మెదక్

సీసీ రోడ్లు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌడిపల్లి, జూన్ 24. మండలంలోని కొట్టాల పంచాయతీ పరిధిలోని లింగంపల్లి, లింగంపల్లి తండా, తునికి నల్లపోచమ్మ ఆలయం వద్ద రూ.35 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను జడ్పీఛైర్‌పర్సన్ రాజమణీమురళీయాదవ్‌తో కలిసి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌడిపల్లి, చిలప్‌చెడ్ మండలాల్లోని ప్రతి గ్రామంతో పాటు గిరిజన తండాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి నిర్మాణం పనులు పూర్తి చేస్తానని అన్నారు. తునికి ఆలయం వద్ద పాలకమండలి భవనం, ఈవో కార్యాలయంతో పాటు సమావేశం భవనం నిర్మాణం కోసం దేవాదాయశాఖ ద్వారా నిధులు మంజూరు చేసి త్వరలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని మదన్‌రెడ్డి తెలిపారు. తునికి నల్లపోచమ్మ ఆలయంను ఆధునాతన సౌకర్యలతో అన్ని విధాలుగా అభివృద్ది చేస్తానని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా 40 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకును మంజూరు చేయించి భక్తుల ఇబ్బందులను తీరుస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యాక్రమంలో జడ్పీఛైర్‌పర్సన్ రాజమణిమురళీయాదవ్, మార్కెట్ కమిటీ ఛైర్మెన్ హంసీబాయి, డీసీసీబీ ఉపాధ్యాక్షులు గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు యాదమ్మరామాగౌడ్, నర్సాపూర్ ఎంపీపీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ సున్నం సతీష్, మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు శివాంజనేయులు, ఆలయ కమిటీ ఛైర్మెన్ చల్లా మల్లేశం, ఆలయ కార్యానిర్వాణాధికారి సార శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు రహీమ్, ఆయా గ్రామాల సర్పంచులు సువర్ణమోషయ్య, లతరమేష్‌గౌడ్, నాయకులు సార రామాగౌడ్, నర్సింహ్మారెడ్డి, క్రిష్ణగౌడ్, అమర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో ఉద్యోగి మృతి
చేర్యాల, జూన్ 24: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో విద్యుత్ శాఖలో ఔట్‌సోర్సింగ్‌గా పనిచేస్తున్న స్వాములపల్లి కనకాచారీ(35) అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన కొమురవెల్లి మండలంలోని గౌరాయపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కనకాచారీ విద్యుత్ శాఖలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం పోల్ ఎక్కి పనిచేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భర్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

భక్తులతో కిటకిటలాడిన నాచగిరి క్షేత్రం
గజ్వేల్, జూన్ 24: తెలంగాణ జిల్లాల్లో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయానికి తరలిరావడం కనిపించగా, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని చైర్మెన్ కొట్టాల యాదగిరి, సహాయ కమిషనర్ సుదాకర్‌రెడ్డిల నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా లక్ష్మీ నృసింహస్వామివారిని భక్తులు దర్శించుకోవడంతోపాటు సత్యదేవుడి వ్రతాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. లక్ష్మీనృసింహ క్షేత్రంతో పాటు ఆలయాల సముదాయం భక్తజన సంద్రంగా మారగా, స్వామివారి నామస్మరణతో మార్మోగింది. కాగా భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలతోపాటు మహా ప్రసాదం అందజేశారు.