మెదక్

వీఆర్‌ఓ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, సెప్టెంబర్ 12 : టీఎస్ పీఎస్సీ ఆధ్వర్యంలో ఈనెల 16 న నిర్వహించనున్న వీఆర్‌ఓ పరీక్ష కేంద్రాల్లో పకడ్బంది ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్ అన్నారు. బుధవారం జిల్లా అధికారులు, పరీక్ష కేంద్రాలైన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు, సంబంధిత అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 22,754 టీఎస్‌పీఎస్సీ ధ్రువీకరించిన అభ్యర్థులకు జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం 15 మంది జిల్లా అధికారులను పరీక్షల కోఆర్డీనేటర్లుగా, 30 మంది లైజెన్ అధికారులను తహశీల్దార్లను, 65 మంది అసిస్టెంట్ లైజన్ అధికారులను రెవెన్యూ సిబ్బందిని, 65 చీప్ సూపరింటెండెంట్లను విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, కరస్పాండెంట్లను నియమించినట్లు తెలిపారు. జిల్లాలో 65 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిద్దిపేట అర్బన్ మండలంలో 34, రూరల్‌లో 2, కొండపాకలో 6, గజ్వేల్‌లో 10, దుబ్బాకలో 8, హుస్నాబాద్‌లో 2, జగదేవ్‌పూర్‌లో1, చిన్నకోడూరు 1, నంగునూర్ 1, మొత్తం 65 పరీక్ష కేంద్రాల్లో జిల్లా వ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో డెస్కులు, పవర్ సప్లయ్, తాగునీటి సౌకర్యం, టాయ్‌లెట్స్ తదితర వౌళిక సదుపాయాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈకార్యక్రమంలో డీఆర్‌ఓ చంద్రశేఖర్,డీఈఓ రవికాంత్, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల నిర్వాహకులు పాల్గొన్నారు.