మెదక్

ముఖ్యమంత్రి రాకకు మల్కాపూర్ ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూప్రాన్, ఆగస్టు 14: ముఖ్యమంత్రి కేసీఆర్ మల్కాపూర్ గ్రామానికి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వస్తున్నందున గ్రామం పచ్చదనంతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గత వారం రోజులుగా గ్రామస్థులు చేస్తున్న కృషి నేడు ఫలించనుంది. సీఎం రాకకై హెలిప్యాడ్‌ను సిద్ధం చేయగా, సెక్యూరిటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం 3 గంటల సమయంలో ట్రాక్టర్‌లో సీఎం సెక్యూరిటీ ఐజీ ఎస్‌కే సింగ్ వచ్చి ముఖ్యమంత్రి పర్యటించే రాక్‌గార్డెన్‌ను గ్రామంలో పర్యటించి ముఖ్యమంత్రి సభ జరిగే స్థలాన్ని పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన మొక్కలు నాటడం, పరిసరాల పరిశుభ్రత, అడవిలో మొక్కలు నాటడం, రాక్‌గార్డెన్‌ను అందంగా తీర్చిదిద్దారు. సభాస్థలాన్ని రేయిన్‌ప్రూఫ్ టెంటు ఏర్పాటు చేశారు. గ్రామమంతటా పచ్చదనం కనిపించేటట్లు మొక్కలతో అందంగా అలంకరించారు. కంటివెలుగు కార్యక్రమం, బీసీ రుణాల పంపిణీ, నేత్రదానం, గేదెల పంపిణీ, పథకాలతోపాటు మల్కాపూర్ గ్రామ అభివృద్ధి పనులపై చిత్ర ప్రదర్శనను వేర్వేరుగా ఏర్పాటు చేశారు. గ్రామంలో 1350 మందికి ప్రత్యేక పాసులు ఇచ్చారు. వెయ్యి మంది గ్రామస్థులు నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఎర్రగడ్డ మార్కెట్ కమిటీ అధికారులు ఇక్కడే కూరగాయలను మార్కెట్‌లో విక్రయించడానికి ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసి 150 మందికి పాసులు ఇచ్చారు. గేదెల పంపిణీ పథకం మరికొన్ని పథకాల పంపిణీ దరఖాస్తుకై ప్రత్యేక మీసేవ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లు సమీక్షించనుందని కలెక్టర్ ధర్మారెడ్డి, గడా అధికారి హన్మంతరావు విలేఖరులతో చెప్పారు.