మెదక్

సౌత్ ఇండియా క్లీన్‌సిటీగా సిద్దిపేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సంబరాలు జరుపుకున్న పాలక వర్గం * మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌కు ఘన సన్మానం
సిద్దిపేట, మే 18 : స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సౌత్ ఇండియా క్లీన్ సిటీగా సిద్దిపేట పట్టణం ఎన్నికవ్వటం పట్ల సిద్దిపేట పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అత్తర్‌పటేల్, కౌన్సిలర్లు, అధికారులు స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు జరుపుకున్నారు. మున్సిపల్ ప్రధాన ద్వారం వద్ద పెద్దఎత్తున టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మాట్లాడుతూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రోత్సహం, మున్సిపల్ అధికారులు, సిద్దిపేట ప్రజల పూర్తి సహాకారంతో సిద్దిపేట సౌత్ ఇండియాలో క్లీన్ సీటీగా ఎంపికైనట్లు తెలిపారు. సిద్దిపేట పురపాలక సంఘానికి గత మూడేండ్లుగా వరుసగా జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయ స్థాయిలు అవార్డులు సొంతం చేసుకున్నట్లు తెలిపారు. పట్టణంలో పారిశుద్ధ్య సమస్యపై ఎప్పటికికప్పుడు మంత్రి హరీష్‌రావు దిశా, నిర్దేశం చేస్తు పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా తీర్చిదిద్దటంలో కృషిచేసినట్లు తెలిపారు. పట్టణంలోని మహిళ గ్రూపులు, ఆర్‌పీలు, వ్యాపార వర్గాలు పట్టణాభివృద్ధిలో భాగస్వాములైనట్లు పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయ స్థాయిలో నెంబర్ వన్ కోసం 4వేల మున్సిపాల్టీలో పోటీలు పాలుపంచుకుంటే లక్ష జనాభా విభాగంలో దక్షిణ భారతదేశంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్ అధికారంలోకి రాగానే మున్సిపాల్టీల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు కేటాయంచి అన్ని మున్సిపాల్టీలో వౌళిక సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు. కేంద్ర సర్కార్ సైతం స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మున్సిపాల్టీలోపోటీ తత్వాన్ని కేటాయించి, ఇతోదికంగా నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట మున్సిపాల్టీకి దక్షిత భారతదేశంలోనే మొదటి స్థానాన్ని రావటాన్ని సిద్దిపేట ప్రజల అవార్డుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ అవార్డు స్ఫూర్తిగా సిద్దిపేట పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్ చైర్మన్ రాజనర్సును అధికారుల పక్షాన ఘనంగా సన్మానించారు, చైర్మన్ రాజనర్సు పాలక వర్గం పక్షాన కమిషనర్‌కు ఘనంగా సన్మానించారు. కౌన్సిలర్లు ఇరువురిని ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తర్‌పటేల్, కౌన్సిలర్లు బర్ల మల్లికార్జున్, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, పల్లె వెంకట్‌గౌడ్, బూర శ్రీనివాస్, దూది శ్రీకాంత్‌రెడ్డి, బాసంగారి వెంకట్, శ్రీనివాస్‌యాదవ్, మొయిజ్, జావేద్, ఉమారాణి, సంధ్య, మంతేన జ్యోతి, బాల్‌లక్ష్మి, విజయలక్ష్మి, లక్ష్మి, లలిత, డిఈ లక్ష్మణ్, టీపీఓ హబీబున్నిసా, రాజీవ్‌రెడ్డి, యాదగిరి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.