మెదక్

పురాతన ఆలయాలకు పూర్వ వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సిద్దిపేటకు రూ.5.34 కోట్లు మంజూరు: మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట, ఏప్రిల్ 20 : సిద్దిపేట జిల్లాలోదేవాలయాల అభివృద్ధికి 5.34 కోట్ల నిధులు మంజూరైనట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావువెల్లడించారు. శుక్రవారం సిద్దిపేటలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు పొతున్న సందర్భంలో మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు చాటి చెప్పెవిధంగా ఉండే కాకతీయ కాలం నాటీ ప్రాచితన పురాతన ప్రాశస్థ్యం కలిగిన ఆలయాలకు ప్రాధాన్యత, పూర్వ వైభవం తేవాలని తెలంగాణ సర్కార్ ఆలయాల అభివృద్ధికి కృషిచేస్తుందన్నారు. గత ప్రభుత్వాలు దేవాలయాల వచ్చే నిధులను సర్కార్ వినియోగించుకునేవారని, టీఆర్‌ఎస్ సర్కార్ ఆలయాల అభివృద్ధి కోసం సర్కార్ నిధులు వెచ్చిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ అధ్యాత్మిక చింతన గలిగిన వ్యక్తి అని రాష్ట్రంలో ఉండే ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉంటే ప్రాచీన ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కొమురవెళ్లి ఇప్పటికే 10కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. నాచారం లక్ష్మినర్సింహాస్వామి, బెజ్జంకి లక్ష్మినర్సింహాస్వామి ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు సైతం సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో 15కోట్ల వరకు నిధులు మంజూరు చేసుకున్నట్లు తెలిపారు. నూతనంగా మరో 5కోట్లు దేవాలయాల అభివృద్ధికి మంజూరయ్యాయన్నారు. ప్రాశస్థ్యం కలిగిన ప్రభుత్వ ఆలయాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తు పురాతన ఆలయాలకు పూర్వవైభవం తెస్తున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజక వర్గాల్లో పలుదేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

సిద్దిపేట నియోజక వర్గంలో..
సిద్దిపేట మండలం ఇర్కోడ్ గ్రామంలోని బీరప్ప ఆలయానికి 25.50లక్షలు, మిట్టపల్లి గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయంలో 35లక్షలు, ఎల్లుపల్లి గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయానికి 20లక్షలు, ఇబ్రహీంపూర్ హనుమాన్ ఆలయానికి 25లక్షలు, నంగనూర్ మండలం నర్మెట్ట శివాలయానికి 30 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. గజ్వేల్ నియోజక వర్గంలోని మర్కూక్ మండలం శ్రీరంగనాయకస్వామి ఆలయానికి 50లక్షలు, శివాలయానికి 50 లక్షలు, వర్గల్ శంభూ దేవాలయానికి 50 లక్షలు, ఆహ్మదీపూర్ హరిహరానాథ ఆలయానికి 16.70 లక్షలు, దాచారం గ్రామంలోని వెంకటేశ్వర ఆలయానికి 50 లక్షలు, జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్ మార్కేండేయ ఆలయానికి 10లక్షల మంజూరైనట్లు తెలిపారు. దుబ్బాక నియోజక వర్గం కేంద్రంలోని పెద్దమ్మ ఆలయానికి 37లక్షలు, హుస్నాబాద్ నియోజక వర్గం పరిధిలోని అక్కన్నపేట మండలం కేశవాపూర్ పార్వతి,పరమేశ్వరీ ఆలయానికి 50లక్షలు, హుస్నాబాద్ మండలం పొట్లపల్లి రామలయానికి 40 లక్షలు, రేణుక ఎల్లమ్మ ఆలయానికి 35 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. మంజూరైన ఆలయాలకు త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు.