మెదక్

రైతు సంక్షేమానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, మే 19: రైతు సంక్షేమానికి టీఆర్‌ఎస్ సర్కార్ పెద్దపీట వేస్తుండగా, ఖరీఫ్ సాగుకు విత్తనాలు, ఎరువులు సిద్దంగా ఉంచినట్లు రాష్ట్ర హౌజింగ్ కార్పోరేషన్ చైర్మెన్ మడుపు భూంరెడ్డి పేర్కొన్నారు. శనివారం గజ్వేల్‌లో రాయితీ విత్తన విక్రయ కేంద్రాన్ని జేడీఏ శ్రావన్‌తో కలసి ప్రారంభించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. రైతుబంధులో భాగంగా 90 శాతం పంట పెట్టుబడిని రైతులకు అందజేయగా, అన్నదాతల సమస్యల పరిష్కారంలో రైతు సమన్వయ సమితి ముందుండాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఆత్మహత్యలు లేని తెలంగాణ సాదనే సీఎం కేసీఆర్ లక్ష్యం కాగా, రైతు కొడుకు రైతునని చెప్పుకునే రోజులు త్వరలోనే వస్తాయని స్పష్టం చేశారు. విత్తనం విత్తు నుండి దిగుబడులు విక్రయించే వరకు రైససలదే ప్రధాన పాత్ర కాగా, ప్రతి 5వేల ఎకరాలకు ఒక ఏఈఓను నియమించి రైతులకు మెరుగైన సేవలందిస్తున్నట్లు తెలిపారు. భూ ప్రక్షాలనతో భూ సంబందిత సమస్యలకు పరిష్కారం కానుండగా, గ్రామాల లో ఏఈఓలు సూచించే పంటలు సాగు చేసి అధిక ప్రయోజనం పొందాలని సూచించారు. జిల్లాలో 5లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు సిద్దంగా ఉంచగా, అవసరమైన పక్షంలో మరిన్ని తెప్పించడానికి చర్యలు తీసుకోనున్నట్లు జేడీఏ శ్రావన్ కుమార్ పేర్కొన్నారు. ఖరీఫ్‌లో 5లక్షల 24వేల ఎకరాల సాగు విస్థీర్ణం అంచనా వేస్తుండగా, సాగుకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచగా, రైతులు ఆందోళనకు గురికావద్దని కోరారు. సిద్దిపేట, జోగిపేట, జీడిమెట్లలో రాయితీ విత్తనాలు సిద్దంగా ఉంచగా, రోహినికార్తి, మృగశిరలకు కొందరు రైతులు విత్తనాలు సిద్దం చేసుకునేందుకు దృష్టి సారిస్తున్న క్రమంలో ఆగ్రోస్, సహకార సంస్థల ద్వారా రైతులకు అందజేయనుండగా, ఇప్పటికే గజ్వేల్‌తోపాటు 22 మండల కేంద్రాల్లో సిద్దం చేసినట్లు స్పష్టం చేశారు. బీటీ-3 పత్తి విత్తనాల విక్రయంపై గట్టి నిఘా కొనసాగిస్తుండగా, గ్రామాల్లో దళారులు రైతులను మభ్య పెట్టి విక్రయించే ప్రమాదముందని తెలిపారు. రైతులు మోసపోకుండా బీటీ-3 పత్తి విత్తన విక్రయాలపై పోలీసులకు, లేదా తమకు సమాచారం ఇవ్వాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ భాస్కర్, వైస్ చైర్మెన్ అరుణ భూపాల్ రెడ్డి, నాచగిరి ట్రస్టుబోర్డు చైర్మెన్ కొట్టాల యాదగిరి, జెడ్‌పీటీసీ వెంకట్‌గౌడ్, ఎంబరి రాంచంద్రం, టీఆర్‌ఎస్‌వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, రైసస జిల్లా సభ్యులు మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, మండల చైర్మెన్ మద్ది రాజిరెడ్డి, వ్యవసాయ అధికారి ప్రవీన్, నేతలు రాజ్‌కుమార్, ఆకుల దేవేందర్, దయాకర్‌రెడ్డి, రాంచంద్రాచారి, రేగొండగౌడ్ పాల్గొన్నారు.

దేశంలోనే ఉత్తమ సీఎం కేసీఆర్
* ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి
రామచంద్రాపురం, మే 19: ప్రజాసంక్షేమం కో సం అహర్నిషలు పాటుపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలోనే ఉత్తమ సీఎం అని ఎమ్మెల్సీ వె న్నవరం భూపాల్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ పిలుపు మేరకు రామచంద్రాపురం నాయకులు తమకు వ చ్చిన రైతుబంధు చెక్కులను ఎమ్మెల్సీ భూపాల్‌రె డ్డి ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వానికి వాపసు చేశారు. రామచంద్రాపురంలోని ఎమ్మెల్సీ నివాసం లో జరిగిన ఈ కార్యక్రమంలో భూపాల్‌రెడ్డి మా ట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి రైతును రారాజును చే యాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ రైతుబంధు పధకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడారైతులకు పెట్టుబడి సాయాన్ని అందించలేదని, కాని తెలంగాణ ప్ర భుత్వం ఎకరాకు 4 వేలు అందించిందని తెలిపా రు. లక్షలాది మంది పేద రైతులకు ఈ రైతుబం ధు సంజీవనిలా పనికొచ్చిందని, నేడు ప్రతి రైతు ఈ పధకం ద్వారా సంతోషంగా ఉన్నారన్నారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు, ఆర్ధికంగా బలవంతులు స్వచ్ఛందంగా తమ చెక్కులను వదులుకోవాలని, దీనివల్ల ఎంతో మంది పేద, కౌలు రైతులకు న్యాయం జరుగుతుందని కేసీఆర్ పిలుపునిచ్చారని అందుకే రామచంద్రాపురం నాయకులు చెక్కులను తిరిగి ఇచ్చేశారని అన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మిగతా నాయకులు కూడా వారి చెక్కులను వాపసు చేయాలని ఆయన కోరారు. చెక్కులు వాపసు చేసిన వారిలో నాయకులు వెంకటలక్ష్మారెడ్డి, మోహన్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, మాధవరెడ్డి, మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నాలకంటి యాదగిరియాదవ్, కార్పొరేటర్ అంజయ్య తదితరులు కూడా పాల్గొన్నారు.