మెదక్

మత్స్యకారులకు రాయితీపై ద్విచక్ర వాహనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 19 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మత్స్యకారులకు అవసరమైన వాహనాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. గతంలో జిల్లాలో మూడు, నాలుగు వాహనాలు మాత్రమే ఇచ్చారని, ఇప్పుడు 3వేల వరకు వాహనాలను రాయితీపై పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో మత్స్యశాఖ అధికారులతో మత్యసంపద అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డితో కలసి సమీక్షించారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 75 నుండి 90 శాతం రాయితీపై ద్వీచక్ర వాహనాలు ప్లాస్టిక్ చేపలు కిట్లు, వలలు, తెప్పలు, వీటితో పాటు లగేజీ ఆటోలు త్వరలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మహిళ మత్య సహకార సంఘం సభ్యులకు వందశాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. వందశాతం 5లక్షల వరకు,వందశాతం తక్కువగా ఉంటే 3లక్షల వరకు సబ్సిడీ అందచేస్తామన్నారు. వీటిని పొందే లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువులు, కుంటలు నిండిన వెంటనే వందశాతం రాయితీపై చేప పిల్లలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.
హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచాలి
వసతి గృహాల్లో వార్డెను సమయ పాలన పాటించటంతో విద్యార్థులకు అందుబాటులో ఉండాలని మంత్రి హరీష్‌రావు సూచించారు. హస్టళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు మెను ప్రకారం భోజనం పెట్టాలని సూచించారు. వసతి గృహాలు అకస్మీకంగా తనిఖీ చేస్తానని, విధుల నిర్లక్ష్యం వహించిన వార్డెన్లపై చర్యలు తీసుకుంటానన్నారు. సిద్దిపేట నియోజక వర్గం పరిధిలోని మందపల్లి, మిట్టపల్లి, రాజగోపాల్‌పేట,ముండ్రాయి శివారులో కొత్తగా అభివృద్ధి చేయనున్న పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొండపాక మండలంలో 804 యూనిట్లకు 214 గొర్రెలు మృతిచెందటంపై మంత్రి హరీష్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. పశుసంవర్ధక శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హుస్నాబాద్‌లో యూనిట్లు ఎక్కువగా ఉన్న చాలా బాగా పనిచేస్తున్నందున అధికారిక సిబ్బందిని అభినందించారు. గొర్రెల పంపిణీలో శ్రద్ధగా పనిచేసిన మొదటి స్ధానంలో నిలిపిన మండల అధికారులకు, చివరి స్ధానంలో నిలిపిన అధికారులకు సభా వేదిక ద్వారా సన్మానం చేస్తానని పశుసంవర్ధక శాఖ అధికారులను మంత్రి హరీష్‌రావు సుతిమెత్తగా మందలించారు. పశువైద్యాధికారులు సరైన రైతిలో స్పందించటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో మమేకపై పనిచేయాలని మంత్రి సూచించారు. ఈకార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీ అంజయ్య, టీఎస్ ఐఐసి అధికారి శివ ప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి చరణ్‌దాస్, బీసీ కార్పొరేషన్ ఈడీ రాంరెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, హాస్టల్ వార్డెన్లు పాల్గొన్నారు.