మెదక్

కాంగ్రెస్ బలోపేతానికి సమష్టి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, జహీరాబాద్‌టౌన్, డిసెంబర్ 11: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీని బలోపేతం చేసేందుకు అందరం కృషి చేయాలని ఎమ్మెల్యే గీతారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని వీరశైవ లింగాయత్ బసవమంటపంతోపాటు కోహీర్‌లో వేర్వేరుగా కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ నాయకులకు గెలుపే లక్ష్యంగా చక్కని మార్గదర్శనం చేశారు. రాష్ట్రంలో ప్రజా, రైతు వ్యతిరేకంగా నియంతపాలన కొనసాగిస్తున్నారని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెరాస ప్రభుత్వాన్ని గద్దెదించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీని
అధికారంలోకి తీసుకుని వచ్చేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సొంత నిర్ణయంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. రాష్ట్ర ఏర్పాటుకోసం తెలంగాణ ప్రజలు, యువకులు ప్రతి రంగానికి చెందిన వారందరు పెద్ద సంఖ్యలో ఉద్యమాలు చేశారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ఇదివరకే కేంద్ర నాయకత్వం ప్రకటించిందన్నారు. నిరుద్యోగులకు రూ.3వేల బృతిని ప్రకటించేందుకు కృషి చేస్తామన్నారు. దేశంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికోసం ఢిల్లీలో రాహుల్ గాంధీ ఎల్‌డీఎమ్మార్సీ ప్రోగ్రాంను తెలంగాణ రాష్ట్రంలో 35 ఎస్సీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పంజాబ్ ఎన్నికల్లో ఈ ప్రోగ్రాంవల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. గ్రామస్థాయినుంచి, రాష్ట్ర స్థాయివరకు 17 రకాల పార్టీ కమిటీలు వేయడం జరుగుతుందన్నారు. టీడీపీ నుంచి నాగిశెట్టి రాథోడ్ అధ్వర్యంలో 100మంది కార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఎస్టీలు కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను ఒకేతాటిపైకి తీసుకుని వస్తుందన్నారు. ఈపార్టీ కుటుంబ పాలనలోలేదని, ప్రజల పాలనలో ఉందన్నారు. సోనియాగాంధీకి ప్రధాని పదవి ఇస్తామన్నా తీసుకోలేదన్నారు. రాహుల్ గాంధీ ప్రజాసేవకోసమే పోరాటం చేస్తున్నారని, ప్రధాని పదవికోసం కాదన్నారు. సిఎం కేసీఆర్ ఎన్నికల మెనిఫేస్టోలో చెప్పింది ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ముస్లీంలకు 12శాతం రజర్వేషన్, పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, కేజీ టు పీజీ విద్య తదితర అనేక వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలు చేయాలేదన్నారు. రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయన్నారు. దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. మిషన్ కాకతీయ, భగీరథల పేర్లతో వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎల్‌డీఎమ్మార్సీ ఇంచార్జి తోపాజి అనంతకిషన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు ప్రతినిధులు కండెం నర్సిములు, రామలింగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మంకాల్‌సుభాష్, మక్సూద్, నర్సింహారెడ్డి, నాగిశెట్టి రాథోడ్, సరస్వతి, శీలారమేష్, ఖాజా, భూమయ్య, హర్షవర్దన్‌రెడ్డి, మోహీజ్, మాజిద్, జాంగీర్, జాఫర్, మోహన్, జమీర్, కార్తిక్, కోహీర్ మండల నాయకులు, అధ్యక్షులు రామలింగారెడ్డి, నర్సిములు, రాందాస్, సాయిలు, సత్తార్, అస్రఫ్‌అలీ, అర్షద్, మోసీన్, గౌస్ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.