మెదక్

ఆడబిడ్డలకు సర్కారు ఆసరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, అక్టోబర్ 16: నవంబర్ మొదటి వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మెదక్ కలెక్టరేట్ భవనానికి భూమిపూజ చేస్తారని ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం మెదక్ ఉపసభాపతి క్యాంప్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అంతకు ముందు తొమ్మిది మంది కల్యాణ లక్ష్మిలబ్ధిదారులకు, 21 మంది ముస్లింలకు షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 13 లక్షల 36 వేల 276 రూపాయల చెక్కులను ఆమె పంపిణీ చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద 1020 మంది లబ్ధిదారులకు రూ.6.30 కోట్ల పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదరికంలో మగ్గుతున్న ఆడబిడ్డల కష్టాలు తెలుసుకొని ముందుగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌కు 51 వేలు మంజూరు చేసిన విషయం ఆమె గుర్తుచేశారు. ఆ తరువాత దానిని 75 వేల 116 రూపాయలకు పెంచుతూ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గతంలో పెళ్లికూతురు పేరుతో అత్తమామలకు చెక్కులు పంపిణీ చేశామని, ఆ నిధులు అప్తా పేరుమీద ఇవ్వడం వలన దుర్వినియోగం కావడం జరిగిందన్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని సిఎం కెసిఆర్ పెళ్లి కూతురు తల్లిపేరు మీద చెక్కులను అందజేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 1020 మంది లబ్ధిదారులకు 6.30 లక్షల రూపాయలను ప్రభుత్వం మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే రెండు డిగ్రీ కళాశాలలు నడుస్తున్నాయని, అదనంగా మరో రెండు డిగ్రీ కళాశాలలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. బిసీ బాలుర స్కూల్‌కు ప్రతిపాదనలు చేయడం జరిగిందన్నారు. రెసిడెన్షియల్ బాలుర స్కూల్ కూడా ప్రతిపాదన చేయడం జరిగిందన్నారు. త్వరలో మెదక్ కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ లేదా పురపాలక సంఘం మంత్రి కెటిఆర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. మెదక్‌లో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. రోడ్డు విస్తీర్ణకు ప్రజలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పెద్దబజార్ రోడ్డు విస్తరణలో దుకాణదారులు, ఇంటి యజమానులు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇది మంచి కార్యక్రమం, 50 శాతం ఆస్తులు కోల్పోయిన వారికి డబుల్ బెడ్‌రూమ్‌లు మంజూరు చేస్తానని పెద్దబజార్ రోడ్డు నిర్మాణంలోని యాజమాన్యాలకు ఆమె భరోసా ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మెంచు నగేష్, మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, తహశీల్దార్ యాదగిరి, కౌన్సిలర్లు అంకం చంద్రకళ, అనుషా అరవిందగౌడ్, ఐతారం నర్సింలు, ఎంపిపి లక్ష్మీ కిష్టయ్య, జడ్పిటిసి లావణ్యరెడ్డి, వైస్ చైర్మన్ రాగి అశోక్, తెరాస నాయకులు గౌస్ ఖురేష్, అంజాగౌడ్, పిఆర్‌ఓ జీవన్‌రావు, గడ్డమీది కృష్ణాగౌడ్, కల్లంపేట యాదగిరి తదితరులు పాల్గొన్నారు.