మెదక్

సర్కార్ పంపిణీ చేసిన గొర్రెలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, అక్టోబర్ 16 : రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా గొర్ల కుర్మలకు సబ్సిడిపై పంపిణీ చేసిన గొర్రెలను విక్రయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపిడిఓలు, తహశీల్దార్లు, పశుసంవర్ధక శాఖ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్పరేన్స్ నిర్వహించారు. గొర్రెల పంపిణీ పథకం, హరితహారంపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గొర్రెల కోసం సోసైటీల ద్వారా 6800 గొర్రెల యూనిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో 402 సోసైటీల ద్వారా ప్రతి సోసైటీ పరిధిలో సభ్యులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో ఏట్టి పరిస్థితిలో ఒక్క యూనిట్ కూడ అమ్మటం, రీ సైక్లింగ్ చేయటం వంటి సంఘటనలు జరుగువద్దని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ గొర్ల కుర్మల ఆర్థిక అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా 4వేల కోట్లు వెచ్చించి సబ్సిడిపై గొర్రెలను పంపిణీ చేస్తుందన్నారు. గొర్రెల యూనిట్లను అమ్మితే అమ్మిన వారిపై ఎంపిడిఓ, వెటర్నరీ అధికారులు పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతారని హెచ్చరించారు. పంపిణీ చేసిన గొర్రెల యూనిట్ల ఫోటోలో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. వెటర్నరీ అధికారులు పంపిణీ చేసిన గొర్రెల యూనిట్ల వివరాలు గ్రామాల వారిగా ఎంపిడిఓలకు అందించాలని సూచించారు. ఎంపిడిఓలు, వెటర్నరీ అధికారులు తమ సిబ్బందితో మండలంలో పంపిణీ చేసిన గొర్రెల యూనిట్లను తనిఖీ చేయాలన్నారు. ఎవరైన అమ్మితే డబ్బులు రికవరీ చేయాలని, వెటర్నరీ అధికారులను ఆదేశించారు. వెటర్నరీ అధికారులు, ఎంపిడిఓలు రోజు వారిగా పంపిణీ చేసిన గొర్రెల వివరాలు అందించాలన్నారు. గొర్రెల పంపిణీ పథకం పకడ్బందిగా అమలయ్యేల పర్యవేక్షణ చేయాలని, ఎట్టిపరిస్థితుల్లో దుర్వినియోగం కాకుదని అధికారులను ఆదేశించారు.
హరితహరంలో నాటిన ప్రతి మొక్కను బతికించాలి
హరితహరం కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారులు, ఎంపిడిఓలు, ఎపిఎలు ప్రతి గ్రామంలో పర్యటించాలని కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. జిల్లాలో పెద్దఎత్తున ఖర్చుచేసి మొక్కలు,ట్రీగార్డుల, ఎరువులు సరఫరా చేశామని, నాటిన ప్రతి మొక్కను వందశాతం బతుకించాలన్నారు. వచ్చే సంవత్సరం మళ్లీ అవెన్యూ, ఇనుస్టూటేషన్ ప్లాంటేషన్ ఉండకుండ మొక్కలను పరిరక్షించాలన్నారు. ఈనెల 20 నుండి హరితహరం మొక్కలను పర్యవేక్షించేందుకు తాను స్వయంగా గ్రామాలను పర్యటిస్తామని, జిల్లాలో 400 గ్రామాలు 10 రోజుల్లో పర్యటిస్తానన్నారు. హరితహరం కార్యక్రమంలో సక్రమంగా పనిచేయని పీల్డు, టెక్నికల్ అసిస్టేంట్లపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఎంపిడిఓలకు మెమోలు జారీ చేస్తామన్నారు. మండల ప్రత్యేకాధికారులు పూర్తిగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈసమీక్షలో పశుసంవర్ధక శాఖాధికారి అంజయ్య, డిఆర్‌డిఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు.