మెదక్

మత్స్యకారుల అభ్యున్నతికి రూ. 1100 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఆగస్టు 14 : మత్స్యకారుల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ పెద్దపీట వేసిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుఅన్నారు. మత్స్యకారులకు వందశాతం సబ్సిడీతో ఉచితంగా చేపపిల్లలను అందిస్తుందన్నారు. మత్స్యకారుల అభ్యున్నతి కోసం 1100 కోట్ల బడ్జెట్ కేటాయించిందన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో 50 లక్షలతో నిర్మించిన గంగపుత్ర కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ సమైఖ్య రాష్ట్రంలో మత్స్యకారులను విస్మరించారని, మత్స్యకారులకు కేవలం 30 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే తెలంగాణ సర్కార్ 1100 కోట్ల బడ్జెట్ కేటాయించి అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులకు సబ్సిడీపై మోపెడ్‌లు, ఆటోలు, ట్రేలు అందచేస్తున్నట్లు తెలిపారు. మహిళా మత్స్యకార్మికుల గ్రూపులకు 3లక్షల నుండి 5లక్షల వరకు రుణాలు అందచేస్తున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట నుండి చేపలు బెంగాల్, కలకత్తాకు ఎగుమతి చేయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి, గోదావరి నీరు వస్తే రిజర్వాయర్లలో చేపలు, రొయ్యల సీడ్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. మత్స్యకారులకు ఆధునికమైన మార్కెట్‌ను నిర్మించినట్లు తెలిపారు.
మొక్కులు కాదు..మొక్కలు నాటాలి
వర్షాకాలం మొక్కులు కాదని.. మొక్కల నాటాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుద్వారా గోదావరి నీరు వస్తే గంగపుత్రుల దశ మారుతుందన్నారు. సిద్దిపేట జిల్లాలో కొహెడ, శనిగరం చెరువులతో పాటు, రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ, అంతగిరి, మల్లన్నసాగర్ ప్రాజెక్టు పరిధిలో 15 ఎకరాల్లో చేపల విత్తనోత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందన్నారు. సిద్దిపేట 1.50 కోట్లతో దోబీఘాట్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కోమటిచెరువులో చేపపిల్లలను మంత్రి హరీష్‌రావు వదిలారు. ఆనంతరం మంత్రి హరీష్‌రావును గంగాపుత్రం సంఘం పక్షాన ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గౌటి అశోక్, గంగాపుత్ర సంఘం ప్రతినిధులు పెంటం శ్రీనివాస్, గౌటీ రాజు, గౌటి మల్లేశం, లక్ష్మణ్ పాల్గొన్నారు.

విద్యార్థినులతో డిప్యూటీ స్పీకర్ గ్రీన్ ఛాలెంజ్
మెదక్, ఆగస్టు 14: మెదక్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి మంగళవారం ప్యారడైజ్ మొక్కలను నాటారు. అంతకు ముందు ఉపసభాపతి ఉపాధ్యాయులు, విద్యార్థినులు ఘన స్వాగతం పలికారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడ తాను నాటిన మొక్కలు కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం నాటుతున్న మొక్కలు పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తన ఇంటిలో మూడు మొక్కలు నాటి ఛాలెంజ్ తీసుకున్నానని ఆమె వెల్లడించారు. అదే విధంగా మీరందరు కూడా ఒక్కొక్కరు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత తీసుకొని పెంచాలని పిలుపునిచ్చారు. 8వ తరగతి నుండి ఇంటర్ వరకు ముగ్గురు చొప్పున తొమ్మిది మొక్కలు నాటి వాటిని పెంచాల్సిన బాధ్యత తీసుకోవాలని తెలిపారు. వీటన్నింటిని ఛాలెంజ్‌గా తీసుకోవాలని ఆమె పిలుపునివ్వడంతో విద్యార్థులు కూడా ఛాలెంజ్ చేశారు. అంతే కాకుండా విద్యార్థులతో పాటు టీచర్లు కూడా మొక్కలు నాటి వాటిని పెంచడంలో ఛాలెంజ్ తీసుకోవాలన్నారు. మొక్కలకు అవసరమైన నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామని ఆమె వెల్లడించారు. గ్రీన్ ఛాలెంజ్‌గా మూడు మొక్కలు ఇంటిలో పెట్టుకున్నాను. మీరు కూడా గ్రీన్ ఛాలెంజ్ తీసుకొని మూడు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. మొక్కలు పెట్టిన వారు మీ పేర్లు, సెల్‌నంబర్లు ఇవ్వండి మీతో నేరుగా మాట్లాడతానని ఆమె విద్యార్థులతో అన్నారు. ఆర్డీఓ మెంచు నగేష్ 7వ తరగతిలో ఉన్న 80 మంది విద్యార్థినీలతో ఒకొక్కరు మూడు మొక్కలు నాటి బాధ్యత తీసుకోవాలన్నారు. గ్రీన్ ఛాలెంజ్‌గా ఒకరినొకరు సవాల్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, ఆర్‌కె.శ్రీనివాస్, బి.రామస్వామి, వెలుగు ప్రిన్సిపల్, వైస్ చైర్మన్ రాగి అశోక్, ఏఎంసీ చైర్మన్ కృష్ణారెడ్డి, డీఎస్‌ఓ రాజిరెడ్డి, నోడల్ ఆఫీసర్ మధుమోహన్, తహశీల్దార్ యాదగిరి, గంగాధర్, ఎంఈఓ నీలకంఠం పాల్గొన్నారు.