మెదక్

విద్యుత్ కార్యాలయం భవన నిర్మాణానికి రూ.1.73కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూన్ 24: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో 1.73కోట్లతో విద్యుత్ డివిజనల్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు ఆంధ్రభూమితో ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా చేస్తుండడంతో అధికారులు అందుబాటులో ఉండే విధంగా కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాలో కలిసిన తర్వాత అభివృద్ధిపథంలో దూసుకుపోతుందన్నారు. విద్యుత్ డివిజన్ కార్యాలయంలో లేకపోవడంతో ప్రజలు, రైతులు నానా ఇబ్బందులకు గురయ్యారన్నారు. డివిజనల్ కార్యాలయం నిర్మాణంతో హుస్నాబాద్‌లో కరెంటు సమస్యలు తొలగిపోతాయన్నారు.

పేదల పెన్నిధి.. సీఎం కేసీఆర్
* ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
కొల్చారం, జూన్ 24: పేదల పెన్నిది ముఖ్యమంత్రి కేసీఆర్ అని నర్సాపూర్ శాసనసభ్యులు చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన బోయిన సంతు భార్య నాగమణికి లక్ష రుపాయల సీఎం సహాయ నిధి క్రింద ఎన్‌ఓసీ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి పేదల అభివృద్దే ధ్యేయంగా సీఎం వ్యవహరిస్తున్నారని, త్వరలోనే మిషన్ భగీరథ నీళ్లు నియోజకవర్గం అంతటా సరఫరా చేస్తామని తెలిపారు. అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందిన పైతర గ్రామంలోని నిరుపేద కుటుంభానికి చెందిన బోయిని సంతు భార్య నాగమణికి అందజేయాలని కౌడిపల్లి డివిజన్ ఆత్మ కమిటి చైర్మన్ మల్లారెడ్డికి తెలిపారు. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి మల్లారెడ్డి, పైతర గ్రామస్తుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.