మెదక్

నాటి నుంచి నేటి వరకూ కేసీఆర్‌ది అదే తీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 12: రాజకీయాల్లోకి రానప్పటి నుంచి నేడు ముఖ్యమంత్రి అయ్యాక కూడా కేసీఆర్ బ్రోకర్ గిరీ నడిపిస్తున్నారని శాసన మండలి ప్రతిపక్ష కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం సంగారెడ్డిలో నిర్వహించిన మైనార్టీ గర్జన సభకు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ గల్ఫ్ ఏజెంటుగా ఉండి ఎంతో మందిని ఎగుమతి చేసిన ఘనత కేసీఆర్‌కు ఉందన్నారు. ఉద్యోగాల ఆశలు కల్పించి అనేక మంది యువకుల జీవితాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను తెలంగాణ గాంధీగా అభివర్ణిస్తున్నారని, డాకులు, చోరులు తెలంగాణ గాంధీ ఎలా అవుతాడని ప్రశ్నించారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా ఘోర బస్సు ప్రమాదంలో 57 మంది మృత్యువాత పడగా, 40 మందికిపైగా గాయపడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం స్పందించకుండా హైదరాబాద్‌కే పరిమితం కావడం సిగ్గు చేటన్నారు. దేశ వ్యాప్తంగా ఎంతో మంది స్పందించి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తే కాంగ్రెస్ పార్టీ నేతలకు గులాబి కండువాలు కప్పడం నీతిమాలిన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదం రాష్ట్రంలో అయితే సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహించే గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని తూప్రాన్‌లో రైల్వే ప్రమాదంలో 16 మంది చిన్నారి విద్యార్థులు మృతి చెందినా కనీసం స్పందించ లేదంటే ప్రజలపై ఉన్న చిత్తశుద్ధికి తార్కారమన్నారు. తెలంగాణ అమరులకు కేసీఆర్ చేసిందేమి లేదన్నారు. ఎంతో మంది చనిపోతే స్పందించని కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వద్దన్న టీడీపీ నాయకుడు హరికృష్ణ చనిపోతే వెళ్లడం, పైగా 450 గజాల స్థలాన్ని కేటాయించి స్మృతి వనం నిర్మించడం ఎంత వరకు సమంజసమో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. ప్రధాని మోదీతో ఒప్పందం కుదిరాకే శాసన సభను రద్దు చేసారని ఆరోపించారు. ఇఫ్తార్ విందులు లేకుండా ముస్లింలు ఎన్నడు పండుగలు చేసుకోలేదా, కేవలం ఇఫ్తార్ విందుల పేరిట ముస్లింలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ ఉద్దేశ పూర్వకంగానే అధికార పార్టీ జగ్గారెడ్డిని జైలుకు పంపించారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో జగ్గారెడ్డిని 50 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. జగ్గారెడ్డి సభలో లేకపోవడం బాదాకరమన్నారు. కంటతడి పెట్టిన నిర్మలాజగ్గారెడ్డి కాగా మనుషుల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన జగ్గారెడ్డి భార్య నిర్మలా జగ్గారెడ్డి బుధవారం నాటి మైనార్టీ గర్జన సభలో కంట తడిపెట్టుకోవడంతో సభలో విషాదం నింపింది. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపులకు కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ తమ కుటుంబాన్ని ఏం చేస్తుందోనన్న భయం అనుక్షణం వెంటాడుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. పట్టపగలు హత్యలు, ధమనకాండలు చేసే వారిని పట్టుకునే నాథుడు లేడని ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసే తన భర్తపై కేసు బనాయించి జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేసారు. ఎన్ని కేసులు బనాయించినా తమ కుటుంబం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు సేవ చేయడానికి సిద్దంగా ఉందన్నారు. ప్రజల అండ దండలే తమకు కొండంత అండగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ తవ్వుకున్న గుంతలో పడటం చాలా దూరం లేదని, తన శాపం ఆ పార్టీకి తప్పకుండా తగులుతుందన్నారు. సమావేశంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎంపీలు సురేష్‌షెట్కార్, మధుయాష్కి తదితరులు పాల్గొన్నారు.

కుల వృత్తులకు పెద్దపీట
* ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
సిద్దిపేట, సెప్టెంబర్ 12 : కుల వృత్తుల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ పెద్దపీట వేసినట్లు, అన్ని కులాల అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రణాళిక బద్ధంగా కృషిచేస్తున్నట్లు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో పశు సంవర్ధక శాఖలో పాడీ పశువులను, మత్స్యశాఖ ఆధ్వర్యంలో సబ్సీడీపై ద్వీచక్ర వాహనాలు, టాటా ఎసీ వాహనాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో అర్థిక స్వాలంభన సాధించేందుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకొచ్చినట్లు తెలిపారు. గొల్లకుర్మల అభివృద్ధి కోసం సబ్సీడీపై గొర్రెల పంపిణీ చేసినట్లు తెలిపారు. పాడీ పశువులను 75శాతం ఎస్సీలకు, 50 శాతం బీసీలకు అందచేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో 75 శాతం సబ్సిడీతో ద్వి చక్ర వాహనాలు, టాటా ఎసీ వాహనాలను అందచేస్తున్నట్లు తెలిపారు. అన్ని కులవృత్తుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని కులాల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, ఫారూఖ్‌హుస్సేన్‌లు తెలంగాణ సర్కార్ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషిచేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. ఆనంతరం రైతులకు పాడి పశువులను, మత్య్యకారులకు సబ్సీడీపై వాహనాలను అందచేశారు. ఈకార్యక్రమంలో మేకలు, గొర్రెల పెంపకం దారుల సంక్షేమ సంఘం చైర్మన్ రాజయ్య యాదవ్, తాజామాజీ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి, గొర్ల సంక్షేమ సంఘం నేతలు మరళీ యాదవ్, శ్రీహరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.