మెదక్

పర్యావరణ పరిరక్షణతో స్వచ్ఛ తెలంగాణకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట/టౌన్, సెప్టెంబర్ 12: మన పండుగలు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటు పర్యావరణ పరిరక్షణతో స్వచ్ఛ తెలంగాణకు కృషి చేయాలని మంత్రి హరీష్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లాకేంద్రంలోని కొత్త వెంకటేశ్వర ఆలయం వద్ద అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితి ట్రస్టు ఆధ్వర్యంలో పర్యావరణ (మట్టి) వినాయకులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలని, పండుగలు పర్యావరణానికి అనుగుణంగా వచ్చేవని..పర్యావరణాన్ని పాడుచేయకుండా భక్తశ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలన్నారు. తెలంగాణలో జరుపుకునే పండుగలు ప్రకృతికి సహజసిద్ధంగా ..పర్యావరణాన్ని పెంపొందించేలా ఉంటాయన్నారు. బతుకమ్మ, వినాయక చవితి ఉత్సవాల వల్ల చెరువులు, కుంటలు సహజ సిద్ధంగా పెంపొందేందకు దోహదమవుతాయన్నారు. భగవంతుని దయ, కృప ఎంత అవసరమో పర్యావరణాన్ని కాపాడుకోవడం అంత అవసరం అన్నారు. సిద్దిపేట కోమటిచెరువు అభివృద్ధి పనులతో ఆహ్లదకరంగా మారిందని, గణపతుల నిమజ్జనంతో చెరువు పరిరక్షణకు వచ్చే సంవత్సరానికి వినాయకుల నిమజ్జనానికి పాండ్ (నీటి కొలను) ఏర్పాటు చేస్తానన్నారు. దీంతో ప్రతి యేడు వినాయక విగ్రహాలు పాండ్‌లో నిమజ్జనం చేసుకోవచ్చన్నారు. అలాగే సిద్దిపేట పర్యావరణ పరిరక్షణలో ముందుంటుందని , హరితహారం నాల్గవ విడుతలో 50వేల మొక్కలు నాటడం జరిగిందన్నారు. సుడా పరిధిలో లక్షా యాభై వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం జరుగుతుందన్నారు. అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితి వారు చేస్తున్న కార్యక్రమాలు సిద్దిపేటకు మంచి పేరు తెస్తున్నాయని, మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు. అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితి అమర్‌నాథ్ తీర్థయాత్రలో అన్నదానం చేయడం, 8 సంవత్సరాలుగా సిద్దిపేటలో పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులు ఉచితంగా పంపిణీ చేయడం ఎంతో సంతోషించ దగిన విషయం అన్నారు. మట్టి వినాయకులు తీసుకోని పవిత్రంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి పర్యావరణానికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో గొర్లమేకల పెంపకందారుల సంక్షేమ సంఘం చైర్మన్ రాజయ్య యాదవ్, సూడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్ యాదవ్, కౌన్సిలర్ చిప్పప్రభాకర్, అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితి ప్రతినిధులు చీకోటి మధుసూదన్, కైలాసం, చిన్నా, బండ రాజయ్య, కుమ్మరికుంట రమేష్, నందిని శ్రీనివాస్, నాయకులు పాల సాయిరాం తదితరులు పాల్గొన్నారు.