మెదక్

పెరిక కుల సంఘ భవన నిర్మాణానికి 500 గజాల స్థలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, జనవరి 21: పెరిక కులస్థుల సంఘానికి కమ్యూనిటి భవన నిర్మాణానికి ఐదు వందల గజాల స్థలం కేటాయిస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి హామి ఇచ్చారు. వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ అహర్నిశలు వారికి అండగా ఉంటానన్నారు. ఆదివారం పట్టణంలోని వేదిక ఫంక్షన్‌హాలులో జరిగిన పెఱిక నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత అన్ని కులాల ప్రజలకు మహర్దశ పట్టిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంధ్రశేఖర్‌రావు కులాల వారిగా, వారి కులవృత్తులపై ఆధారపడి జీవించడానికి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. యాదవులు, గొల్ల కుర్మలు ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదగడానికి గొర్రె పిల్లలను అందించిన ఘనత కేవలం తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ముదిరాజ్‌లను ఆదుకోవడానికి చేపపిల్లలను చెరువులలో, కుంటలలో వదిలిన ప్రభుత్వం వారికి అవసరమైన చేయూతను ఉచితంగా అందిస్తోందన్నారు. ఈ మాదిరిగా కులవృత్తులు కనుమరుగు కాకుండా అనేక రకాలుగా సహాయం చేస్తోందన్నారు. పటన్‌చెరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు టైలర్ అసోసియేషన్ తరపున కమ్యూనిటి భవన నిర్మాణానికి నాలుగు వందల గజాల స్థలం కేటాయించడం జరిగిందన్నారు. ఇంతేకాకుండా శ్రీకాకుళం సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి సైతం భూమి కేటాయించామని ఈ సంధర్బముగా ఆయన గుర్తుచేసారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, పెఱిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య, ప్రధాన కార్యదర్శి మ్దుదసాని కనకయ్య, మద్ద లింగయ్య, శీరాం దయానంద్, దాసరి మల్లేష్ తదితరులు హాజరయ్యారు.