మెదక్

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోగిపేట, జూలై 19: షెడ్యూల్ కులం ద్వారా వస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని అందోల్ శాసనసభ్యుడు బాబుమోహన్ అన్నారు. గురువారం జోగిపేట పట్టణంలోని శ్రీరామ గార్డెన్‌లో జరుగుతున్న ఎస్సీ కార్పొరేషన్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎస్సీల అభివృద్ధికి ప్రభుత్వం కొత్త స్కీమ్‌లను ప్రారంభించడం జరుగుతుందన్నారు. నిరుద్యోగులకు కూడా వివిధ రకాల వ్యాపారాలు చేసుకోడానికి రుణాలను కూడా అందజేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుల్లో ప్రతి ఒక్కరు పాల్గొని శిక్షణ పొందాలన్నారు. పారిశ్రామిక అభివృద్ధి పథకం కూడా ఎస్సీలకు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. నిరుద్యోగ యువకులకు 78 పథకాలను పెట్టినట్లు వివరించారు. వీటిని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సంగారెడ్డి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబురావు మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పద్దతులు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రైతులకు నర్సరీ, మామిడి తోటలు, పూల మొక్కలతో పాటు శిక్షణలు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇలాంటి అవకాశాలను దళితులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నర్సింగరావు, ఆత్మ కమిటీ చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, నాయకులు లింగన్న, వ్యవసాయ అధికారులతో పాటు పలువురు పాల్గొన్నారు.