మెదక్

నగదు కోసం నరకయాతన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమీన్‌పూర్, ఏప్రిల్ 24: కేంద్ర ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల దేశంలో సామాన్యులు నగదు కోసం నరకయాతన అనుభవించాల్సిన పరిస్థితులు దాపురించాయ ని సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు కా ట శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. యేడాదిన్న ర గడుస్తున్నా నగదు కొరత రోజు రోజు కు అధికమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అమీన్‌పూర్ పరిధి లో ఎస్‌బీఐ ఏటీఎం వద్ద వివిధ బ్యాంకుల కు చెందిన ఖాతాదారులు బారులు తీరిన విషయాన్ని గమనించిన ఆయన వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా క్యూ లైన్ లో నిల్చున్న పలువురు ఏటీఎం వినియోగదారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దుతో దేశంలో నగదు కొ రత తీవ్రంగా ఏర్పడిందని ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ గురించి సరియైన అవగాహనలేక కేంద్రం నోట్ల రద్దును చేపట్టిందని విమర్శించారు. నోట్ల రద్దుకు ముందు ఏటీఎంలు వినియోగదారులు లేక బోసిపోయి దర్శనమిచ్చేవని, ఇప్పుడు మాత్రం మందిరాల్లో దైవ దర్శనానికి భక్తులు బారులు తీరినట్లు ఖాతాదారులు క్యూలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. ఏటీఎంలో నగదును పొందుపర్చిన కొద్ది సేపట్లోనే ఖాళీ అవుతున్నాయని, ఈ విషయంలో బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రిక్తహస్తాలతో వెనుదిరుగాల్సిన దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. వినియోగదారులకు అవసరమైన నగదు నిల్వలను ఉంచకపోవటంతో డబ్బులు లేక ప్రజలు తమ నిత్యవసరాల కొనుగోలుకు అవస్తలు ఎదుర్కుంటున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనాలోచిత చర్యలతో దేశం ఆర్థికంగా వెనకబడుతందని అన్నారు. దేశం, రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుందని ఎద్దేవా చేసారు. ఈ అసమర్ధ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు.