క్రైమ్/లీగల్

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్, మార్చి 1: అప్పుల బాధతో ఓ యువ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని వెంకటాపూర్ (బిజీ) గ్రామంలో గురువారం వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించి మృతుని అన్న మైసయ్య, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెంకటాపూర్ గ్రామానికి చెందిన గౌడ లింగం (29) అనే రైతు ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన గౌడ సత్తయ్యకు సంబంధించిన మూడు ఎకరాల వ్యవసాయ భూమితో పాటు చెక్కల బాల్‌రాజు వద్ద మూడు ఎకరాల భూమి కౌలుకు తీసుకున్నాడు. సాగు నిమిత్తం పెట్టుబడి కోసం వడ్డి వ్యాపారుల వద్ద అప్పులు చేసి ప్రత్తి, మొక్క జొన్న పంటలను సాగు చేశాడు. అయితే కాలం కలిసి రాక, పంటల దిగుబడులు సరిగా రాకపోవటంతో ఆ రైతును మరింత అప్పుల ఊబిలోకి నేట్టివేసింది. సాగు కోసం సుమారు రూ.4లక్షల వరకు అప్పు చేసినట్లు కుటుంబీకులు తెలిపారు. వేసిన పంటలతో వచ్చిన డబ్బులు కనీసం కౌలుకు కూడ సరిపోక పోవడంతో ఈ సారి వ్యవసాయం చేయకుండనే గ్రామంలో వ్యవసాయ కూలీగా మారాడు. దీంతో వచ్చిన కూలీ డబ్బులతో కుటుంబ పోషణ గడవటమే కష్టంగా మారడంతో పాటు తన భార్య సౌందర్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. దింతో మరింత అప్పుల పాలలైన లింగంకు మరో పక్క గత సంవత్సరం ఇచ్చిన అప్పులోల్ల నుండి వేధింపులు అధికమయ్యాయ. దీంతో లింగం మానసిక వేదనకు గురయ్యాడు. కాగా లింగం గత నాలుగు రోజులు క్రితం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండగా గ్రామస్థులు చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతునికి ఇద్దరు సంతానం. చరణ్, వరుణ్‌లు ఉన్నారు. గతం సంవత్సరం క్రితం అతని తండ్రి కూడా మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై వీరన్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
సిద్దిపేటలో ఘనంగా హోలీ వేడుకలు
సిద్దిపేట/ టౌన్, మార్చి 1: సిద్దిపేట జిల్లా పరిధిలోని గజ్వేల్, దుబ్బాక,హుస్నాబాద్ నియోజక వర్గాల పరిధిలోని వివిధ మండలాలు, జిల్లా కేంద్రంలో గురువారం హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రంగుల వేడుకోత్సవం సందర్భంగా పట్టణం సప్తవర్ణ శోభితంగా మారింది. చిన్నలు, పెద్దలు అందరు కలిసి ఘరంగా హోలీ..చెమ్మకేలీల హోలీ అంటు ఆడుతూ, పాడుతూ వేడుకలు జరుపుకున్నారు. హోలీ పర్వదినాన్ని విద్యార్థులు, యువతి, యువకులు, రంగులు చల్లుకుంటు ఉత్సహాంగా జరుపుకున్నారు. పలువురు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలిపుకున్నారు. సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్లు పరస్పరం రంగులు చల్లుకుంటు హోలీ వేడుకలు జరుపుకున్నారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్‌వర్మ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హోలీ పండుగలో భాగంగా రంగులు చల్లుకుంటు ఉత్సహాంగా జరుపుకున్నారు. ఆలాగే యూత్ కాంగ్రెస్ నాయకులు గోపీకృష్ణ ఆధ్వర్యంలో పరస్పరం రంగులు చల్లుకుంటు హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అందరి జీవితాల్లో నవ వసంతాలు తీసుకొని రావాలని ఆకాంక్షించారు. బీజేపీ నాయకులు దూది శ్రీకాంత్‌రెడ్డి, బాసంగారి వెంకట్, హిందూ వాహీని, విహెచ్‌పి, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రంగులు జల్లుకుంటు, ర్యాలీ తీసుకుంటు సంతోషంగా హోలీ వేడుకల్లో జరుపుకున్నారు.