మెదక్

స్వచ్ఛ జిల్లాకు అందరూ సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఆగస్టు 10: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా జిల్లా ప్రజలందరు సమిష్టిగా కృషి చేసి స్వచ్ఛత సాధించేలా సహకరించాలని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు కోరారు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని స్వచ్ఛ దేశంగా తీర్చిదిద్దాలనే తలంపుతో స్వచ్ఛ భారత్‌ను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు. ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2018 పేరిట త్రాగునీరు, పారిశుద్ధ్యంపై సర్వే ప్రారంభించిందని తెలిపారు. ఇట్టి సర్వేలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పరిశీలించి రాష్ట్ర, జిల్లా స్థాయి ర్యాంకింగ్‌లు ఇవ్వనున్నట్లు తెలిపారు. సర్వే బృంధం స్వచ్ఛ భారత్ మిషన్ వారి ప్రమాణాలను పాటించేలా జిలాల్లోని పనితీరును పరిశీలిస్తారని తెలిపారు. గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సంతలు, మతపరమైన ప్రార్థనాస్థలాలు, బహిరంగ ప్రదేశాలలో పారిశుద్ధ్య స్థితిని పరిశీలిస్తారన్నారు. అదే విధంగా గ్రామీణ స్థాయిలో ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలను పారిశుద్ధ్య గ్రామాలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. ఇందులో ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలన్నారు. అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ, వినియోగం, చెత్త నిర్వహణ, పరిసరాల పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, పారిశుద్ధ్యంపై అందరికి అవగాహన కల్పించాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ యాప్‌లో ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని చెప్పారు. ఇట్టి యాప్‌ను గూగల్ ప్లే స్టోర్‌లో ఎస్‌ఎస్‌జీ18 అని టైప్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. యాప్‌ను క్లిక్ చేసి అందులో అడిగిన ప్రశ్నలకు సమాధానాలతో తమ అభిప్రాయాలను తెలియజేసి స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నిఖిల తమ ఫోన్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని క్లిక్ చేసి ప్రశ్నలకు తమ అభిప్రాయాలను తెలియజేసారు.

రాష్ట్రంలో 35లక్షల మందికి బాలామృతం పంపిణీ
- రాష్ట్ర ఫుడ్ సొసైటీ చైర్మెన్ ఎలక్షన్‌రెడ్డి
గజ్వేల్, ఆగస్టు 10: రాష్ట్రంలో 35లక్షల మంది గర్భినీలు, బాలింతలు, చిన్నారులకు బాలామృతం ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ఫుడ్ సొసైటీ చైర్మెన్ ఎలక్షన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్‌లో రైతులకు భీమాపత్రాలు అందజేసిన సందర్బంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలలో నాణ్యమైన, పోషక విలువలతో కూడిన గుడ్లు, నిత్యావసర వస్తువులు, పాలు, పప్పులు అందజేస్తున్నట్లు తెలిపారు. అయితే బాలింతలు, గర్భినీలు, శిషువులు, చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వం నిదులు కెటాయిస్తుండగా, స్ర్తిశిషు సంక్షేమ శాఖ ఇందుకు సహకారం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ వివిద సంక్షేమ పథకాలు వర్తింపజేస్తుండగా, రైతుల అభ్యున్నతిని కాంక్షిస్తూ రూ. 8వేల పంట పెట్టుబడి, సబ్సీడీపై విత్తనాలు, పనిముట్లు, బిందుసేద్యం పరికరాలు, ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అయితే రైతు ఆత్మహత్య నివారణకు ప్రాజెక్టుల నిర్మాణాన్ని యుద్దప్రాతిపదికన పూర్తి చేస్తుండగా, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇక్కడి సాగు భూములు సస్యశ్యామలం కానున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మెన్ అరుణ భూపాల్‌రెడ్డి, కౌన్సిలర్‌లు నీరుడి మల్లమ్మ ఇస్తారి, సుబాష్‌చంద్రబోస్, సంతోషిని రాంచంద్రాచారి, స్రవంతి శ్రీనివాస్, నేతలు బెండ మదు, మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, మద్ది రాజిరెడ్డి, ఆకుల దేవేందర్, సబ్బని నరేశ్, కొనె్న రాజిరెడ్డి, బొగ్గుల చందు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రాకకు ఏర్పాట్లు సిధ్ధం
తూప్రాన్, ఆగస్టు 10: ఈ నెల 15న రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మల్కాపూర్ గ్రామానికి వస్తున్నందున టెలిప్యాడ్ మార్గంగా గానీ, బస్సుమార్గంగా గానీ వచ్చినా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు సిద్దం చేసినట్లు జిల్లా కలెక్టర్ దర్మారెడ్డి సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్‌రాం రెడ్డిలు తెలిపారు. మల్కాపూర్‌కు కలెక్టర్‌తోపాటు సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి ఎస్‌పీ చందనాదీప్తి, గడా అధికారి హన్మంతరావు, ఏఎస్‌టీ నాగరాజు, స్పెషల్ అధికారి సీతారామారావు, ఆర్డీఓ మదు, డీఎస్పీ రాంగోపాల్‌రావులు స్థలాలను పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏ మార్గంగా వస్తున్నది నిర్దారణ కాలేదని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు సిద్దం చేశామన్నారు. మల్కాపూర్‌లో బహిరంగ సభ లేదని, కేవలం గ్రామస్తులతోనే సమావేశం అవుతారని, అందుకు అనుగుణంగా పార్కింగ్ ఏర్పాట్లు, సభా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ చందనాదీప్తి మాట్లాడుతూ గ్రామానికి వస్తున్నందున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అందుకు సరిపడా సిబ్బంది ఉన్నట్లు చెప్పారు. సభను గ్రామంలోని గుడి పక్కన ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉందని దాని ప్రక్కనే రెండు ఎకరాల స్థలంలో వీఐపీలకు పార్కింగ్‌కు స్థలం కెటాయిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. మల్కాపూర్‌లో రాక్ గార్డెన్‌లో ముఖ్యమంత్రి మొక్కను నాటుతారని అందుకు అనుగుణంగా రాక్‌గార్డెన్‌ను పరిశుభ్రంగా ఉంచనున్నట్లు కలెక్టర్ చెప్పారు.