క్రైమ్/లీగల్

బందిపోటు దొంగల ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణఖేడ్ సెప్టెంబర్ 4 అంతర్ రాష్ట్ర బంది పోటు ముఠాను నారాయణఖేడ్ పోలీసులు సీఐ వెంకటేశ్వర్, సీసీఎస్ సీఐ శ్రీనివాస్‌నాయుడు ఆధ్వర్యంలో విచారణ జరిపి మంగళవారంనారాయణేడ్ మండలం నిజంపేట బస్టాండ్ వద్ద మోటారు సైకిల్‌పై నాందేడ్ వైపునుంచి వస్తుండగా పట్టుకున్నామని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. అయన మంగళవారంనాడు ఖేడ్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గత నెల క్రితం నారాయణఖేడ్ పట్టణంలోని రహెమాన్ ఫంక్షన్ హాల్ పక్కన గల ఓ టీవీ రిపోర్టర్ అల్లీం ఇంట్లో 2గంటల రాత్రి సమయంలో 6నుంచి 8మంది దొంగల ముఠా తలుపులు పగులగొట్టి ఇంట్లో చోరబడి ఇంటి వారిని కత్తులతో రాడ్లుతో బెదిరించి బలవంతంగా ఇంటివారిని కాళ్లూ చేతులు కట్టి ఒక గదిలో బంధించి బంగారు ఆభరణాలు, నగదు దోపిడీ చేసుకుని పారి పోయినట్లు ఇంటి యాజమాని అల్లీం ఫిర్యాదుతో కేసునమోదు చేసుకుని విచారణ చేపడుతుండగా ర్యాపన్‌వాడ్ శంకర్ అనే బందిపోటు ముఠా నిజంపేట బస్టాండ్ వద్ద పోలీసులకు దోరికినట్లు ఎస్పీ పేర్కొన్నారు. శంకర్‌తోపాటు దేవకర్ దశరత్, దేవకర్ రాజు, భయగర్ విశ్వనాథ్‌లను ఖేడ్ పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. ఈబంది పోటు ముఠా ఈ మధ్య కాలంలో 9 దోపిడీలకు పాల్పడినట్లు తెలిపారు.దోపిడీలకు పాల్పడుతున్న బంది పోటు దోంగలు మహారాష్టల్రోని నాందేడ్, జిల్లా హట్యాగావ్ గ్రామానికి చెందిన వారని తెలిపారు. దేవకర్ ముఠా నాయకుడు జూన్ చివరి వారంలో సంగారెడ్డి జైలు నుంచి విడులైనట్లు తెలిపారు. విడుదలై నాటి నుంచి దోపిడీలు చేయడం ప్రారంభించారని, నేరాస్థుల నుండి నారాయణేడ్, నర్సాపూర్, నిర్మల్ ప్రాంతాల్లో చేసిన దోపిడీలకు సంబంధించి 12 తులాలు బంగారు ఆభరణాలు, 105 తులాలు వెండి, 5సేల్ పోన్లు, ఒక మోటారు సైకల్, రెండు కత్తులను రికవరి చేసినట్లు చేప్పారు. నగదు రికవరి కాలేదని వారే ఖర్చు చేసుకున్నామని అంగిరిస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు శంకర్ ముఠా నాయకుడు, మితికరి లక్ష్మన్ బంది పోటు కరుడు కట్టిన ముఠా నాయకుడు లక్ష్మన్‌లు కలిసి మహారాష్టల్రోని పలు జిల్లాలో, తెలంగాణలో జగిత్యాల నిజామాబాద్, కామారెడ్డి, నిర్మాల్, మెదక్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, జోగులాంబ, జిల్లాలో అనేక ఇళ్లలో దోపిడీలు చేసినట్లు విచారణలో అంగికరించారని తెలిపారు. వీరు 2005 నుంచి దోపిడీలు మొదలు పెట్టి ఇప్పటి వరకు 23 దోపిడీలకు పాల్పడినట్లు చెప్పారు. లక్ష్మన్ ముఠా నాయకుడుతోపాటు 6మంది బంది పోటు దోంగలు పరారీలో ఉన్నారని తెలిపారు. వీరు సమాజనికి అత్యంత ప్రమాదకర నేరాస్తులుగా గుర్తించామని వీరిపై కఠినమైన సెక్షన్ల కింది కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. త్వరలో వీరిపై పిడియాక్ట్ కింది కేసులు నమోదు చేస్తామని తెలిపారు. రెండు ముఠాలుగా వీడి పోయి దోపిడీలు కొనసాగిస్తారని తెలిపారు. ఊరు భయట చివరలో ఉన్న ఇళ్లను ఎంపిక చేసుకుని ఇంట్లో చోరబడి కత్తులతో బెదిరించి కళ్లు చేతులు కట్టి గదిలో బంధించి ఇంట్లో వస్తువులను దోపిడీ చేసుకుని వెళ్లి పోతుంటారని ఎస్పీ తెలిపారు. అంతర్ రాష్ట్ర ముఠా కరుడు కట్టిన నేరాస్తులను పట్టుకునేందుకు కష్టపడిన ఖేడ్ సీఐ, సీఎస్‌సీ శ్రీనివాస్‌నాయుడుకి ఇతర ఎస్‌లకు సిబ్బందికి రివార్డులు ఇస్తామని ప్రకటించారు. ఇందులో సీఐ వెంకటేశ్వర్లు, సి ఐ శ్రీనివాస్‌నాయుడు, ఎస్‌ఐలు నరేందర్‌లు, రాజు, నాగిల్‌గిదా, మనూరు ఎస్ ఐలు పోలీస్ సిబ్బంది రైటర్‌లు పాల్గొన్నారు.

