మెదక్

ఘణపురం ప్రాజెక్ట్‌లో భక్తుడు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, అక్టోబర్ 16: ఏడుపాయల ఘణపురం ప్రాజెక్ట్ క్రింది భాగంలో కొనసాగుతున్న నీటి ప్రవాహంలో భక్తుడు కొట్టుకుపోవడంతో, గజ ఈతగాళ్లు అప్రమత్తమై కాపాడిన ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. సంగారెడ్డి జిల్లా గొట్టిముక్కుల ఘణపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ ఏడుపాయల వనదుర్గ్భావానిమాత దర్శనం కోసం అదే గ్రామానికి చెందిన మరో నలుగురితో కలిసి సోమవారం మధ్యాహ్నం ఏడుపాయలకు వచ్చాడు. ఏడుపాయల మంజీర ప్రాజెక్ట్ క్రిందిభాగంలో స్నానం ఆచరించడానికి వెళ్లి ఈత కొట్టుకుంటూ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో సత్యనారాయణ కొట్టుకుపోయాడు. నీటి ప్రవాహంలో సత్యనారాయణ చెట్టును పట్టుకొని కొమ్మలపైకి ఎక్కి కూర్చున్నారు. స్థానికులు, యాత్రికులు ఇచ్చిన సమాచారంతో ఆలయ చైర్మన్ పి.విష్ణువర్దన్‌రెడ్డి, పాపన్నపేట ఎస్సై సందీప్‌రెడ్డిలు అప్రమత్తమై భక్తుడు సత్యనారాయణను కాపాడేందుకు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. ఘణపురం ప్రాజెక్ట్‌లో గజ ఈతగాళ్లు మల్లయ్య, దుర్గయ్య, మొగులయ్యలు అత్యంత చాకచక్యంగా ఆయనను ఒడ్డుకు చేర్చారు. సత్యనారాయణను రక్షించిన గజ ఈతగాళ్లను ఆలయ చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి, ఎస్సై సందీప్‌రెడ్డిలు అభినందించారు. కాగా ఆదివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా నార్సింగికి చెందిన యువకుడు వంశీ మంజీరలో గల్లంతుకాగా, నేటి వరకు ఆచూకి దొరకలేదు. గల్లంతైన వంశీ కోసం ఏడుపాయల ఆలయ చైర్మన్, ఎస్సై, తహశీల్దార్ జంగం రాములు ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లు ఘణపురం ప్రాజెక్ట్ ప్రాంతంలో వెతుకుతున్నారు. సోమవారం రాత్రి వరకు వంశీ ఆచూకి దొరకలేదు.

పేద విద్యార్థుల ప్రగతికే గురుకులాలు
* మంత్రి జోగు రామన్న
మిరుదొడ్డి, అక్టోబర్ 16: దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీల విద్యార్థుల కోసం కేజీ టు పిజీ భాగంగా గత 2 సంవత్సరాలలో 522 గురుకుల పాఠశాలలను ప్రారంభించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందని ఆటవీ, బీసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని బాలుర, శేరిపల్లి-బందారం సమీపంలోని బాలికల గురుకుల పాఠశాలను సోమవారంనాడు సందర్శించి, పాఠశాల రికార్డులను పరిశీలించారు. అక్కడ నెలకొన్న సమస్యలను విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకరాగా వెంటనే స్పందించి జిల్లా అధికారులతో చరవాణిలో మాట్లాడారు. సమస్యలను పరిష్కరిస్తామని విద్యార్థులకు మంత్రి హామీ నిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 15లోపు ప్రతి విద్యార్థికి చేనేతలు నేసిన ఏకరూప దుస్తులు అందజేస్తామన్నారు. బాలికల పాఠశాలకు సోంత భవనం లేనందున 10 ఎకరాల్లో 20 కోట్లతో అదునాతన నూతన భవనం నిర్మిస్తామని, దాని కోసం స్థలం సేకరించాలని స్థానిక ఎమ్మెల్యే రాంలింగారెడ్డికి సూచించారు. ప్రతి విద్యార్ధి విద్యలో శ్రద్ద వహించి ఉపాధ్యాయులకు, తల్లితండ్రులకు పేరు, ప్రఖ్యాతలు తీసుకరావలన్నారు. విద్యార్ధులు అన్ని రంగాలలో తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయలన్నారు. ఎమ్మెల్యే రాంలింగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మహాత్మజ్యోతి బాపులే విద్యార్థులే మొదటి స్థానంలో ఉన్నారని పెర్కొన్నారు. రాబోయే రోజుల్లో పీజీ వరకు విస్తరించడం జరుగుతుందన్నారు. అదే విధంగా మంత్రి జోగు రామన్న ఆటవి శాఖ అధికారులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్ధి తమ వంతు బాధ్యతగా మొక్కను నాటి కపాడాల్సిన అవసరం ఎంతైన వుందన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లుగా నేటి మొక్కలే రేపటి వృక్షాలు అవుతాయన్నారు. విద్యార్థులు హరితహారంపై ప్రతి ఒక్కరికి తేలియజేయలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి వీరమణి, ఎంపిపి మంగమ్మ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

పోలీసు అమరవీరుల త్యాగాలు అమూల్యం

సిద్దిపేట, అక్టోబర్ 16 : శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులను నిర్వహిస్తారని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివుకుమార్ అన్నారు. సోమవారం పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని స్థానిక ఎన్జీఓ భవన్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశ భద్రత కోసం దేశా వ్యాప్తంగా 500లకు పైగా పోలీసులు ప్రాణత్యాగాలు చేశారన్నారు. పోలీసులు అందిస్తున్న సేవలకు ప్రజల నుండి గుర్తింపు ఉన్న లేకున్న ప్రజల రక్షణ కోసం విధులను నిర్వహిస్తారన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను వెలకట్టలేనిదని, వారి త్యాగాల ఫలమే నేటి వరంగల్ జిల్లాలో శాంతి స్థాపన జరిగిందన్నారు. ప్రతి నిత్యం ప్రజా సేవలో విధులు నిర్వహిస్తు ప్రాణ త్యాగాలు చేసిన పోలీసు అమరవీరులను స్పరించుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉందన్నారు. రక్తదానం చేయటం వల్ల ప్రమాదం, ప్రాణపాయ స్థితిలో ఉన్న వారిని రక్షించుకోవచ్చు అన్నారు. రక్తదాన శిబిరంలో యువకులు, పోలీసులు, ఉపాధ్యాయులు రక్తదానం చేశారు. రక్తదాన శిబిరంలో సిపి శివకుమార్, ఎసిపి నర్సింహెరెడ్డిలు రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో 103 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈకార్యక్రమంలో సిఐలు నందీశ్వర్‌రెడ్డి, ఆంజనేయలు, సైదులు, ఎస్‌బి ఇన్స్‌పెక్టర్ ప్రసాద్, ఆర్‌ఐ కిషన్‌రావు, పోలీసు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, పిఆర్‌ఓ మల్లికార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.