మెదక్

సిద్దిపేటలో దాహం..దాహం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూన్ 24 : సిద్దిపేట జిల్లా కేంద్రంలో గత ఐదురోజులుగా తాగునీటి సరఫరా కాకపోవటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. సిద్దిపేట నిత్యం తాగునీటీ సరఫరా చేస్తామని, కొన్ని ప్రాంతాల్లో 24 గంటలు తాగునీరు సరాఫరా చేస్తున్నామని గొప్పలు చెప్పుకున్నప్పటికి ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవటం లేదని సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సిద్దిపేటలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండటంతో ప్రజలు తాగునీటి అల్లాడేవారు. పట్టణంలో ఐదు, వారం రోజులకు సరఫరా అవుతుండటంతో తాగునీటీ సమస్య పరిష్కారం కోసం అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత సీఎం కేసీఆర్ 1999 సంవత్సరంలో 32 కోట్ల రూపాయలు వెచ్చించి కరీంనగర్ జిల్లా లోయర్ డ్యాం పొత్తురు, యశ్వాడ, కమ్మర్లపల్లి మీదుగా 60 కిలోమీటర్ల నుండి పైపులైన్ వేసి తాగునీటీ సరఫరా చేసేందుకు ప్రత్యేక పథకాన్ని రూపొందించారు. కొన్ని రోజులుగా తాగునీరు సరఫరా సక్రమంగా జరిగినప్పటికి వేసవికాలంలో తాగునీరు సక్రమంగా కాకపోవటంతో మరిన్ని నిధులు వెచ్చించి పథకానిన ఆధునికరించారు. మంత్రి హరీష్‌రావు సిద్దిపేట పట్టణానికి తాగునీటీ సమస్య పరిష్కారంలో 50 కోట్లతో కరీంనగర్ ఎంఎల్‌డి నుండి ప్రత్యేక పైపులైన్ వేయించి తాగునీటి సమస్యను పరిష్కరించారు. ఇదే క్రమంలో సిద్దిపేట మున్సిపాల్టీని తాగునీటీ సరఫరాలో ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో పట్టణంలోని 32, 33 వార్డుల్లోని మంకమ్మతోట, మోహినిపురా, చార్వదాన్ వీధుల్లో 24 గంటలు తాగునీరు సరఫరాను ప్రారంభించారు. కాని 24 గంటల తాగునీటీ సరఫరా పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు. పట్టణంలో 10 నుండి 12 గంటల మాత్రమే సరఫరా జరిగేదన్నారు. కాగా ఇటివల పట్టణంలో తాగునీటి సమస్య జఠిలమైంది. గత ఐదురోజుల నుండి తాగునీటి సరఫరా కాకపోవటంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో తాగునీటి పైపులైన్లు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. మున్సిపల్ అధికారిక యంత్రాంగం కేవలం తాగునీటీ సరఫరాలో ఒకే రోజు మాత్రమే తాగునీరుకు అంతరాయం ఉంటుందని ప్రకటించినప్పటికి నాలుగురోజులైన నీరు సరఫరా కాకపోవటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నాలు. మంకమ్మతోట, మోహినిపురా, చార్వదాన్ ప్రాంతాల్లో కొన్ని బోర్లు సైతం లేకపోవటంతో ప్రజలు నీటిని కొనుక్కునే పరిస్థితులు ఏర్పడినాయి, ప్రజలు గత్యంతరం లేని పరిస్థితుల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. తాగునీటి సరఫరా విషయంపై ప్రజలు మున్సిపల్ అధికారులను దృష్టికి తీసుకెళ్లె పైపులైన్ పనులు జరుగుతున్నాయని సాకుతో దాటవేస్తున్నారన్నారు. ఇప్పటికైన మున్సిపల్ అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకొని తాగునీటి సరఫరాను మెరుగుపర్చాలని ప్రజలు కోరుతున్నారు. తాగునీటి సరఫరాను మెరుగుపర్చకుంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామన్నారు.
మున్సిపల్ డీప్యూటీ ఈఈ లక్ష్మణ్ వివరణ
సిద్దిపేట పట్టణంలో తాగునీటి సరఫరాపై మున్సిపల్ డిప్యూటీ ఈఈ లక్ష్మణ్‌ను వివరణ కోరగా రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు పనుల వల్ల 30 కిలోమీటర్లు పైపులైన్లు ధ్వంసమైనట్లు తెలిపారు. పైపులైన్ పనుల మరమ్మతు పనులు జరుగుతున్నాయన్నారు. తాగునీటి సరఫరాను మెరుగుపర్చేందుకు అవసరమగు అన్ని చర్యలు తీసుకుంటున్న డీఈ తెలిపారు.