మెదక్

రంగనాయక్ సాగర్‌తో సస్యశ్యామలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఏప్రిల్ 20 : ప్రజాసంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ సర్కార్ పనిచేస్తుందని..ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఇతర పార్టీల నేతలు ఆకర్శితులవుతున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. శుక్రవారం చిన్నకోడూరు మండలానికి చెందిన కాంగ్రెస్, బీజెపీ నాయకులు మంత్రి హరీష్‌రావు సమక్షంలోటీఆర్‌ఎస్ పార్టీలో చేరగా, పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ 2018లోగా రంగనాయక్ సాగర్‌ను పూర్తి చేసేందుకు యుద్ద ప్రతిపాదికన పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో ఈ ప్రాంతమంత సస్యశ్యామలం అవుతుందన్నారు. కరువు పీడిత ప్రాంతాలన్ని కరువురహిత ప్రాంతంగా తీర్చిదిద్దటమే లక్ష్యమన్నారు. రంగనాయక్ స్వామి గుట్ట చుట్టు నిండు కుండల నీరు ఉంటుందన్నారు. చంద్లాపూర్ గ్రామ అభివృద్ధి కోసం అందరం కలసి పనిచేస్తామన్నారు. చంద్లాపూర్ ఆలయంలో ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. పార్టీ కార్యకర్తలందరిని కాపాడుకుంటానని భరోసా నిచ్చారు. నూతనంగా పార్టీలో చేరిన కాంగ్రెస్, బీజేపి నేతలు నాగరాజు, హరిబాబులు మాట్లాడుతూ నిరంతరం ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడు మంత్రి హరీష్‌రావుతో కలసి పనిచేయటానికి టీఆర్‌ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. బంగారు తెలంగాణ అభివృద్ధిలో తమవంతు పాత్ర నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ఆదర్శ నియోజక వర్గంగా సిద్దిపేటను తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. కరువు పీడిత ప్రాంతంగా ఉన్న చంద్లాపూర్‌లో చారిత్రాత్మక రిజర్వాయర్ నిర్మించటం మాకు, ఈప్రాంత రైతాంగానికి ఏంతో ఆనందం కల్గిస్తుందన్నారు. మంత్రి హరీష్‌రావు అడుగుజాడల్లో నడుచుకుంటు అభివృద్ధిలో భాగస్వాములం అవుతామన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల విజయవంతానికి, పార్టీ అభివృద్ధికి తమవంతు కృషిచేస్తామన్నారు.