మెదక్

బార్ అండ్ రెస్టారెంట్‌లో తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 21 : సిద్దిపేట మున్సిపల్ అధికారులు ముస్తాబాద్ రోడ్ చౌరస్తాలోని బాలాజీ బార్ అండ్ రెస్టారెంట్‌లో శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. కమిషనర్ ఆదేశాల మేరకు శానిటరి ఇన్‌స్పెక్టర్ నగేశ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది బార్ అండ్ రెస్టారెంట్ కిచెన్‌లోని ఆహార పదార్థాలను పరిశీలించారు. రెస్టారెంట్ ప్రీజ్‌లో నిల్వఉన్న కుళ్లిన చికెన్, మటన్, పాడైన కోడిగుడ్లను స్వాధీనం చేసుకున్నారు. 5వేల రూపాయల జరిమానా విధించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ హోటళ్లు, రెస్టారెంట్లలో పాడైన మటన్, చికెన్ కోడిగుడ్లను పెడితే జరిమాన విధించటంతో పాటు, సీజ్ చేయనున్నట్లు తెలిపారు. పట్టణంలోని అన్ని హోటళ్లు, ఫాస్ట్‌పుడ్ సెంటర్లలో నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలన్నారు. నిల్వ ఉన్న కుళ్లిన ఆహార పదార్థలను విక్రయించిన, కిచెన్ షెడ్‌లు అపరిశుభ్రంగా ఉన్నా భారీ జరిమానలతో పాటు సీజ్ చేయటం జరుగుతుందన్నారు. వర్షాకాలం పురస్కరించుకొని పట్టణంలో ప్రజలకు ఏలాంటి అంటువ్యాధులు ప్రభలకుండా బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లు, నిర్వాహకులు వంటగదులను పరిశుభ్రంగా పెట్టాలని సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్లు తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య పర్యవేక్షులు నగేశ్, ఎన్విరాల్ మెంటర్ ఇంజనీర్ చందన్, ఉమేశ్ పాల్గొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతం
* అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మహేందర్
గజ్వేల్, జూలై 21: కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతమైనదని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మహేందర్, ట్రాఫిక్ ఏసీపీ బాలాజినాయక్‌లు పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ సూచనల మేరకు శుక్రవారం సాయంత్రం కాళేశ్వరం ప్రాజెక్టు, సుందిల్ల పంప్‌హౌజ్, అన్నారం బ్యారేజీ, నంది మేడారం సొరంగం పంప్‌హౌజ్, సబ్‌స్టేషన్, కనె్నపల్లిపంప్‌హౌజ్, కాళేశ్వరం ఆలయంలను పరిశీలించి వచ్చిన సందర్బంగా శనివారం గౌరారంలో స్థానిక విలేఖరులతో వారు మాట్లాడారు. భావి తరాలు, అన్నదాతల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం అభినందనీయమని స్పష్టం చేశారు. అయితే బీడుభూములు సస్యశ్యామలం కావడంతోపాటు తాగునీటి సమస్య పరిష్కారానికి కాళేశ్వరం ప్రాజెక్టు దోహదం చేస్తుండగా, ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులు ప్రజల పక్షపాతిగా ముఖ్యంగా రైతుల సంక్షేమానికి కృషి చేస్తూ ప్రతిష్టాత్మకంగా యుద్ద ప్రాతిపదికన వారు పూర్తి చేయిస్తున్నట్లు వివరించారు. గజ్వేల్ టౌన్ సీఐ ప్రసాద్, రూరల్ సీఐ శివలింగం, తొగుట సీఐ నిరంజన్, గజ్వేల్ ట్రాఫిక్ సీఐ నర్సింగరావులతో పాటు పోలీసు సిబ్బంది కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన వారిలో ఉన్నారు.

26న నర్సాపూర్‌లో భారీ బహిరంగ సభ
* ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
నర్సాపూర్,జూలై 21: నర్సాపూర్ పట్టణంలో ఈనెల 26న నిర్వహించనున్న ఆర్టీసీ బస్‌డిపో శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు, మహెందర్‌రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. శనివారంనాడు నర్సాపూర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ భారీ బహిరంగ సభ విజయవంతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తుందని అన్నారు. నర్సాపూర్ ప్రజల చిరకాలవాంఛ తీరనున్న తరుణంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు పది వేల మందిని తరలించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. బస్‌డిపో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 10కోట్లు మంజూరు చేసిందని అన్నారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేసి మారుమూల గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నట్లు తెలిపారు. సమావేశానికి జిల్లా నాయకులు మురళీయాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ హంసీబాయి, ఎంపిపి శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటీసీ సభ్యురాలు జయశ్రీ, కమల, సీనియర్ నాయకులు దామోదర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.