క్రైమ్/లీగల్

పోలీసుల అదుపులో నగల దొంగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, జూలై 14: పటన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ గ్రామ పంచాయతి పరిధి భీరంగూడలోని నగల దుకాణంలో జరిగిన భారీ చోరీ కేసును స్థానిక పోలీసులు చేధించారు. తీవ్ర సంచలనానికి దారి తీసిన ఈ కేసుకు సంబంధించిన నేరస్థుల వివరాలను జిల్లా పోలీసుల సహకారంతో కేవలం పది రోజుల వ్యవధిలోనే కనుగొన్నారు. నగల దుకాణంలో దోపిడీకి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసిన పటన్‌చెరు పోలీసులు న్యాయస్థానం రిమాండుకు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్‌పీ చంధ్రశేఖర్‌రెడ్డి శనివారం స్థానిక పోలీస్‌స్టషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో తెలిపారు. ఆయన అందించిన సమాచారం ప్రకారం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. అమీన్‌పూర్ గ్రామ పంచాయతి పరిధి భీరంగూడ లోని సోమవారం సంత వద్ద సాయికాలనిలోని ఎంఎస్‌ఆర్ షాపింగ్ కాంప్లెక్స్‌లో శ్రీ భవాని పేరిట నగల దుకాణం ఉంది. గత పది సంవత్సరాలుగా నిరాటంకంగా వ్యాపారం నిర్వహిస్తున్న నగల దుకాణం యజమాని జయరాం చౌదరి రోజు మాదిరిగానే ఈ నెల 3వ తేదీన ఉదయం దుకాణం తెరిచాడు. ఇదిలా ఉండగా రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలకు ఒక ఆడ, ఒక మగ మనిషి ఇద్దరు భార్యభర్తలుగా దుకాణంలోకి ప్రవేశించారు. నగలు కొనటానికి వచ్చినట్లు నటిస్తూ వారు ఇద్దరు తొమ్మిది గంటల యాభైనిమిషాల వరకు దుకాణంలోనే ఉండిపోయారు. షాపు మూసివేసే సమయం అయింది అని నగల దుకాణం యజమాని జయరాం చౌదరి వారితో చెప్పారు. దీనితో వారు ఇరువురు చివరగా ఒక ఆర్డరు ఇచ్చి వెళతాము మీరు షాపు మూసుకోండి అని యజమానితో చెప్పారు. వారి మాటలు విశ్వసించిన సదరు యజమాని దుకాణంలోని నగలన్నిటిని మూటగా కట్టి వెనుక ఉన్న బీరువాలో పెట్టడానికి వెళ్లాడు. అతని వెనుకాలే లోపలికి వచ్చిన మగ వ్యక్తి నకిలీ పిస్తోలు చూపించి బెదిరించాడు. దీనితో ఎదురు తిరిగిన దుకాణం యజమాని జయరాం చౌదరి అగంతకుని వద్ద నుండి పిస్తోలు లాక్కొని, దానితోనే అతనిని కొట్టగా దోపిడిదారుడు గాయపడ్డాడు. ఇద్దరు కలియబడుతుండగా వెనుక ఉన్న ఆడ మనిషి యజమాని కళ్లల్లో కారం కొట్టింది. అనంతరం అతనిని బాత్‌రూంలో బంధించారు. బీరువాలోని నగలను, నగదును తీసుకుని అక్కడి నుండి ఇద్దరు పారిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేరస్థుల ఆచూకి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. సైబరాబాద్‌కు చెందిన ఎస్‌ఓటీ పోలీసు ప్రత్యేక బృందం, సంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోలీసు బృందాలు కలిసి సంయుక్తంగా దోపిడీ దొంగల ఆచూకి కోసం వెతకడం ప్రారంభించాయి. సీసీ పుటేజీలను పరిశీలించిన పోలీసులు దోపిడీకి పాల్పడిన అనంతరం మోడి బిల్డర్స్ గోల్డెన్ ఫాంలోకి వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ సునిశితంగా తనిఖీలు నిర్వహించిన పోలీసు ప్రత్యేక బృందాలు పురోగతిని సాధించాయి. ఒక సంవత్సరం ఆరు మాసాల నుండి అక్కడే గోల్డన్ ఫాంలోని ఒక ఇంట్లో నివాసం ఉంటున్నట్లు కనుగొన్నారు. సదరు కాలనీలో వారు నివాసం ఉంటున్న పరిసర ప్రాంతాల నుండి నగల చోరికి పాల్పడిన వారి ఫోన్ నంబర్లు సేకరించారు. వాటి ఆధారంగా దర్యాప్తు నిర్వహించగా నేరస్థులిద్దరు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కత్తా నగరంలో ఉన్నట్లు కనుగొన్నారు. ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకుని చాకచక్యంతో అక్కడి పోలీసుల సహకారంతో నేరస్థుల ఆచూకి కనుగొన్నారు. నగల దుకాణంలో చోరీకి పాల్పడిన సునీల్ మహతో, సునీతా మహతో అనే ఇద్దరిని అరెస్టు చేసి వారి నుండి 95,200 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగల దుకాణం నుండి వారు మూటగట్టుకుని పారిపోయిన నగలను మాత్రం పోలీసులు రికవరీ చేయాల్సి ఉంది. కోల్‌కత్తా మహానగరంలోని న్యాయస్థానంలో ముందుగా నేరస్థులను హాజరు పరిచి, న్యాయమూర్తి అనుమతితో ఇక్కడికి తరలించారు. ఒరిస్సా రాష్ట్రం నుండి ఇక్కడికి వ్యాపారం నిమిత్తం వచ్చిన వారిద్దరు భారీ చోరీకి పాల్పడ్డారు. శనివారం వారిని జిల్లా న్యాయస్థానం రిమాండుకు తరలించారు. ఇంకా ఈ సమావేశంలో పటన్‌చెరు డిఎస్‌పి సీతారాం, సిఐ లు, ఎస్‌లు పాల్గొన్నారు.