మందుబాబులపై కొరడా ఝుళిపిస్తున్న కోర్టులు
* మద్యం తాగి వాహనాలు నడిపిన 54 మందికి జైలు
* డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడుతున్న మందుబాబులు
సంగారెడ్డి, సెప్టెంబర్ 4: తాగుబోతులపై కోర్టు కొరడా ఝుళిపిస్తున్నా మద్యం తాగి వాహనాలను నడపటం ఏ మాత్రం మానడం లేదు. ట్రాఫిక్, సివిల్ పోలీసులు సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు అనునిత్యం నిర్వహిస్తూనే ఉన్నారు. మద్యం తాగి వాహనాలను నడపటం వల్ల ప్రమాదాలకు కారణమవుతున్నారన్న విషయంపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలను నడుపుతూ పట్టుబడిన 54 మందిని మంగళవారం జిల్లా ఎక్సైజ్ కోర్టు మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరు పర్చారు. వీరికి 2 నుంచి 7 రోజుల వరకు శిక్షను విధిస్తూ ఎక్సైజ్ కోర్టు జడ్జీ సునితారాణి తీర్పును వెలువరించారు. పటన్‌చెరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి 48 మందిని కోర్టులో ప్రవేశపెట్టగా అందులో 35 మందికి రెండు రోజుల జైలు శిక్ష, 9 మందికి మూడు రోజుల జైలు శిక్ష, నలుగురికి 7 రోజుల జైలు శిక్ష విధించారు. సంగారెడ్డి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి ముగ్గురిని కోర్టులో హాజరుపర్చగా ఇద్దరికి 2 రోజులు, ఒకరికి మూడు రోజుల జైలు శిక్షను విధిస్తూ జడ్జీ తీర్పునిచ్చారు. ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ నుండి ఒకరిని కోర్టులో ప్రవేశపెట్టగా మూడు రోజుల జైలు శిక్ష విధించారు. కొండాపూర్ పోలీస్ స్టేషన్ నుండి ఒకరిని కోర్టులో హాజరుపర్చగా మూడు రోజుల జైలు శిక్ష విధించారు. జిన్నారం పోలీస్ స్టేషన్ నుండి ఒకరిని ప్రవేశపెట్టగా రూ.2 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు. గత యేడాదిన్నర కాలంగా సంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మందుబాబులు మద్యం తాగి వాహనాలను నడుపుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన పటన్‌చెరు, రామచంద్రాపూర్ మండలాల్లో మద్యం ప్రియులు నడిరోడ్డుపై పట్టుబడుతూ కారాగారం పాలవుతున్నారు. గతంలో మద్యం తాగి పట్టుబడిన వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టగా అనంతరం కోర్టుల్లో హాజరు పరిస్తే జరిమానాలు విధించారు. తరుచుగా పట్టుబడుతున్న వారికి ఒక రోజు నుండి పక్షం రోజుల వరకు జైలు శిక్షను విధిస్తున్నారు. రామచంద్రాపూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మద్యం తాగి పోలీసులకు పట్టుబడి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన కూడా ఉంది. వాహనచోదకుల భవిషత్తు కోసం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారని తెలిసి కూడా మద్యం తాగి వాహనాలను నడపటం మాత్రం ఏ మాత్రం ఆగడం లేదు.