మెదక్

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జూలై 16: సోమవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, మధ్యలో భారీ వర్షం కురియడం వల్ల జన జీవనం స్థంభించింది. వర్షాలతో వరినాట్లు ప్రారంభమయ్యాయి. మెదక్ జిల్లాలో 94 వేల 670 ఎకరాలు వరి సాగుకాగా అందులో 54 వేల ఎకరాల్లో వరినాట్లు వేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరుశురాం నాయక్ సోమవారం మాట్లాడుతూ తెలిపారు. జిల్లాలో సాగుభూమి 3.20 లక్షలు ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా వర్షాభావ పరిస్థితుల కారణంగా మెదక్ జిల్లాకు ఏకైక మధ్యతరహా ప్రాజెక్ట్ అయిన ఘణపురం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజిలో ఉండి. సింగూర్ ప్రాజెక్ట్‌లో 8.07 టీఎంసీ నీళ్లు మాత్రమే ఉన్నాయి. దీని కెపాసిటి 29.5 టీఎంసీ కెపాసిటి ఉంది. కాగా కర్ణాటకలో వర్షాలు కురవకపోవడం వల్ల సింగూర్‌కు వరద నీరు లేకపోవడం, సింగూర్‌లోనే తక్కువ నీరు ఉండటం వల్ల రైతులలో పంటల విషయంలో ప్రశ్నార్ధకరంగా మారింది. సింగూర్ నుండి 0.35 టీఎంసీ నీళ్లు వదలాలని పీసీసీ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కురిసిన వర్షంతో మెదక్ జిల్లా తడిసి ముద్దయింది. పట్టణం చిత్తడిగా మారింది. వర్షాలకు ప్రజలు ప్రయాణించడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నారుమల్లు వయస్సు దాటిందని రైతులు వాపోతున్నారు. అందువలన వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి సింగూర్ జలాలను ఘణపురం ప్రాజెక్ట్‌కు విడుదల చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లాలో మూడే వేలకుపైగా చెరువు, కుంటలు ఉన్నాయి. ఏ చెరువులోకి కూడా నీళ్లు రాలేదు. కేవలం మూడు చెరువుల్లోకి మాత్రమే 25 శాతం నీళ్లు వచ్చినట్లు ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఈఈ శివనాగరాజు మాట్లాడుతూ తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులకు ఎకరాకు ఇచ్చిన నాలుగు వేల రూపాయలతో మందులు, విత్తనాలు ఖరీదు చేసినప్పటికీ ఎకరాకు 15 వేల ఖర్చు వస్తుందని రైతులు చెబుతున్నారు. వర్షాలతో రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నందున డ్రైన్స్ అక్కడక్కడ ఏర్పడిన గుంతలు, రోడ్డుపైన ఏర్పాడిన గుంతలు ప్రమాదకరంగా మారాయి. పెద్దబజార్ రోడ్డు విస్తరణలో ఆ ప్రాంతమంతా చిత్తడిగా మారడంతో ప్రయాణించలేని పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. రాందాస్ చౌరస్తాలో రోడ్లపైనే నీరు వరదలా పారుతున్నాయి. డ్రైన్స్ నిండినప్పటికీ వర్షపాతం అంతగా నమోదు కాలేదని వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ఇంకా 50 శాతం వరినాట్లు వేసే పనుల్లో రైతులు నిమగ్నమై ఉన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించినప్పటికీ మెదక్ జిల్లాలో అంతంతమాత్రమే వర్షాలు కురుస్తున్నాయి. చిరు జల్లులు, మధ్యలో భారీ వర్షాలు కురియడంతో మెదక్ జిల్లా కేంద్రం తడిసి ముద్దయింది. మెదక్ మహిళా డిగ్రీ కళాశాలకు భవనాలు లేక విద్యార్థులు హాజరుకాలేకపోయారు. వెంటనే మహిళా డిగ్రీ కళాశాల భవనాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అందజేయాలని ఆ కళాశాల విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు.