మెదక్

యుద్ధప్రాతిపదికన భగీరథ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూలై 16: జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నియోజకవర్గంలో మిషన్ భగీరథ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి హరితహారం, మిషన్ భగీరథ, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యం, డబుల్ బెడ్ రూం ఇళ్లు, సంక్షేమం తదితర అంశాలపై శాసన సభ్యులతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గంలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి ఆయా శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. నియోజకవర్గంలోని అన్ని హాబిటేషన్లకు ఈ నెల 25లోగా నీళ్లు అందించాలని, అదే విధంగా ఇంట్రా పనులు, ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణాలు పూర్తికావాలని సంబంధిత అధికారులకు సూచించారు. వసతి గృహాలకు, రెసిడెన్షియల్ పాఠశాలలన్నింటికి నల్లా కనెక్షన్లు ఇవ్వాలని చెప్పారు. పనులు త్వరితగతిన నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో ఎక్కడెక్కడ పైపులైన్‌లు లీకేజి అవుతున్నాయో గర్తించి తక్షణమే వాటిని మార్చాలని ఆదేశించారు. మిషన్ భగీరథ పనులను క్షేత్ర పరిధిలో పరిశీలించి వేగవంతంగా పూర్తి చేసేలా సంబంధిత శాఖ వారితో సమన్వయపర్చుకోవాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. వైకుంఠదామాల పనులు వేగవంతంగా చేయాలని ఆదేశించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపు, ఇప్పటి వరకు నియోజకవర్గంలో పూర్తయిన ఇళ్ల వివరాలు సంబంధిత అధికారులను అడిగారు. ఆగస్టు 15 నాటికి కనీసం వంద ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయించేలా చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గంలోని అన్ని ఇళ్లను నవంబరు మాసాంతానికి పూర్తి చేసేలా ప్రణాళిక చేసుకోవాలని తెలిపారు. బ్రిడ్జీలు, రోడ్లు, భవనాల పనుల పురోగతిని, జాప్యానికి గల కారణాలను సంబంధిత అధికారులతో సమీక్షించారు. నిర్మిత కేంద్రంలో చేపల మార్కెట్ ఏర్పాటు చేయడానికి స్థలాన్ని చూపించాలని తహశీల్దార్ విజయను ఆదేశించారు. స్థలం కేటాయింపు పూర్తయితే టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులతో చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించి పనులన్నింటిని సకాలంలో పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి ఏ ఏ ఆసుపత్రులలో రోజుకు ఎన్ని ప్రసవాలు అవుతున్నాయో ఆ నివేదికను ఇవ్వాలన్నారు. ఈడీడీ క్యాలెండర్‌ను పీహెచ్‌సీ వారీగా విడుదల చేయాలని తెలిపారు. కేసీఆర్ కిట్లు, ప్రసవించిన వారికి అందిస్తున్న పేమెంట్స్ సకాలంలో అందించాలని సూచించారు. సీజన్ మారినందున పలు రకాల వ్యాధులు ప్రబలే అవకాశముందని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణాలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. సంగారెడ్డి శాసన సభ్యులు చింతా ప్రభాకర్ మాట్లాడుతూ అభివృద్ధి నిరంతరం జరిగే ప్రక్రియ అని, అభివృద్ధి సమాంతరంగా కొనసాగాల్సి ఉన్నా, పనులు మంజూరైనప్పటికీ పూర్తి చేయడంలో కొంత జాప్యం చోటుచేసుకుంటుందని విచారం వ్యక్తం చేసారు. జాప్యానికి గల కారణాలు పరిష్కరించుకుని సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ఏవేని ఇబ్బందులు, లోపాలు ఉన్నట్లుయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కొండాపూర్ జూనియర్ కళాశాలను పూర్తి చేసి త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియేట్ బోర్డు అధఇకారి కిషన్‌కు సూచించారు. అంబేద్కర్ స్టేడియం పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులతో కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అందరిని భాగస్వాములను చేయాలని తెలిపారు. నియోజకవర్గంలో 25 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా ఉందని, అందుకు అనుగుణంగా ప్రణాళిక చేయాలన్నారు. పెట్టిన ప్రతి మొక్క బతికించుకోవాలని తెలిపారు. ఎక్కడ ఏ మొక్క పెడితే బాగుంటుందన్న విషయాన్ని ఆలోచించి చర్యలు చేపట్టాలన్నారు. స్మృతి వనాలను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. పరిశ్రమలలో పెట్టడానికి అనువైన మొక్కలు అందుబాటులో ఉంచాలని శాసన సభ్యుడు డీఎఫ్‌ఓ వెంకటేశ్వర్లుకు సూచించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ నిఖిల, డీఆర్‌ఓ అంబదాస్, సీఈఓ రవికుమార్, డీపీఓ వెంకటేశ్వర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాథోడ్, డీసీహెచ్ మురారి, సంబంధిత శాఖల అధికారులు, సంక్షేమ శాఖల అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారి, తహశీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.

డంప్‌యార్డు ఏర్పాటును నిలిపివేయాలి
* కలెక్టరేట్ ముందు లక్డారం గ్రామస్థుల నిరసన
సంగారెడ్డి టౌన్/పటన్‌చెరు, జూలై 16: ఇప్పటికే కాలుష్య కొరల్లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నూతనంగా డంప్‌యార్డు ఏర్పాటు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు వెంటనే నిలిపి వేయాలని కోరుతూ పటాన్‌చెరు నియోజకవర్గం లక్డారం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామస్థులు సోమవారం కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. పటాన్‌చెరు ఎంపీపీ శ్రీశైలం యాదవ్, లక్డారం సర్పంచ్ బుద్ద ప్రభు, మాజీ ఎంపీటీసీ మాణిక్‌రెడ్డి తదితరులు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డంప్‌యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ పది గ్రామాల ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేసి కలెక్టర్‌కు వినతి పత్రం రూపంలో అందజేశామన్నారు. లక్డారం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 738లో 150ఎకరాల స్థలంలో డంప్‌యార్డు ఏర్పాటు చేసేందుకు సన్నద్దం అవుతున్నారని, ఈ నిర్ణయాన్ని మార్చుకొని ఈ భూమిలో ఏదైన ప్రజలకు ఉపయోగపడే సాఫ్ట్‌వేర్ కంపెనీలను తీసుకురావాలని కోరారు. ఈ విషయంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి విన్నవిస్తామన్నారు. కార్యక్రమంలో లక్డారం గ్రామస్థులు శ్రీనివాస్, రాంరెడ్డి, మల్లేశం, కుమార్, విరేషంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.