మెదక్

రజాకర్ల పాలన గుర్తుకుతెస్తున్న టీఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జూలై 12: శ్రీ పీఠం వ్యవస్థాపకులు శ్రీపరిపూర్ణానందస్వామి ని నగర బహిష్కరణ చేయడం సిగ్గుచేటని బీజేపీ ఓబీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి ఆకుల రాజయ్య విమర్శించారు. గురువారం గజ్వేల్ మండల పరిదిలో ని అహ్మదీపూర్‌లో గంగమ్మ గుడి ని ర్మాణానికి రూ. లక్ష విరాళం అందజేసిన సందర్బంగా ఆయన మాట్లాడా రు. రాష్ట్రంలో రజాకారుల, నిజాం పా లన గుర్తుకువస్తోందని, శ్రీ పరిపూర్ణానందను అరెస్టుచేసి ఇక్కడినుండి ప ంపించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నట్లు స్పష్టం చేశారు. హిందూధర్మప్రచార నిమిత్తం ధర్మాగ్రహ యా త్రను స్వామి పరిపూర్ణానంద చేపట్ట గా, ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం ఎంతమాత్రం తగదని నిలదీశారు. ముఖ్య ంగా రోజురోజుకూ హిందూ మతంపై దాడి జరుగుతోందని, అయితే తాము ఎవరికీ, ఏ వర్గానికి, ఏ కులానికి వ్యతిరేకం కాదని పేర్కొంటూ హిందూ దే శంలో ఉంటున్న ప్రతిఒక్కరూ హి ందువేనని గుర్తుంచుకోవాలని తెలిపా రు. పోలీసులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరమని, కనీసం శ్రీపరిపూర్ణానందను పూజ చేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం, భద్రాచల రాముడిని దర్శించుకునేందుకు అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఓవైసీ సోదరులు హిందూ మ తంపై విషం కక్కుతున్నా, విమర్శలు చేస్తున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని, అయితే ఈ అంశంపై గవర్నర్ స్పందించి చర్యలు తీసుకోని పక్షంలో బీజేపీ ఆద్వర్యంలో ఆందోళనబాట పట్టి ప్రజలను చైతన్యం చే స్తామని ఆయన వివరించారు.
తూప్రాన్: స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణను నిరసిస్తూ బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ ఆద్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎదురుగా రోడ్డుపై బైటాయిం చి రాముడిని కించపర్చిన కత్తి మహేశ్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చే శారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్, విఠల్, సాయి, మహేశ్, బద్రినాత్ తదితరులు పాల్గొన్నారు.

ఆశించిన మేరకు రైతుబంధు అమలులో లేదు
* అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ధర్మారెడ్డి
మెదక్, జూలై 12: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం జిల్లాలో ఆశించిన స్థాయిలో వేగంగా జరగడం లేదని వ్యవసాయ శాఖ అధికారులపై జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో రైతుభీమా, భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుభీమా కార్యక్రమం ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ఈ కార్యక్రమంపై నిర్లక్ష్యం వహించే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల వివరాలను పరిశీలన చేసి ఎప్పడికప్పుడు వివరాలు అప్‌లోడ్ చేసేందుకు ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. పాస్ పుస్తకం ఉన్నా ప్రతి రైతుకు భీమా అందాలని, ఆ దిశగా సర్వేను త్వరితగతిన పూర్తి చేసి వివరాలను వెంటవెంటనే అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. గత రెండు నెలల నుండి చెబుతున్న సర్వే నత్తనడక జరగడంపై అధికారులపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. సర్వే పనులు వేగవంతం చేసి భీమా కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. పాస్ పుస్తకాల పంపిణీలో జరిగిన తప్పులను సాధించేందుకు మండల తహశీల్దార్లు నిరంతరం కంప్యూటర్ ఆపరేటర్లు, వీఆర్‌ఓలతో సమావేశం నిర్వహించి సవరణ కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. ఆధార్‌కార్డు సీడింగ్ వివరాలు ఎప్పడికప్పుడు అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నగేష్, డీఆర్‌ఓ రామలు, ఆర్డీఓలు మెంచు నగేష్, వెంకటేశ్వర్లు, వ్యవసాయ జిల్లా అధికారి పరుశురాం నాయక్‌తో పాటు తహశీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

గ్లైఫోసేట్ గడ్డిమందు విక్రయిస్తే చర్యలు
గజ్వేల్, జూలై 12: గ్లైఫోసేట్ గడ్డిమందును ప్రభుత్వం నిషేదించిందని, ఈ క్రిమిసంహారక మందును విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని గజ్వేల్ ఏడీఏ అనీల్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం గజ్వేల్‌లోని ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసిన సందర్బం గా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్లైఫోసేట్ గడ్డిమందు విక్రయాన్ని నిషేదించినట్లు ఫర్టిలైజర్ దుకాణాల యజమానులకు నోటీసు లు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా అనుమతి లేని బీజీ-3 పత్తి విత్తనంపై రైతులు అధికంగా గ్లైఫోసేట్‌ను వాడుతారని, దీని ఫలిత ంగా మానవ ఆరోగ్యం దెబ్బతింటుందని, వాతావరణ సమతుల్యం, భూ సారంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. రైతులు దీనిని దృష్టిలో పెట్టుకొని బీటీ-3 పత్తి సాగును, గ్లైఫోసేట్ మందు వాడకాన్ని మానుకోవాలని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఎంతమాత్రం సహించేదిలేదని వివరించారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి ప్రవీన్ కూడా పాల్గొన్నారు.