మెదక్

సిద్దిపేటలో హోరాహోరీగా హ్యాండ్ బాల్ ప్రీక్వార్టర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 21: సిద్దిపేటలో 40వ జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు హోరాహోరీగాసాగుతున్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో తొలిసారిగా నిర్వహించిన హ్యాండ్‌బాల్ జాతీయ స్థాయి పోటీలకు దేశంలోని 29 రాష్ట్రాల జట్లతో పాటు, 3 సెంట్రల్ టీంలు మొత్తం 32 జట్లు పాలుపంచుకుంటున్నాయి. 700లకు పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడకారులు, మేనేజర్లు, కోచ్‌లు సిద్దిపేటకు చేరుకున్నారు. సిద్దిపేట మీనీ స్టేడియంలో తొలిసారిగా జరుగుతున్న హ్యాండ్‌బాల్ క్రీడ పోటీలు క్రీడకారులను కనువిందు చేస్తున్నాయి. జిల్లాలో హ్యాండ్‌బాల్ క్రీడ పరిచయం లేనప్పటికి మ్యాచ్‌లు చూసేందుకు క్రీడాభిమానులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. రాత్రి వేళల్లో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహిస్తున్న మ్యాచ్‌నులు క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 32 టీంలను 8గ్రూపులుగా విభజించి లీగ్ దశ పోటీలు నిర్వహించారు. గత మూడు రోజులుగా జరుగుతున్న పోటీలు లీగ్ దశ ముగిసి నాక్ అవుట్ దశకు చేరుకున్నాయి. గ్రూపు స్థాయిలో అగ్రభాగాన నిలిచిన రెండు జట్లు ప్రీక్వార్టర్స్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి.
ఆకట్టుకున్న ప్రీక్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్‌లు
సిద్దిపేట మినీ స్టేడియంలో జరుగుతున్న ప్రీ క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్‌లు హోరాహోరీగా తలపడుతున్నాయి. క్వార్టర్స్ బెర్త్‌ను దక్కించుకునేందుకు క్రీడకారులు సర్వశక్తులు ఒడ్డి నువ్వా..నేనా అన్నట్లు తలపడుతున్నారు. తొలిమ్యాచ్‌లో స్పోర్ట్ అథిరిటీ ఆఫ్ ఇండియా (సాయ్) మధ్యప్రదేశ్ జట్టుపై 40-12 పాయింట్లతో ఘన విజయం సాధించింది. అలాగే పంజాబ్, వెస్టు బెంగాల్ జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది. పంజాబ్ 26-9 పాయింట్లతో నెగ్గింది. ఢిల్లీ, తమిళనాడు జట్ల మ్యాచ్ సైతం నువ్వా,నేనా అన్నట్లు సాగకా ఢిల్లీ 48-29 పాయింట్లతో విజయం సాధించింది. తెలంగాణ, కర్నాటక జట్ల మ్యాచ్‌లో తెలంగాణ కర్నాటపై 30-9 పాయింట్లతో ఘన విజయం సాధించింది. చండీఘడ్, రాజస్టాన్ జట్టుపై 26- 19 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఈనెల 22న సోమవారం క్వార్టర్స్‌కు చేరుకున్న 8 జట్ల మ్యాచ్‌లు, అలాగే సాయంత్రం 4 జట్ల మధ్య సెమిఫైనల్స్ జరుగునున్నాయి, 23న మంగళవారం జాతీయ స్థాయి ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నారు. హెచ్‌ఎఫ్‌ఐ జాతీయ కార్యదర్శి ఆనందీశ్వర్‌పాండే, హెచ్‌ఎఫ్‌ఐ కోచ్ శివాజీ షిండే, జిల్లా కార్యదర్శి మల్లేశం, కోచ్‌లు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.