మెదక్

భక్తకోటితో నిండిన పంచవటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాల్‌కల్, ఏప్రిల్ 20: పంచవటి క్షేత్రం భక్తకోటితో నిండిపోయింది. అనునిత్యం వచ్చిపోతున్న భక్తులతో మంజీరా తీరం కిటకిటలాడుతోంది. నాగ సాదువులు, దిగంబర సాదువుల విన్యాసాలు కుంభమేళాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రెండు రోజులుగా వారి ప్రత్యేక పూజలు, భస్మ లేపనం తదితరాలను చూసేందుకు భక్తులు ఉత్సాహం చూపుతున్నారు. మండలంలోని రాఘవపూర్-చాల్కీ శివారులోగల పంచవటి క్షేత్ర పరిసరప్రాంతమైన గరుడగంగా మంజీరా తీరప్రాంతంలో సాగుతున్న కుంభమేళ 7వ రోజుకు చేరుకుంది. కుంభమేళలో తెలంగాణతోపాటు పక్కరాష్టమ్రైన కర్ణాటక, మహారాష్టల్రకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మంజీరానదిలో పుణ్యస్నానాలుచేసి గంగామాతకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అదేవిధంగా పంచవటిలో కొలువుదీరిన సూర్యభగవాన్, సరస్వతిదేవి, సాయిబాబా మందిరాలను ధర్వించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సాయంత్రం నాగసాదువులు, దిగంబర సదువులు గుంపుగా స్నానాలకు బయలుదేరుతున్నారు. మంజీరానదిలో పుణ్య స్నానాలుచేసి బస్మలేపనం చేసుకుంటున్నారు. నదీతీరంనుంచి ఆటపాటలతో నృత్యాలు, విన్యాసానలుచేస్తూ భక్తులను అలరిస్తున్నారు. భక్తులను ఆశీర్వదిస్తూ ముందుకు సాగుతున్నారు. నాగసాదువులు, దిగంబర సాదువులు ఆశీస్సులు తీసుకునేందుకు భక్తులు పోటీపడుతున్నారు. స్థానిక కుంభమేళకు ఈప్రాంతానికి చెందిన ప్రముఖులు ఆదిలక్ష్మి మందిర పీఠాధిపతి దేవగిరి మహారాజ్ సందర్శించారు. మంజీరానదికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంభమేళాకు తరలివచ్చిన భక్తులను సల్లంగా చూడాలని గంగామాతను కోరుకున్నారు. కుంభమేళా సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తమసేవలు అందిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకార్యలు కలుగ కుండా చర్యలు తీసుకుంటూ వారి మన్ననలు అందుకుంటున్నారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు. వేసవిలో వడదెబ్బలు, జ్వరాలు ఇతర రోగాలకు సంబంధించి మందులను అందుబాటులో ఉంచారు. ఆశాఖకు చెందిన అధికారులు, సిబ్బంధి అందుబాటులో ఉంటున్నారు. రాఘవపూర్, ఇబ్రహీంపూర్, చాల్కీ, హుమ్నాపూర్ పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్యంతోపాటు ఇతర సౌకర్యాలను కల్పించారు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చిపోతున్నందునా ఈ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీస్ అధికారులు, సిబ్బంధి తగిన చర్యలు తీసుకుంటున్నారు.

అగ్ని గుండమే
మెదక్ జిల్లాలో 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
మెదక్, ఏప్రిల్ 20: మెదక్ జిల్లాలో ఎండలు ముదిరాయి. మొత్తానికి జిల్లా అగ్ని గుండంగా మారింది. ఉదయం 7 గంటల నుండే సూర్యుడి ప్రతాపం జిల్లా కేంద్రంపై చూపిస్తున్నాడు. బయటకు వెళ్లలేని పరిస్థితులు ప్రజలకు ఎదురవుతున్నాయి. శుక్రవారం 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 22.2 నమోదు అయింది. వడగాల్పులతో ప్రజలు బయట తిరగలేని పరిస్థితితో పాటు ఇండ్లలో కూడా ఉండలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. చాలా మంది చిన్నారులు, వృద్దులకు వడగాల్పులతో అస్వస్థతకు గురవుతున్నారు. వీరందరు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గొడుగుల రక్షణతో, మహిళలు చీర కొంగులు తలపై వేసుకొని ఎండ నుండి రక్షించుకుంటున్నారు. మద్యాహ్నాం నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలకు ప్రయాణించడానికి భయపడుతున్నారు. ఆర్టీసీ బస్సులు ఆ సమయంలో ఖాళీగా కనిపిస్తున్నాయి.
ఎండలో తిరగరాదు: డాక్టర్ పీసీ.శేఖర్
ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎండలో ప్రయాణించకూడదని మెదక్ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శేఖర్ తెలిపారు. ప్రతి పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లలో ఓఆర్‌ఎస్ ఫ్యాకెట్లు సిద్దంగా ఉంచామని తెలిపారు. మెదక్ ఆసుపత్రిలో కూడా ఓఆర్‌ఎస్ ఫ్యాకెట్లు సిద్దంగా ఉంచినట్లు తెలిపారు. టీ కన్నా కొబ్బరనీళ్లు త్రాగడం మంచిదని ఆయన సూచించారు. ఎక్కడ పడితే అక్కడ అల్పహారం చేయకూడదని సూచించారు. ఎండల తీవ్రత బాగా ఎక్కువైందన్నారు. అందువలన ప్రజలు తీసుకునే ఆహార పదార్ధాలు, ఎండలో తిరిగి పరిస్థితుల్లో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.