మెదక్

పట్నం వారానికి పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేర్యాల, జనవరి 21: ప్రముఖ శైవక్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జునస్వామి జాతర ఆదివారంతో ప్రారంభమైంది. సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో స్వామివారి జాతర ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తుంది. జాతరలో మొదటి వారాన్ని పట్నం వారంగా పిలుస్తారు. ఈ వారం హైదరాబాద్ నుండి భక్తులు పెద్ద సంఖ్యలో కొమురవెళ్లికి చేరుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఇందులో బాగంగా శనివారం సాయంత్రానికే భక్తులు కొమురవెళ్లికి చేరుకొని ముందుగా స్వామివారిని దూళి దర్శనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం కళ్యాణ కట్ట వద్ద తలనీలాలు సమర్పించి కోనేరులో స్నానం ఆచరించారు. అనంతరం గంగరేణి చెట్టు వద్ద పంచ రంగులతో పట్నాలు వేసి ఒగ్గు పూజారుల ఢమరుక నాదాల మద్య మల్లన్న నామస్మరణతో మొక్కులు చెల్లించారు. ఆ తర్వాత గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మలతో కొలువైన కొమురవెళ్లి మల్లన్నను దర్శించుకున్నారు. ఎన్నడు లేని విధంగా స్వామివారి సన్నిదికి వేలాదిగా భక్తులు తరలిరావడంతో దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహిళలు వారు బస చేసిన ప్రాంతాల వద్ద బోనాలను వండుకొని వాటిని నెత్తిన పెట్టుకొని నృత్యాలు చేస్తూ ఎల్లమ్మ తల్లి కొలువైన గుట్టపైకి వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రీతి పాత్రమైన కల్లును ఆరగింపుగా చూపారు. తమ కుటుంబాలను సల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. స్వామి వారి సన్నిదికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఇవో రామక్రిష్ణారావు, చైర్మన్ బద్దిపడిగ క్రిష్ణారెడ్డి, సభ్యులు రామగల్ల బాబు, నర్సింహులు, బాలరత్నంలు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా హుస్నాబాద్ ఎసిపి మహేందర్ ఆద్వర్యంలో చేర్యాల సి ఐ చంద్రశేఖర్‌గౌడ్, ఎస్సైలు లక్ష్మణ్‌రావు, సతీష్‌లు భద్రతా చర్యలు చేపట్టారు.
సౌకర్యాలు లేక భక్తుల ఇక్కట్లు
జాతరకు వచ్చిన భక్తులకు సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో దేవాలయానికి దాదాపు కిలోమీటరు దూరంలో వాహనాలను ఆపుకొని ప్రైవేట్ బోర్ల వద్ద కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గదులు లేకపోవడంతో మహిళలు వారు బస చేసిన ప్రాంతాల నుండి బోనాలను ఎత్తుకొని దేవాలయం వరకు నడచి రావాల్సి రావడంతో ఇబ్బంది పడాల్సి వచ్చిందని భక్తులు ఆవేదనతో తెలిపారు. గదులు, తాగునీరు లాంటి కనీస వసతులు దేవాలయం తరపున కల్పించి భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.