క్రైమ్/లీగల్

అంతర్ జిల్లా దొంగ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూన్ 25 : అంతర్‌జిల్లాను దొంగను అరెస్టు చేసి 22తులాల బంగారం, 1.25 కిలోల వెండి, 35వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవీస్ వెల్లడించారు. సోమవారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని గజ్వేల్, గౌరారం, వర్గల్ ప్రాంతాల్లో వరుస దొంగతనాలు జరగటంతో దొంగతనాల నివారణకు అడీషనల్ డీసీపీ నర్సింహరెడ్డి, ఏసీపీ మహేందర్ పర్యవేక్షణలో గజ్వేల్ రూరల్ సీఐ శివలింగం, ఏస్‌ఐ ప్రసాద్ పోలీసు సిబ్బందితో ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దొంగతనాల జరిగిన ఇళ్ల సీసీ పుటేజీలు, ఫోటోల సహకారంతో నిఘా పెంచి, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 24న సాయంతం 6గంటల ప్రాంతంలో వర్గల్ కమాన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకొని తనిఖీ చేయగా బంగారు, వెండినగలు, ఇనుప కత్తి, ఐరన్‌రాడ్, స్కూడ్రైవర్, మిరప పొడి ప్యాకేట్, 35వేల నగదును లభించినట్లు తెలిపారు. పోలీసులు విచారించగా కామారెడ్డి జిల్లా బాన్స్‌వాడ మండలం కొత్తబాద్ గ్రామానికి చెందిన బింగి మాధవరావు తెలిపారు. పోలీసుల తనదైన శైలిలో విచారిస్తే , సంగారెడ్డి జిల్లా జహిరాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లా షామిర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 25 దొంగతనాలు చేసినట్లు అంగీకరించారు. ఈకేసుల్లో అరెస్టు అయన బెయిల్‌పై వచ్చి గజ్వేల్ పట్టణ, రూరల్ పరిధిలో 11 దొంగతనాలు చేసినట్లు అంగీకరించినట్లు తెలిపారు. సురారంలో కిరాయికి ఉంటే ఇంటిలో కలిపి 35వేల నగదు, 22తులాల బంగారం, కిలోన్నర వెండి నగలు మొత్తం 8లక్షల విలువైనవి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు మాధవరావును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. దొంగతనం కేసులను చాకచక్యంగా ఛేదించిన గజ్వేల్ రూరల్ సీఐ శివలింగం, ఎస్‌ఐ గౌరారం ప్రసాద్, పోలీస్ కానిస్టేబుళ్లు బి.బాలు, హోంగార్డు విష్టువర్దన్, సిట్ టీం హెడ్ కానిస్టేబుల్ యాదగిరి, రాంచంద్రారెడ్డి, ఉపేందర్, రామకృష్ణలను సీపీ నగదు రివార్డుతో అభినందించారు. కేసు పర్యవేక్షణ చేపట్టిన అడీషనల్ డీసీపీ నర్సింహరెడ్డి, ఏసీపీ మహేందర్‌లను సీపీ ప్రత్యేక అభినందించారు.

ప్రజ్ఞాపూర్ శివారులో రోడ్డు ప్రమాదం
* ఏడుగురికి తీవ్ర గాయాలు గాంధీ ఆసుపత్రికి తరలింపు
గజ్వేల్, జూన్ 25: గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయ. ఈ సంఘటనకు సంబంధించి బాదితులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం వట్టిపల్లి తండాకు చెందిన కెతావత్ సైదులునాయక్, చిందం బీరయ్య, డప్పు లక్షయకుమార్, మహేశ్, కుమార్, దినేశ్‌కుమార్, హరీష్‌కుమార్, కొప్పుల రాజులు కలసి టాటాజెస్ట్ కారులో మంచిర్యాల జిల్లా, చెన్నూరు గ్రామంలో జరిగిన వివాహానికి వెళ్లివస్తుండగా మార్గమద్యమైన ప్రజ్ఞాపూర్ శివారులోకి ముందువెళుతున్న లారీని ఓవర్‌టేక్ చేయబోయి డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో వీరిని గజ్వేల్ ఆసుపత్రికి తరలించి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్య సేవల అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గజ్వేల్ సీఐ ప్రసాద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.