మెదక్

పింఛన్లు మింగేస్తున్న మంజీరా బ్యాంకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు, ఏప్రిల్ 24: తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వృద్దులు, వికలాంగులు, వితంతువులకు ఆసరా పథకం పేరుతో వెయ్యి రూపాయలు, 1500 చొప్పున నెలనెలా బ్యాంకులు, పోస్ట్‌ఆఫీస్ ద్వారా అందిస్తూ ఆదుకుంటుంటే హక్కులున్నాయన్న నెపంతో వర్గల్ మండలం గౌరారం మంజీరా బ్యాంక్ మేనేజర్, కంప్యూటర్‌లు కలిసి ఆ డబ్బులను మింగేస్తున్నారు. ప్రతి నెల పెన్షన్‌లపై ఆదారపడ్డవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు కూడా వస్తోంది. వివరాల్లోకి వెల్తే ములుగు మండల పరిదిలోని కొండపోచమ్మ జలాశయ గ్రామాలైన మామిడ్యాల, బహిలింపూర్‌లలో వృద్దులు, వికలాంగులు పెన్షన్‌దారులు ఈ మంజీరా బ్యాంకు ద్వారా పెద్ద సమస్యనే ఎదుర్కొంటున్నారు. ముంపు గ్రామాల ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలలో రుణాల మాఫీ కూడా ఒకటని అందులో భాగంగా మామిడ్యాల గ్రామానికి చెందిన వికలాంగులు స్వామి, లక్ష్మన్, యాదగిరి, బుచమ్మ, యాదగిరి, ఆనంద్‌లు కలిసి మంజీరా బ్యాంకులో రుణం తీసుకున్నారు. ఈ రుణాలను మాఫీ చేస్తున్నట్లు గతంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి ముంపు గ్రామాల ప్రజలకు చెప్పారు. కానీ అప్పటి నుండే అసలు కష్టం మొదలైంది. వికలాంగులు, వృద్దులు పెన్షన్‌ల కోసం 10 నెలల నుండి బ్యాంకు చుట్టూ తిరిగినా మేనేజర్ పెన్షన్ డబ్బులు రాలేదని డబ్బులు ఇవ్వడంలేదు. సోమవారం రోజు బ్యాంకు మేనేజర్‌ను ఎందుకివ్వడం లేదని నిలదీయగా, మీరు బ్యాంకులో అప్పున్నారని అందుకోసం మీ పెన్షన్ డబ్బులు ఇవ్వడంలేదని మీరు మీ ఇష్టం ఉన్న చోట లేదా కలెక్టర్‌తో గానీ చెప్పుకోవచ్చని బెదిరిస్తున్నారు. దీంతో విసుగుచెందిన వికలాంగులు మంగళవారం ములుగు ఎంపీడీఓ కౌసల్యాదేవికి తమను ఏ విదంగానైనా ఆదుకోవాలని వినతిపత్రాన్ని అందజేశారు. ఆమె వెంటనే స్పందించి వారిని వెంట తీసుకొని బ్యాంకుకు మెల్లగా మేనేజర్ లేకపోవడంతో సిబ్బందిని ఘాటుగానే హెచ్చరించారు. అక్కడికి వచ్చిన మేనేజర్ డబ్బులు ఇస్తానని ఎంపీడీఓకు చెప్పి ఆమెను అక్కడి నుండి పంపించారు.