంతో పూడిక తొలగింపుకు సన్నహాలు చేపట్టారు. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో బోరు మోటారు సహాయంతో కల్వర్టునుంచి మురుగునీటిని పంపించేందుకు ప్రయత్నించారు. మున్సిపల్ చైర్మన్ భర్త తంజిమ్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఇక్కడి పనులను పర్యవేక్షిస్తున్నారు. వరద కాల్వల పరిరక్షణకోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు పాలకులను కోరుతున్నారు. పట్టణంలోని ప్రధాన మురుగునీటి కాల్వలను మెరుగుపర్చాలంటున్నారు. ఆక్రమణలకు గురవుతున్న వరద కాల్వలు, మురుగునీటి కాల్వల పరిరక్షణకోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆక్రమణలను నిరోధించి నాలాలు కనుమరుగవకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

20న సిఎం చేతుల మీదుగా గొర్రెల పంపిణీ
* కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి
కొండపాక, జూన్ 18: సిఎం కెసిఆర్ కొత్తగా ప్రవేశపెడుతున్న గొల్ల కురుమ అభివృద్ధి పథకాన్ని కొండపాకలో ప్రారంభించేందుకు సభ స్ధలాన్ని పరిశీలించటం జరిగిందని కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి తెలిపారు. ఆదివారం కొండపాకలో అధికారులు, వివిధ గ్రామల ప్రజాప్రతినిదులతో సమావేశం నిర్వహించారు. గొల్లకుర్మ, యాదవ సంఘాల అభివృద్ధికి ముఖ్యమంత్రి ఏంతోకృషి చేస్తున్నారన్నారు. కొండపాక మండలం మొత్తంలో 825 మంది లబ్ధిదారులకు గొర్రెల పంపిణి చేయడం జరుగుతుందన్నారు. యూనిట్ విలువ 1,25,000 లబ్ధిదారుడి వాటా కాగా 31,150, ప్రభుత్వం తరపున 91,250 కలిపి యాదవ కుల సంఘాలకు లబ్ధి చేకూర్చడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ నుండి గొర్లను తీసుకురావడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో గొల్ల కుర్మలు నూతన పద్ధతులను అనుసరించి అభివృద్ధి చెందాలన్నారు. గొల్ల కుర్మ జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం అధికారులు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఇప్పుడు వచ్చే గొర్లకు వాటి ఆరోగ్య సమస్యలుంటే వెటర్నరీ డాక్టర్లను సంప్రదించాలన్నారు. ఇప్పుడు వచ్చే గొర్లు 1నుంచి 100 కావాలే కాని 100 నుంచి 1 కావద్దన్నారు. ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని గొర్ల పెంపకంపై దృష్టి పెంటాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇండ్ల నిర్మాణ చైర్మన్ భూంరెడ్డి, డిసిసిబి చైర్మన్ దెవేందర్‌రెడ్డి, గఢా అధికారి హన్మంతరావు పాల్గొన్నారు.
ప్రభుత్వ రుణమాఫీ వడ్డీలకే సరి

* విత్తనాలు, ఎరువులు కొనడానికి డబ్బుల్లేక రైతుల ఇక్కట్లు
* ఎన్‌డిఎస్‌ఎల్ పరిశ్రమను ప్రభుత్వమే నడిపించాలి
* మెదక్ జిల్లా టిడిపి అధ్యక్షుడు బట్టి జగపతి డిమాండ్
మెదక్, జూన్ 18: ఖరీప్ సీజన్‌లో రైతులు అనేక ఇక్కట్లకు గురవుతున్నారని మెదక్ జిల్లా టిడిపి అధ్యక్షులు బట్టి జగపతి తెలిపారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు సిద్దంగా ఉంచినప్పటికీ వాటిని కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక రైతులు నానా తంటాలు పడుతున్నారన్నారు. ప్రభుత్వం మాఫీ చేసిన రుణాలు వడ్డీ క్రింద పోయాయని, బ్యాంక్‌లు కొత్త రుణాలు ఇవ్వడానికి చేతులెత్తేసిందని ఆయన తెలిపారు. అందువలన బ్యాంక్ అధికారులు పాత అప్పులు చెల్లించి కొత్త రుణాలు పొందాలని సూచించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారని ఆయన తెలిపారు. బ్యాంక్‌లలో జమైన యాసంగి ధాన్యం డబ్బులు బ్యాంక్‌లు సంపూర్ణంగా ఇవ్వడం లేదన్నారు. బ్యాంక్‌లు రోజుకు రెండు నుండి మూడు వేలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ఎటియంలు పనిచేయడం లేదు, పనిచేస్తున్న ఎటియంలలో రెండు నుంచి నాలుగు వేల వరకే డ్రా చేసుకోడానికి వీలు చేశారు. దాంతో ప్రజలు, రైతులు డబ్బు కోసం విలవిలలాడిపోతున్నారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ తప్పిదాలతో డబ్బు కోసం ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలన చేస్తుందని ఆయన ఆరోపించారు. సొసైటీలలో ఎరువులు, విత్తనాలు ఏర్పాటు చేశారు. కానీ వాటిని ఖరీదు చేసేందుకు డబ్బు లేదన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు ధీనావస్థలో ఉన్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఏకైక పరిశ్రమ ఎన్‌డిఎస్‌ఎల్ మెదక్ జిల్లాలో ఉంది. ఎన్‌డిఎస్‌ఎల్‌ను ప్రభుత్వం మూసివేయడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. రైతులు చెరుకు పండించడంలో వెనుకంజ వేశారని ఆయన తెలిపారు. ఎన్‌టి రామరావు ప్రభుత్వంలో తొమ్మిది నెలల్లో మెదక్ ఎన్‌డిఎస్‌ఎల్ పరిశ్రమను నిర్మించి ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లా చెరుకు పంటలో రైతులు ఎంతో సాధించిన విషయాన్ని ఆయన వివరించారు. రోజుకు 2500 చెరుకు క్రస్సింగ్ జరిపించిన చరిత్ర మెదక్ ఎన్‌డిఎస్‌ఎల్ పరిశ్రమకు ఉందన్నారు. రైతులు చెరుకు పంట ద్వారా ఆర్దికంగా ఎదిగారని ఆయన తెలిపారు. వందలాది మంది కార్మికులు, వేలాది మంది రైతులు ఎన్‌డిఎస్‌ఎల్ పరిశ్రమ మూతపడటంతో రోడ్డున పడ్డారన్నారు. 2017లో చెరుకు పంట సంపూర్ణంగా నిలిచిపోయిందని, పట్టణంలో తాను ఒక్కడినే ఐదు ఎకరాల చెరుకు పంట వేశానని ఆయన తెలిపారు. తెరాస ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు అమలులో లేవని ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలు కూడా అమలు కాలేదని జగపతి ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల సంక్షేమాన్ని గుర్తించుకొని ఎన్‌డిఎల్‌ఎల్ పరిశ్రమను ప్రభుత్వమే నడిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఖరీప్ సీజన్‌లో రైతులకు బ్యాంక్‌ల నుండి రుణాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇల్లు కూల్చుతుండటంతో తట్టుకోలేక ఎంఎంటిఎస్ నిర్వాసితురాలి హఠాన్మరణం

రామచంద్రాపురం, జూన్ 18: ఇనాళ్లు నివశిస్తున్న ఇల్లు కళ్లెదుటే కూలిపోతుండటంతో అపేద గుండె తట్టుకోలేకపోయింది. ఎంఎంటిఎస్ రైల్వే లైన్లో ఇల్లు కోల్పోతుండటంతో ఆవేదనకు గురైంది. ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న ఇల్లు తన కళ్లెదుటే అధికారులు కూల్చివేస్తారన్న నిజాన్ని జీర్ణించుకోలేని ఆ పేద గుండె ఆగిపోయింది. ఈ సంఘటన ఆదివారం రాచందా పురం పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...
శంకర్‌పల్లి మండలం కమ్మెట గ్రామానికి చెందిన దుర్గాబాయి (33) బతుకుదెరువు కోసం 25 ఏళ్ల క్రితం రామచంద్రాపురం ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియాకు వచ్చింది. ఒక చిన్న ఇంటిలో నివశిస్తున్న ఆమె కూలీనాలీ చేస్తూ బతుకు ఈడుస్తోంది. దుర్గాబాయికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా ఎంఎంటిఎస్ రైల్వేలైన్ విస్తరణలో బాగంగా ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియాలో కొంత మంది తమ ఇళ్లను కోల్పోతున్నారు. ఇళ్లు కోల్పోతున్న వారికి మరోచోట ప్ర త్యామ్నాయం చూపిస్తామని అధికారులు హామీ ఇచ్చి ఆ ఇళ్ల్లను కూల్చివేసే పనిని ప్రారంభించారు. దీంతో ఆదివారం దుర్గాబాయి ఇల్లును కూల్చివేస్తామని తెలుపడంతో తట్టుకోలేక నిరాశకు గురై తనువు చాలించింది. ఈవిషయం తెలియగానే స్థానికులంతా దుర్గాబాయి కోల్పోతున్న ఇంటి వద్దకు చేరుకున్నారు. ఎన్నో ఏళ్లుగా నివశిస్తున్న ఇల్లు కూల్చివేస్తామనడంతోనే దుర్గాబాయి తట్టుకోలేక చనిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయం తెలుసుకున్న బిజెపి నాయకురాలు దుర్గాబాయి, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఎంఎంటి ఎస్ విస్తరణ పేరుతో పేదవాళ్ల ఇళ్లు లాక్కోవడం రాజ్యాంగ విరుద్ధమని దీనికి ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి రాష్ట కార్యవర్గసభ్యుడు అంజిరెడ్డి బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేశారు.