మెదక్

కరువుతీర్చే బావే కడతేర్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, అక్టోబర్ 16: మంచినీటి కరువును తీర్చేందుకోసం తవ్వించిన బావి ముగ్గురు విద్యార్థుల ప్రాణాలు బలితీసుకుంది. 15 సంవత్సరాల కిందట తవ్విన బావి పాడుబడి మట్టితో పూడ్చుకుపోయి కుంటలా మారింది. ఇటీవల కురిసిన వర్షపునీటితో నిండిపోయింది. ముగ్గురు చిన్నారులను పొట్టన పెట్టుకుంది. ఈ దుర్ఘటనలో కొత్తూర్(కె)కు చెందిన నర్సిములు కుమారుడు అవినాష్, దుర్గయ్య కుమారుడు శివకుమార్, ఖానాపూర్‌కు చెందిన పరుశురామ్ కుమారుడు ప్రవీణ్‌కుమర్‌లు మృతిచెందారు. మృతులంతా అన్నదమ్ముల పిల్లలు, బంధువులే కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలిసిన వెంటనే ఆదివారం రాత్రే ఎంపి బిబి.పాటిల్, ఎమ్మెల్సీ ఎండి.్ఫరీదుద్ధీన్‌లు, ఇన్‌చార్జి మాణిక్‌రావులు మృతుల కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. మృతులకు సంతాపం ప్రకటించారు. అవసరమగు సహాయక చర్యలు చేపట్టారు. రాత్రికి రాత్రే పోస్టు మార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రభుత్వ సహాయం అందించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.
విషాదంలో విద్యార్థి లోకం
జహీరాబాద్ డివిజన్ కోహీర్ మండలం ఖానాపూర్, కొత్తూర్ (బి)గ్రామాల్లో ముగ్గురు విద్యార్థుల మృతి సంఘటన విద్యార్థి లోకాన్ని విశాదంలో ముంచింది. రక్త సంబంధికులైన మూడు కుటుంబాకు చెందిన ముగ్గురు చిన్నారులు ఒకే సారి మృత్యు ఒడికి చేరడంతో గ్రామస్థులు, విద్యార్థి లోకాన్ని దుఃఖ సాగరంలో ముంచెత్తింది. మృతులు కొత్తూర్(కె)కు చెందిన నర్సిములు కుమారుడు అవినాష్ (11) కోహీర్ హైస్కూల్‌లో 6వ తరగతి చదువుతుండగా దుర్గయ్య కుమారుడు శివకుమార్ (14)లు అదే హైస్కూల్‌లో 8వ తరగతిలో చదువతున్నాడు. నర్సిములు చెల్లెలు లక్ష్మి కుమారుడు ప్రవీణ్ (11)ఖానాపూర్‌ని ప్రభుత్వ పాఠశాలలోనే 5వ తరగతి చదువుకుంటాడు. ఆదివారం సెలువు దినం కావడంతో మగ్గురు చిన్నారులు మేకలు మేపెందుకు అడవికి వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగివస్తూ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందారు. అనుమానంతో బావిలో గాలింపు చర్యలు చేపట్టిన స్థానికులు ముగ్గురి మృత దేహాలను వెలికి తీశారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. సోమవారం తహసిల్దారు ప్రవీణ్ కుమార్, ఆర్‌ఐ. శ్రావణి ఇతర రెవిన్యూ అధికారులు గ్రామానికి చేరుకుని మృతుల వివరాలు, జిరిగిన సంఘటన గురించి తెలుసుకున్నారు.

ఇమామొద్దీన్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి
* డిసిసి మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు కలీమోద్దీన్
సిద్దిపేట, అక్టోబర్ 16 : సిద్దిపేట ఎన్సాన్‌పల్లి బైపాస్ రోడ్డులో పట్టణానికి చెందిన ఇమామోద్దీన్ బైక్‌పై వెళ్తుండగా ప్లెక్సి పడి మృతిచెందారని, ఆ కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిసిసి మైనార్టీ కాంగ్రెస్ అధ్యధ్యక్షుడు కలీమోద్దీన్ డిమాండ్ చేశారు. సోమావారం సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లెక్సిలు ఏర్పాటు చేసేటప్పుడు అనుమతి తీసుకోవాలని ఏర్పాటుచేయాలని, ప్లెక్సిల ఏర్పాటు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికార యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇమామోద్దీన్ కుటుంబానికి నష్టపరిహారంతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆకుటుంబానికి న్యాయం జరిగే కాంగ్రెస్ పార్టీ పక్షాన అండగా ఉంటామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండ అధికార యంత్రాంగం చర్యలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. డిసిసి కార్యదర్శి అత్తుఇమామ్, నాయకులు షాబోద్దీన్, అక్బర్, వాహేబ్, రశీద్, ఆరీఫ్, అత్తర్, ఫైజోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.