మెదక్

విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూలై 21: విద్యుత్ సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల విలీనం సమస్యను వెంటనే పరిష్కరించి, ఆర్డర్‌లో ఇచ్చిన పే స్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నుండి కార్మికులు సమ్మెకు దిగారు.తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు సమ్మె నోటీస్‌ను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు సంగారెడ్డి విద్యుత్ కార్యాలయం ముందు నిరసన దీక్షను చేపట్టారు. యూనియన్ అధ్యక్షుడు శ్రీ్ధర్‌గౌడ్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పని చేస్తున్న 23000వేల మంది కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో విద్యుత్ యాజమాన్యాలు 29-07-2017న కార్మికులకు సంస్థలో విలీనం చేసుకొని ఆర్డర్ కాపీలు ఇచ్చారన్నారు. దీనిపై విద్యుత్ సంస్థలకు సంబంధం లేని వారు హైకోర్టులో కేసు వేసి 12మాసాలు గడుస్తున్న యాజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి కౌంటర్ వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం వెంటనే హైకోర్టులో కౌంటర్ వేసి విలీన ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. విలీన ప్రక్రియ పూర్తయ్యేంత వరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పర్మినెంట్ ఉద్యోగులకు ఇచ్చే విధంగా మెడికల్ క్రెడిట్ కార్డ్, కార్మికుడు ఏ విధంగా చనిపోయిన రూ.10లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మెను విరమించేది లేదన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సాయిలు, శివ, ధన్‌రాజ్, లక్ష్మణ్, శ్రీనివాస్ నాయక్, ప్రసాద్, సురేష్, నారాయణ పాల్గొన్నారు.