మెదక్

మాతృభాషను విస్మరించొద్దు: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 11: మాతృభాషను విస్మరించకుండా ప్రతి ఒక్కరు తెలుగులోనే మాట్లాడాలని జిల్లా కలెక్టర్ మాణిక్యరాజ్ కణ్ణన్ సూచించారు. ప్రపంచ తెలుగు మహా సభలను పురస్కరించుకొని సోమవారం జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సాహితీ గోష్టి, పత్రికా సమర్పణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రముఖ తమిళ కవి భారతి తెలుగు భాషను సుందర తెలుగుగా అభివర్ణించారని గుర్తుచేశారు. పండగ వాతావరణంలో ఈ మహా సభలు జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. పిల్లలు తెలుగులోనే మాట్లాడేలా తల్లిదండ్రులు తర్ఫీదును ఇవ్వాలన్నారు. అనంతరం జిల్లా నలుమూల నుండి వచ్చిన కవులతో కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, డిపిఆర్‌ఓ య1మినీ, అధికారులు శ్రీ్ధర్, వసుంధర తదితరులు పాల్గొన్నారు.