మెదక్

బైక్‌పై తిరిగి పనుల పురోగతిపై ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూలై 19: జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోని ప్రధాన రహదారి గుండా చేపట్టిన అభివృద్ధి పనులను గురువారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. రూ.14కోట్ల 37లక్షలతో పోతిరెడ్డిపల్లి నుండి పాత బస్టాండ్ వరకు చేపట్టిన పనుల లోటు పాట్లపై ఆరా తీశారు. స్వయంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్ వెంకటేశ్వర్లు బైక్‌పై తిరుగుతూ పనుల పురోగతిని పరిశీలించి పలు సూచనలు, సలహాలు చేశారు. డ్రైన్స్ పూడుకుపోయి నీరు వెళ్లడం లేదని, వాటన్నింటిని ఓపెన్ చేసి సరి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డ్రైన్స్‌లోని చెత్తను తీసివేయాలని, లైన్స్ మార్చడం, ప్లాంటేషన్ చేయడం తదితర పనులను వేగవంతం చేయాలని హెచ్‌ఎండిఎ అధికారులను ఆదేశించారు. పోతిరెడ్డిపల్లి నుండి సంగారెడ్డికి వస్తున్న ముఖ ద్వారం అందంగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. బీటీ రెన్యూవల్స్ అయిన తరువాతే బ్లింకింగ్స్, జీబ్రాలైన్స్ పెట్టుకోవడం జరుగుతుందన్నారు. రోడ్డు డివైడర్స్ మధ్యలో నాటిన మొక్కలలో ఏమైన చనిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటాలని సూచించారు. పోల్స్‌కు, మొక్కల మద్య ఫ్లెక్సీలు కట్టకుండ చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌రావును ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆర్.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి నర్సింలు, నాయకులు చిల్వేరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

లారీల సమ్మెకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
* అధికారులకు జేసీ నిఖిల ఆదేశం
సంగారెడ్డి టౌన్, జూలై 19: లారీల సమ్మెతో జిల్లాలో ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌ఫోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) దేశవ్యాప్తంగా ఈ నెల 20నుండి లారీల నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం జేసీ తన చాంబర్‌లో ఆర్టీఓ, వ్యవసాయం, పౌర సరఫరాలు, పోలీస్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ లారీల సమ్మెతో ప్రజలను ఏలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, నిత్యావసర వస్తువులు, అత్యవసర సరుకుల రవాణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖకు సంబంధించి ఎరువులను నేరుగా సేల్‌పాయింట్ వరకు సరఫరా చేసేలా ఏజెన్సీలతో మాట్లాడాలని, రైతులు మార్కెట్‌కు తరలించే చిన్న చిన్న కూరగాయల బస్తాలను బస్సులో తీసుకెళ్లడానికి అనుమతించాలని సూచించారు. ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకున్న రవాణా వాహనాలను అడ్డగించకుండ గమ్యం చేరేవరకు తగిన రక్షణ కల్పించాలని పోలీస్ అధికారులకు సూచించారు. సమావేశంలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ వెంకటరమణ, జిల్లా వ్యవసాయ అధికారి నర్సింహారావు, పౌర సరఫరాల అధికారి శ్రీకాంత్‌రెడ్డి, సివిల్ సప్లై డీఎం విజయ్‌కుమార్, ఆర్టీసీ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.