మెదక్

విజయమే లక్ష్యంగా పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 16 : 2019లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని, సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసేందుకు పార్టీ నాయకులు, కార్యాకర్తలు ఐక్యమత్యంతో కంకణ బద్ధులై పనిచేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి, జిల్లా సమన్వయ కర్త ప్యాట రమేశ్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక బాలగౌడ్ ఫంక్షన్‌హాల్‌లో సిద్దిపేట నియోజక వర్గం కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేయటం, కార్యకర్తలో మనోధైర్యం నింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. యువకుల బలిదానంతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ సర్కార్ ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించిందన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు, లక్ష ఉద్యోగాలు, దళితులకు మూడు ఎకరాల భూమి, మహిళలకు వడ్డీలేని రుణాలు కల్పిస్తామని పలు హామీలిచ్చి ఏ ఒక్క హామీలు నేరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు 2లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతి 3వేలు, ఇందిరమ్మ ఇళ్లతోపాటు అదనంగా లక్ష రూపాయలు చెల్లిస్తామన్నారు. విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందచేస్తే తెలంగాణ సర్కార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించకుండ కళాశాలలను మూసివేసి, విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసిందన్నారు. కేసీఆర్ కుట్ర పూరితంగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందన్నారు. స్థానిక సంస్ధలకు అధికారాలు కల్పించకుండ ఉత్సహ విగ్రహాలుగా మార్చిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ రేషన్‌షాపుల్లో 9రకాల వస్తువులను అందచేస్తే కేసీఆర్ సర్కార్ రేషన్‌షాపులను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. కేసీఆర్ నియంతతో దొరల పాలన సాగిస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ పాలన అంత అవినీతిమయమని, కమీషన్లతో పెద్దఎత్తున దండుకుంటున్నారన్నారు. అవీనీతి పాల్పడిన టీఆర్‌ఎస్ నేతలను జైల్లో పెట్టే రోజుల్లో దగ్గర్లో ఉన్నాయన్నారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టుల రీ డిజైన్ చేశారన్నారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు ఫథకం భూస్వాములకు వరంగా మార్చి పట్టాలు అందచేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్ నేతల కబంద హస్తాల నుండి విముక్తి కల్పించాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ సర్కార్ ఇసుక మాఫీయాకు వత్తాసు పలుకుతుందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీని తరిమికొట్టె రోజులు దగ్గర్లో ఉన్నాయన్నారు. కోమటిచెరువు అభివృద్ధి కోసం వంద కోట్లకు పైగా ఖర్చు చేశారని, దీనిపై శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీసీసీ సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోని ఇంటిదొంగల వల్లనే పార్టీ దీనవస్థకు చేరుకుందని, ఇంటిదొంగలను పార్టీనుండి తొలగించాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలిపారు. పార్టీలో క్రమశిక్షణతో పనిచేసేవారికి అవకాశం కల్పించాలన్నారు. పీసీసీ కార్యదర్శి గంప మహేందర్‌రావు, యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి పూజల హరికృష్ణ, నియోజక వర్గం ఇంచార్జి శ్రీనివాస్‌గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్‌వర్మలు మాట్లాడుతూ నియోజక వర్గంలో పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు అండగా పార్టీ నిలువాలన్నారు. పార్టీ టికెట్ ఎవ్వరికి వచ్చిన కలసి కట్టుగా పనిచేస్తామన్నారు. 2019లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈకార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి మార్క సతీష్, డీసీసీ మైనార్టీసెల్ చైర్మన్ కలీమోద్దీన్, కాంగ్రెస్ నేతలు సోప్పదండి చంద్రశేఖర్, డీసీసీ మహిళ అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, రఘు, భూపతిరెడ్డి, ఎన్‌ఆర్‌ఐ నేత శ్యాంప్రసాద్‌రెడ్డి, సాయిఈశ్వర్‌గౌడ్, వంగరి నాగరాజులు తదితరులు ప్రసంగించారు. ఆనంతరం జిల్లా సమన్వయ కర్త ప్యాట రమేశ్‌ను పలువురు కాంగ్రెస్ నేతలు సన్మానించారు.

అభివృద్ధిలో తెలంగాణ ఆదర్శం
*అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం *ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి
పాపన్నపేట, జూలై 16: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పనులు, పలు సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలంగాణ శాసనసభ ఉపసభాపతి ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం పాపన్నపేట మండల పరిధిలోని రామతీర్థం, నర్సింగరావుపల్లి, గాజులగూడెం, చిత్రియాల్, బాచారం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపనలు చేశారు. రామతీర్థం గ్రామంలో గ్రామపంచాయితీ భవనాన్ని, సీసీ రోడ్డును పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. అలాగే కుర్మ సంఘం భవనానికి, డబుల్ బెడ్‌రూమ్‌ల నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. నర్సింగరావుపల్లి గిరిజన తండాల్లో ఎస్సీ కమ్యూనిటి హాల్, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. బాచారం, చిత్రియాల్, గాజులగూడెం గ్రామాల్లో రెండు పడకల నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్దే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అభివృద్ది, సంక్షేమంలో భారతదేశానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం పనిచేయడం పట్ల పలువురు ప్రసంశిస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను తెరాస ప్రభుత్వం నిర్మిస్తుందని, మల్లన్నసాగర్‌తో మెదక్ జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్‌రూమ్‌లను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మైనార్టీల సంక్షేమంతో పాటు కుల వృత్తులను ఆదుకునే విధంగా అభివృద్ది చేసే దిశలో సీఎం ఒక ప్రణాళికలతో ముందుకు వెళ్లి కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. మైనార్టీలకు షాదీ ముబారక్, నిరుపేదలకు ఆసరా వంటి ఎన్నో సంక్షేమ పథకాలను పేద ప్రజలకు తెరాస ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వ్యవసాయానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రైతులకు రుణమాఫి, నిరంతర ఉచిత విద్యుత్, రైతుబంధుతో రైతులందరిని అన్ని రంగాల్లో ఆదుకుంటున్నారని ఆమె వివరించారు. ఈ సమావేశంలో మెదక్ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సోములు, డీసీసీబీ డైరెక్టర్ మోహన్‌రెడ్డి, మెదక్ జడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఎంపీపీ అధ్యక్షురాలు పవిత్ర దుర్గయ్య, జడ్పీటీసీ స్వప్న బాలాగౌడ్, ఏడుపాయల మాజీ చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి, పాపన్నపేట మార్కెట్ కమిటి చైర్మన్ రవీందర్‌నాయక్, వైస్ చైర్మన్ గురుమూర్తిగౌడ్, ఎంపీపీ ఉపాధ్యక్షులు జి.విష్ణువర్దన్‌రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఉస్మాన్, పంచాయితీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు అనురాధ బాబాగౌడ్, వెంకటరాములు, కిష్టయ్య, తెరాస నాయకులు దుర్గయ్య, బాలరాజు, ఉమామహేశ్వర్, ఏడుపాయల మాజీ డైరెక్టర్లు పి.అంజిరెడ్డి, తహశీల్దార్ రాములు, ఎంపీడీఓ రాణి తదితరులు పాల్గొన్నారు.