మెదక్

ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 19 : పోలీసు వ్యవస్థ ప్రజల రక్షణకు ముందుండాలని, ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ అన్నారు. నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురువారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆన్‌లైన్‌లోని పెండింగ్ కేసులను సమాచారాన్ని తెలుసుకొని త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇనే్వస్ట్‌గేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. గుట్కా, పేకాట, గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లపై దాడులు ముమ్మరం చేయాలని అధికారులను సీపీ ఆదేశించారు. పోలీసుస్టేషన్‌ల వారిగా విధి నిర్వహాణలో పోటీపడి నేరాలను తగ్గుముఖం పట్టించాలని సూచించారు. పోలీస్ గస్తి, పెట్రోలింగ్, బ్లూకోడ్స్, నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. క్రమం తప్పకుండ ప్రతి శనివారం కోర్టు డ్యూటీ, విలేజ్ అధికారులతో ఇంటలిజెన్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. విలేజ్ పోలీసు అధికారులు గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాలపై చర్చించుకొని చేపట్టేపోయే కార్యక్రమాలపై ప్రణాళికను తయారుచేసుకోవాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ్ర నేను సైతం కార్యక్రమంతో ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులకు సీసీ కెమెరాలపై అవగాహన కల్పించి స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో ఎక్స్‌ఫ్లోజివ్ గోదాంలు, షాపులపై మూడు నెలలకోమారు తప్పకుండ ఏసీపీలు తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఎక్స్‌ఫ్లోజివ్ షాపులపై ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పోలీస్‌క్వార్టర్స్ సమస్యను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దుబ్బాక, భూంపల్లి పోలీస్ క్వార్టర్స్‌లో డ్రైనేజీ సమస్య ఉందని తెలుపగా తెలంగాణ పోలీస్ హౌజింగ్ బోర్డు అధికారులతో మాట్లాడి త్వరలో మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. పోలీసు సిబ్బందికి, ఇంక్రిమెంట్లు, సర్వీసులకు సంబంధించి ఏ సమస్య ఉన్నా ప్రతి మంగళవారం ఫోన్ ద్వారా సమాచారం అందించినచో ఆ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో వర్టికల్ డ్యూటీలో ఉత్తమ సేవలు అందించిన పోలీసు సిబ్బందికి అభినందించి, రివార్డుతో పాటు, ప్రశంసా పత్రాలను అందచేశారు. అధికారులు, సిబ్బందికి వర్టికల్ వారీగా డ్యూటీలో ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రతి నెల రివార్డులు అందచేయనున్నట్లు తెలిపారు. ఈసమావేశంలో అడీషనల్ డీసీపీలు ప్రభాకర్, నర్సింహరెడ్డి, ఎఆర్ బాపురావు, ఏసీపీలు రామేశ్వర్, మహేందర్ పాల్గొన్నారు.