మెదక్

ఆదర్శ గ్రామాలకు బహుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, ఏప్రిల్ 24: గ్రామ ప్రజల అవసరాలను తీర్చడం సర్పంచ్ యేక్క ప్రధాన కర్తవ్యమని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సర్పంచ్‌లకు సూచించారు. గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమం క్రింద జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవాన్ని మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవాన్ని పురష్కరించుకొని జనన, మరణ దృవీకరణ పత్రాల జారీ, ఇంటి నిర్మాణాలకు అనుమతులు, వంద శాతం పన్నుల వసూలు, రోడ్లు, మురికి కాలువల శుభ్రత, హరితహారం, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం వంటి అంశాల్లో మండలంలో ఉన్న మూడు గ్రామపంచాయితీలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. మొదటి బహుమతి తూప్రాన్ మండలం మల్కాపూర్(10 లక్షలు), రెండవ బహుమతి చేగుంట మండలం ఇబ్రహీంపూర్(7.5 లక్షలు), మూడవ బహుమతి రామాయంపేట మండలం దామరచెరు(5 లక్షలు)లను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో పై అంశాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. నేడు చెట్లను నరికివేయడమే కాకుండా మొక్కల పెంపకానికి ఎవరు శ్రద్ద చూపడం లేదన్నారు. అటవి శివారులో ఉన్న గ్రామాలు చెట్లను నరికి వంట చెరుకుగా వినియోగిస్తున్నారని, ప్రతి ఇంటికి ఎల్‌పీజీ గ్యాస్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని, చెట్లను నరికివేయవద్దని కలెక్టర్ ప్రజలకు సూచించారు. అంతే కాకుండా ఇంటి నుండే ప్లాస్టిక్ వేరు చేయాలని, ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా తయారైందని, తప్పకుండా ప్లాస్టిక్‌ను వేరు చేయాలన్నారు. అదే విధంగా ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టి వినియోగించుకోవాలని వీటితో పాటు వర్షపు నీరు ఇంకేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి అంగన్‌వాడిలో 25 మంది కంటే ఎక్కువ పిల్లలు ఉన్న సెంటర్‌లకు మరుగుదొడ్డి నిర్మించేలా ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ విధమైన ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ధర్మారెడ్డి సర్పంచ్‌లకు సూచించారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ వెంకట్‌రెడ్డి, డీపీఓ హనూక్, డీడబ్ల్యూఓ జ్యోతి పద్మ, బీసీడబ్ల్యూఓ సుధాకర్, డీఎండబ్ల్యూఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు.