మెదక్

టీఆర్‌ఎస్‌కు ఇక చెల్లుచీటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జూలై 12: గజ్వేల్‌లో పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ సీఎం కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు మానవతారాయ్ పేర్కొన్నారు. గురువారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు వీస్తున్నందునే ఇతర పార్టీల నేతలపై కన్నువేసి కొనుగోలుకు సీఎం కేసీఆర్ సిద్దంగా ఉన్నట్లు ఎద్దేవా చే శారు. తెలంగాణ ఏర్పాటులో ఉద్యమకారుల పాత్ర కీలకమని, సకలజను లు రోడ్డుపైకి వచ్చినందునే ఇక్కడి ప్ర జల బలమైన ఆకాంక్షను కాంగ్రెస్ అ ధినేత్రి గుర్తించి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించినట్లు స్పష్టం చేశారు. ముఖ్యం గా అమరవీరుల త్యాగాల పునాదుల పై జరిగిన ఉద్యమం మంచి ఫలితాలివ్వగా, వారి కుటుంబాలు మాత్రం ప్ర స్తుతం బజారున పడినట్లు ఆవేదన వ యక్తం చేశారు. త్యాగాలు సకలజనుల వి, భోగాలు మాత్రం కేసీఆర్ కుటుంబానివని ఎద్దేవా చేశారు. ఓయూలో జరిగిన మురళి ఆత్మహత్య సంఘటన లో ప్రతాప్‌రెడ్డితో కలిసి తాను సైతం జైలుఊచలు లెక్కించగా, తగిన మూ ల్యం చెల్లించుకోవడానికి టీఆర్‌ఎస్ సిద్దంగా ఉండాలని తెలిపారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికా రం చేపట్టడం ఖాయమని, పైన ప టారం, లోనలొటారం అన్నట్లుగా టీ ఆర్‌ఎస్ పాలన కొనసాగుతోందని, గజ్వేల్‌లో కాంగ్రెస్ హయాంలో జరిగి న అభివృద్దిని నామరూపాలు లేకుం డా చేస్తున్న కేసీఆర్ ఇక్కడి ప్రాంతాని కి ఒరగబెట్టిందేమీ లేదని, అయితే ఎ డ్యుకేషన్‌హబ్‌లో టీచర్లుండరని, ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో వైద్యులుండరని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబం ఎన్నికల్లో ఖర్చు చే యడానికి సిద్దంగా ఉందని, తెలంగా ణ సమాజాన్ని భ్రమల్లో ఉంచుతున్న టీఆర్‌ఎస్ ఇచ్చిన ఏఒక్క హామీని అ మలు చేయలేదన్నారు. 116 నోటిఫికేషన్‌లు వేయగా, కేవలం 12700 మం దిని భర్తీచేసి చేతులు దులుపుకోగా, లక్షలాది ఉద్యోగాలు కల్పించినట్లు ప్ర కటనలు ఇచ్చుకుంటుండడం సిగ్గుచేటని నిలదీశారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ జరుపుకున్న సర్వేలో ఓటమి ఖా యమని తెలుసుకున్న ఆయన పక్క నియోజకవర్గాలపై కనే్నయగా, ఇక్కడి ఉద్యమకారులు రోడ్డున తిరుగుతున నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వా యప్తంగా ఉద్యమకారులను పక్కనబెట్టి న కేసీఆర్ తనను వ్యతిరేకించి ఉద్యమకారులను తన్నించిన నేతలకే మం త్రి పదవులు, కార్పోరేషన్ పదవులు క ట్టబెట్టినట్లు చెప్పారు. ఎన్నికల కోస మే రైతుబంధు పథకం అమలు చే యగా, పెద్దరైతులకే ప్రయోజనం జరిగిందని తెలిపారు. రైతులు, నిరుద్యోగులు, కార్మికులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, మహిళలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉండగా, గతంలో అమలు చేసిన అన్ని పథకాలకు తిరిగి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ అధికారం చేపట్టగా నే ఆరోగ్యశ్రీతో కార్పోరేట్ వైద్యం కొ నసాగిస్తామని, రూ. 2లక్షల పంట రు ణమాఫీ చేస్తామని, రూ. 3 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, రూ. 6 లక్షలతో ఇల్లు నిర్మించిఇస్తామని తమ మేనిఫెస్టోలో పొందుపర్చుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర అ ధికార ప్రతినిధి వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ వెంకట్‌రాంరెడ్డి, ఆయా మ ండలాల బాధ్యులు నర్సింహాచారి, న రేందర్‌రెడ్డి, మామిడ్యాల శ్రీనివాస్, శ్రీ నివాస్‌రెడ్డి, కృష్ణారెడ్డి, పురం రవి, నేత లు భానుప్రకాశ్‌రావు, గుంటుకు మ ల్లేషం, తదితరులు పాల్గొన్నారు.

పార్టీ అభివృద్ధికి సైనికుల్లా పనిచేయాలి
* రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ భూపతిరెడ్డి
ములుగు, జూలై 12: పార్టీ అభివృద్దికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని రాష్ట్ర పర్యాటకశాఖ అభివృద్ది సంస్థ చైర్మెన్, నియోజకవర్గ ఇంచార్జి పన్యాల భూ పతిరెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని క్షీరసాగర్, జప్తిసింగాయపల్లి, లక్ష్మక్కపల్లి గ్రామాలలో గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలు చేశారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేస్తున్న అభివృద్ది పనులను ప్రజలకు ధైర్యం చెప్పి మెప్పించాల్సిన బాధ్యత గ్రామ కమిటీలు, కార్యకర్తలకు ఉన్నదని ఇందులో పాలుపంచుకొని పార్టీ అభివృద్దిలో పాలుపంచుకోవాలని తెలిపా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ది పనులు దేశచరిత్రలోనే నిలిచిపోనున్నాయని వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మెన్ జహంగీర్ తెలిపారు. పార్టీకి పట్టుకొమ్మలైన కార్యకర్తలు సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి చొచ్చుకెల్లేలా తమ వం తు కృషిని అందించాలని తెలిపారు. ఇప్పటివరకు గ్రామాలలో చేసిన అభివృద్ది ఇంకా చేయాల్సిన అభివృద్దిని గుర్తించి సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ ప్రజలతో చర్చి ంచి అభివృద్ది పనులతో ముందుకెళ్లాలని ఆయన తెలిపారు. జప్తిసింగాయపల్లి గ్రామంలో మహిళలు, యువకులు సుమారు 100 మంది వరకు పార్టీలో చేరగా, కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జెడ్‌పీటీసీ సింగం సత్తయ్య, పీఏసీఎస్ చైర్మెన్ పోచిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మెన్ సలీం, మండల యు వత విభాగం అధ్యక్షులు బట్టు అంజిరెడ్డి, జుబేర్ పాషా, తదితరులుపాల్గొన్నారు.