మెదక్

దొర కబంధ హస్తాల్లో తెలంగాణ తల్లి బందీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జూలై 12: రాష్ట్రాన్ని 4 ఏళ్లలో రూ. 2లక్షల కోట్ల అప్పు చేసిన సీఎం కేసీఆర్ ప్రజలను అధోగతిపా లు చేస్తున్నట్లు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శి ంచారు. గురువారం గజ్వేల్‌లో ఏ ర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం లో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నించే నేతల పై అక్రమ కేసులు నమోదు చేస్తుండ గా, దొర కబంద హస్తాల్లో తెలంగాణ తల్లి బందీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది త్యాగాల ఫలిత ంగా, సోనియా, మన్మోహన్ చొరవతో తెలంగాణ రాష్ట్రం సిద్దించగా, వారిపైనే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న మ ంత్రి కేటీఆర్ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని ఎద్దేవా చేశారు. కాం గ్రెస్ నుండే సీఎం కేసీఆర్ రాజకీయ ప్రస్తానం ప్రారంభంకాగా, అదే కాం గ్రెస్‌పై విమర్శలు చేస్తూ ఆ పార్టీని నా మరూపాలు లేకుండా చేస్తానని పే ర్కొనడం సిగ్గుచేటని నిలదీశారు. అధికారం చేపట్టి 4 యేండ్లైనా ఏఒక్క ప్రా జెక్టును ప్రారంభించి పూర్తిచేయని టీ ఆర్‌ఎస్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వ హ యాంలో చేపట్టిన పనులకు రంగులు వేసి ప్రారంభిస్తున్నట్లు ఆరోపించారు. ఈయేడాదిలోగా సాగునీటి కోసం గో దావరి జలాలను రప్పిస్తామని, గజ్వేల్‌కు రైలుకూత వినిపిస్తామని టీఆర్‌ఎస్ స్పష్టం చేస్తుండగా, మరో 4 యే ండ్లైనా సాగునీరు అందే పరిస్థితి లే దని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఒక కేసీఆర్ కు టుంబం బాగుపడగా, బడుగు, బలహీన వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అ ంతేగాకుండా ప్రభుత్వం చేపట్టిన మి షన్‌భగీరథ, మిషన్‌కాకతీయ, ప్రాజె క్టు నిర్మాణాలలో పెద్దఎత్తున అవినీతి జరుగుతుండగా, అన్ని శాఖల్లో సైతం అదే పరిస్థితి కొనసాగుతోందని ఎద్దే వా చేశారు. గజ్వేల్‌తోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని, గజ్వేల్ కార్యకర్తలకు, ప్రజలకు అం డగా ఉంటూ కష్టసుఖాల్లో పాలు పం చుకుంటానని తెలిపారు. సాగర్ ప్రక్షాలన, స్కైఫ్లైఓవర్‌లు, ఛాతీ ఆసుపత్రి త రలింపు, సెక్రటేరియట్ కూల్చివేత ఏ మైందని, హైదరాబాద్‌ను విశ్వనగరం గా, లండన్, డల్లాస్, సింగపూర్‌లా మార్చుతానని చెప్పిన మాటలు ఏమయ్యాయని నిలదీశారు. హైదరాబాద్ అభివృద్ది కాంగ్రెస్‌తోనే సాద్యమని వివరించారు. కార్యక్రమంలో నేతలు నర్సింహాచారి, మల్లేషం, గాలెంక న ర్సింలు, భానుప్రకాశ్, నరేందర్‌రెడ్డి, మామిడ్యాల శ్రీనివాస్, కృష్ణారెడ్డి, హైమధ్, తదితరులు పాల్గొన్నారు.

హరితహారం విజయవంతం చేయాలి
తొగుట, జూలై 12: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఆర్‌డిఓ నవీన్ అన్నారు. గురువారం మండలంలోని పెద్దమాసాన్‌పల్లి, ఎల్లారెడ్డిపేట, కాన్గల్ గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో గ్రామ గ్రామాన మొక్కలను విరివిగా నాటాలని సంకల్పించడం జరిగిందన్నారు. ఈ మూడు గ్రామాల్లోనే ఫారెస్ట్ బ్లాక్ మొక్కలు 2.66 లక్షలు నాటాలని నిర్ణయించామన్నారు. వాటన్నింటిని సంరక్షించేలా పకడ్బంధి చర్యలు చేపట్టాలని ఏపిఓ కిషన్‌రాజ్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈసి యాదగిరి, టీఏలు అరవింద్, రమేశ్, సంతోష్, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.