మెదక్

కాంగ్రెస్ అధికార దాహానికి అంతులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జూలై 21: కాంగ్రెస్ పార్టీ అధికార దాహానికి అంతులేకుండా పోయిందని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు చోళ రాంచరణ్‌యాదవ్ అన్నారు. శనివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందన్నారు. కేంద్రంలో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్ దేశ ప్రధానులుగా వ్యవహరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మన్మోహన్‌సింగ్ 10 సంవత్సరాల పాటు ప్రధానిగా వ్యవహరించిన సమయంలో బీజేపీ ఎలాంటి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టలేదని ఆయన గుర్తు చేశారు. దేశ సంపదను, ఆర్థిక సంపదను కాంగ్రెస్ హయాంలో చిన్నాభిన్నం చేశారని ఆయన ఆరోపించారు. అధికార దాహం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి వీగిపోయిందని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీ ద్వారా ప్రవేశపెట్టి ఈ దేశానికి పార్లమెంట్‌లో 325 మంది ఐక్యతగా వ్యతిరేఖంగా వ్యవహరించిన విషయాన్ని గుర్తు చేశారు. అనుకూలంగా 126 మంది ఉన్నట్లు తెలిపారు. లస్కరే కాశ్మీర్ అంశాన్ని సైనికులు కోల్పోతుంటే ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదని రాంచరణ్‌యాదవ్ తెలిపారు. రామమందిరం విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేఖిస్తోంది, పాకిస్తాన్ లస్కరే తీవ్రవాదులతో చేతులు కలుపుతుందని ఆయన ఆరోపించారు. ప్రధానమంత్రి మోదీ మంచి పరిపాలన అందిస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించారన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న ప్రజా కార్యక్రమాలను ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. రుణమాఫితో రైతులు వడ్డీలకే సరిపోయారన్నారు. డబుల్ బెడ్‌రూమ్‌లకు కేంద్ర ప్రభుత్వం ఒక్కోదానికి లక్ష 70 వేల వంతున రెండు లక్షల డబుల్ బెడ్‌రూమ్‌లకు నిధులు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గర్భిణులకు ఇస్తున్న కిట్ కేసీఆర్ కిట్‌గా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. రోడ్లు, బ్రిడ్జీ అభివృద్ధి పనులకుగాను కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను తెలంగాణ ప్రభుత్వం తన నిధులుగా ప్రచారం చేసుకుంటుందని ఆయన తెలిపారు. 2019లో ఒటు అడిగే హక్కు తెరాస ప్రభుత్వానికి లేదన్నారు. జిల్లా బీజేపీ వర్తక సంఘం నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా ఎన్‌టిరామరావు స్థాపించిన సిద్దాంతాలు వదులుకొని చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎన్‌టి రామరావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రత్యేక ప్యాకేజీని పొందిన చంద్రబాబునాయుడు అమరావతిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలను మోదీ ప్రభుత్వంలో బీజేపీ చేయదన్నారు.