మెదక్

కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జూలై 21: కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్యను టీఆర్‌ఎస్ సర్కార్ అందిస్తుండగా, పేద విద్యార్థుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేసి ప్రోత్సహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమ, వౌలిక వసతుల కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్‌గౌడ్ పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎడ్యుకేషన్‌హబ్, డబల్‌బెడ్‌రూం ఇళ్లు తదితర అభివృద్ధి పనులను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేయగా, సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కేజీటూపీజీ విద్య అందుబాటులోకి తెస్తుండడం గజ్వేల్ ఎడ్యుకేషన్‌హబ్ నిదర్శనంగా నిలుస్తోందని స్పష్టం చేశారు. కాగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని చూసి జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు సీఎం కేసీఆర్ లక్ష్యంగా, టీఆర్‌ఎస్ సర్కార్‌పై కోపంతో విమర్శలు చేయడం కాకుండా సమయం తీసుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు వస్తే అభివృద్ధిని చూపించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దేశంలోనే గజ్వేల్‌ను ఆదర్శంగా, రోల్ మోడల్‌గా సీఎం కేసీఆర్ నిలుపుతుండడం ఇక్కడి ప్రజల అదృష్ట మని అన్నారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్‌హబ్‌లో నాణ్యమైన, విలువలతో కూడిన విద్య అందిస్తూ చక్కటి వాతావరనంలో విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీస్తున్న గురువులను అభినందిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ శాఖ చేపట్టని విదంగా తమ సంస్థ పేద విద్యార్థుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ కార్పోరేట్ స్థాయిలో మెరుగైన విద్య, వౌలిక వసతులు కల్పిస్తూ ప్రోత్సహిస్తుండగా, జిల్లా నుండి గతంలో ప్రాతినిత్యం వహించిన దామోదర్ రాజనర్సింహ, గీతారెడ్డి, సునితారెడ్డి గజ్వేల్ అభివృద్ధిని చూసి సంతోషించాలని కోరారు. విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న విదంగా తెలంగాణలో సకల వసతులతో కూడిన చక్కటి విద్యను అందిస్తుండగా, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి హరీష్‌రావుల కృషి ఎంతో ఉన్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి, గడా అధికారి హన్మంతరావు, ఆర్డీఓ విజేందర్ రెడ్డి, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ సీఈ మల్లేష్, ఎస్‌ఈ నందకుమార్, ఈఈ అనీల్‌కుమార్, డిప్యూటీ ఈఈ రాంచంద్రం, ఎడ్యుకేషన్‌హబ్, డబుల్‌బెడ్‌రూం ఎజెన్సీలు మధుసూదన్‌రావు, బన్వర్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.

వర్సిటీ పనుల్లో నాణ్యత పాటించాలి
* అటవీ శాఖ మంత్రి జోగు రామన్న
ములుగు, జూలై 21: సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలోని ఫారెస్టు రిసర్చ్ సెంటర్‌లో నిర్మిస్తున్న ఫారెస్టు వర్సిటీ నిర్మాణ పనులను శనివారం మంత్రి జోగు రామన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీని నాణ్యత ప్రమాణాలతో కూడిన నిర్మాణాలు చేపట్టి పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ వర్సిటీలోని తరగతిగదుల నిర్మాణం, అలాగే హాస్టల్ గదుల నిర్మాణాలు బ్రహ్మాండంగా ఉన్నాయని ప్రశంసించారు. అంతకు ముందు రిసర్చ్ సెంటర్‌లోని అటవీ ప్రాంతం, నర్సరీలను ఆయన పరిశీలించారు. నర్సరీల పెంపకం గూర్చి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నర్సరీల పెంపకంపై మంత్రి జోగు రామన్న సంతృప్తి వ్యక్తం చేసి అధికారులను అభినందించారు. హరితహారానికి మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రతిసారి నర్సరీలలో మొక్కలను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్టు ప్రిన్సిపల్ చీఫ్ సెక్రెటరీ అధికారి పీకేజా, చీఫ్ సెక్రెటరీ ఫారెస్టు ఏకే సిన్హా, జిల్లా ఫారెస్టు అధికారి శ్రీదర్‌రావు, డీఆర్‌ఓ వేణుగోపాల్‌రావు, ఆర్‌ఎఫ్‌ఓ వెంకట్‌రామారావు, ఎఫ్‌డీఓ కలీమొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.