మెదక్

కొండగట్టు ఘటన విచారకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, సెప్టెంబర్ 12: కొండగట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటన అత్యంత విచారకరమని కాంగ్రెస్ నాయకులు వాపోయారు. దాదాపు యాబది మంది మృత్యువాత పడడం మాటల్లో వర్ణించలేని వేదనగా మిగిలిందన్నారు. బుధవారం సాయంత్రం కాంగ్రెస్ నాయకులు కొవ్వత్తుల ర్యాలి నిర్వహించి కొండగట్టు మృతులకు నివాళులు అర్పించారు. ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు కొల్కూరి నర్సింహారెడ్డి ఈ సంధర్బముగా మాట్లాడుతూ కేవలం డ్రైవరు తప్పిదం వల్ల భారీ సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందడం ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నామన్నారు. ప్రభుత్వం దీనికి నైతిక భాద్యత వహించాలని అన్నారు. మృతుల కుటుంబాలకు ఇరవై లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండు చేసారు. కేవలం పరామర్శలతోనే సరి పెట్టడం ఎంతమాత్రము సరికాదన్నారు. మానవతాధృక్పధంతో ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా స్పందించాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఖయ్యూం మతిన్ తదితరులు పాల్గొన్నారు.

మంచి అధికారిని కోల్పోయిన పశుసంవర్థక శాఖ
* మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

సిద్దిపేట, సెప్టెంబర్ 12 : పశు సంవర్ధక శాఖ మంచి అధికారిని కోల్పోయిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం విధి నిర్వహణలో గుండెపోటుతో అకాల మరణం పొందిన పశుసంవర్థక శాఖ అధికారి అంజయ్య మృతదేహానికి మంత్రి హరీష్‌రావుతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంజయ్య కుటుబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో పశుసంవర్ధక శాఖ విధి నిర్వహణలో మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నట్లు తెలిపారు. గొర్రెల పంపిణీ, పాడి పశువుల పంపిణీ, మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీలో జిల్లాను అగ్ర భాగాన నిలిపినట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించేలా కృషిచేసినట్లు తెలిపారు. పశుసంవర్ధక శాఖ సమీక్షలో సైతం అంజయ్య చూసి నేర్చుకోవాలని పలు అధికారులకు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. అంజయ్య మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. అంజయ్య కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంజయ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. మంత్రుల వెంట జేసీ పద్మాకర్, జేడీ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.