మెదక్

నకిలీ పత్తి విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవాలంటూ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 11: నకిలీ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏఐకెఎస్ జాతీయ అధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నష్టపోయిన పత్తిరైతులు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం రైతులతో కలిసి ఆయన జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాలతో రాష్టవ్య్రాప్తంగా 13లక్షల ఎకరాల్లో వేసిన పత్తి పంట పూర్తి దెబ్బతిని రైతాంగం నష్టపోయిందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విత్తన హబ్ ఏర్పాటు అంటూ ప్రచారం, నకిలీ విత్తనాలు సరఫరా చేసిన వారిపై పిడియాక్టులంటూ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం దారుణమన్నారు. అంతర్జాతీయంగా నిషేదించిన మొనిషాంటో లాంటి ఎంఎన్‌సి కంపెనీల పత్తివిత్తనాలు తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా అమ్ముడు పోయాయని, దీనిపై సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారని విమర్శించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ జిల్లాలోని సదాశివపేట, కొండాపూర్, మునిపల్లి మండలాల్లో నకిలి విత్తనాలతో పత్తిరైతులు తీవ్రంగా నష్టపోయారని, వీరికి రూ.50వేల పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత నెల రోజులుగా రైతాంగం ఆందోళన చేస్తున్న సంబంధిత అధికారులు స్పందించకపోవడం సరికాదన్నారు. వారం రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నర్సింహారెడ్డి, రాజయ్య, శ్రీనివాస్, సాయిలు, అశోక్, శివకుమార్, రమేష్‌గౌడ్, శ్రీశైలం, జగదీశ్వర్, నారాయణ, రైతులు పాల్గొన్నారు.

విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం

* ప్రజావాణిలో కలెక్టర్ భారతి
రామాయంపేట, డిసెంబర్ 11: విదుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మెదక్ జిల్లా కలెక్టర్ భారతీ హోళ్లీకేరీ అధికారులను హెచ్చరించారు. సోమవారం రామాయంపేట మండల తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణీకి కలెక్టర్ హాజరై బాదితుల నుండి స్వయంగా పిర్యాదులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ భూములు ప్లాట్లుగా మార్చవద్దన్నారు. నాలా చేయంది ప్లాట్లు చేస్తే కొనుగోలు చేసే లబ్దిదారులు నష్టపోతారని అన్నారు. భూప్రక్షాళనలో ప్రభుత్వ భూములను ఎందుకు గుర్తించడంలేదని స్థానిక తహశీల్దార్ జంగేశ్వర్‌పై కలెక్టర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 12,13నుండి అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రామాయంపేట తహశీల్దార్ కార్యాలయ నిర్మాణానికి నిదులు మంజూరైన ఎందుకు జాప్యం జరుగుతుందని ప్రశ్నించారు. వారం రోజుల్లో పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. డిసెంబర్ 31వరకు రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు. తహశీల్దార్ జంగేశ్వర్, మండల పరిషత్ అభివృద్ది అధికారి రాణి, సిడిపివో జ్యోతిర్మయి, ఏపివో రాజ్‌కుమార్, ఏపిఎం సత్యం, వ్యవసాయాదికారి రెబల్‌సన్‌తో పాటు పలు శాఖల అధికారులు హాజరయ్యారు.